పులిచింతల వద్ద పోటెత్తుతున్న వరద
Published Sun, Oct 26 2014 8:17 PM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM
పులిచింతల: కృష్ణా జిల్లాలోని పులిచింతల ప్రాజెక్ట్ వద్ద వరద పోటెత్తుతుంది. పులిచింతల ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లో వాగులు పొంగి పోర్లుతున్నాయని అధికారులు తెలిపారు.
పెద్ద మొత్తంలో వరద నీరు చేరుకోవడంతో 9 గేట్లు ఎత్తి 92 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. పులిచింతల ప్రాజెక్ట్ నుంచి విడుదల చేసిన నీరు ఈ రాత్రికి ప్రకాశం బ్యారేజ్ కు చేరే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
Advertisement
Advertisement