pulichintala
-
పులిచింతల గేట్ల ఎత్తివేత
సాక్షి, అమరావతి/అచ్చంపేట /విజయపురిసౌత్ /శ్రీశైలం ప్రాజెక్ట్ : నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలు పెద్ద మొత్తంలో వస్తుండటంతో పులిచింతల ప్రాజెక్టు సగం నిండింది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో పులిచింతల గేట్లు ఎత్తి, ప్రకాశం బ్యారేజికి నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు పులిచింతలలోకి 3,71,605 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. ప్రాజెక్టులో 157.48 అడుగుల్లో 22.75 టీఎంసీలను నిల్వ చేస్తూ దిగువకు 1,08,895 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. ఇక్కడ మంగళవారం ఉదయం 6 గంటలకు 10.65 టీఎంసీలున్న నిల్వ సాయంత్రం 6 గంటలకు 22.74 టీంసీలకు చేరింది. అంటే 12 గంటల్లోనే 12 టీఎంసీలకు పైగా జలాలు ప్రాజెక్టులోకి వచ్చాయి. సాగర్ నుంచి వరద కొనసాగుతుండటంతో నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజి గేట్లు కూడా బుధవారం ఎత్తివేయనున్నారు. బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు విడుదల చేయగా మిగులుగా ఉన్న జలాలను సముద్రంలోకి వదిలేయనున్నారు. సాగర్ కుడి, ఎడమ కాల్వలకు నీటి పెంపు సాగర్ ఆయకట్టుకు నీరందించే కుడి ఎడమ కాల్వలకు నీటిని పెంచారు. కుడి కాల్వకు 8,144 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8,193 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలోకి 3.71 లక్షల క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 3.71 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 883.2 అడుగుల్లో 205.66 టీఎంసీలను నిల్వ చేస్తూ.. పది గేట్లను 12 అడుగుల మేర ఎత్తి, కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 3.72 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. బ్యాక్‌వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 25 వేల క్యూసెక్కులు, మల్యాల ఎత్తిపోతలకు 254 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2.400 క్యూసెక్కులు వదిలారు. సాగర్‌లోకి 3.14 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 585.10 అడుగుల్లో 297.72 టీఎంసీలను నిల్వ చేస్తూ 22 గేట్లను పది అడుగుల మేర ఎత్తి, ప్రధాన కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 3.36 లక్షల క్యూసెక్కులను వదిలేస్తున్నారు. -
వడివడిగా ఒడిసిపడుతూ
సాక్షి, అమరావతి: కృష్ణా వరద ఉద్ధృతికి జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌లు నిండిపోవడంతో గేట్లు ఎత్తివేసి సముద్రంలోకి నీటిని వదిలేస్తున్నారు. కడలిలో కలిసే సమయంలో కృష్ణా జలాలను రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మళ్లించుకున్నా వాటిని నికర జలాల్లో(కోటా) కలపకూడదన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదనకు కృష్ణా బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో గత మూడేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడ్డ అన్ని ప్రాజెక్టులనూ వరద జలాలతో నింపాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ మేరకు శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కుడిగట్టు ప్రధాన కాలువ ద్వారా వరద జలాలను తరలిస్తూ– తెలుగుగంగ, గాలేరు–నగరి సుజల స్రవంతి, శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ)లో అంతర్భాగమైన ప్రాజెక్టులను నింపడంలో అధికారులు నిమగ్నమయ్యారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 14 వేల క్యూసెక్కులతో ప్రారంభించి గరిష్టంగా 44 వేల క్యూసెక్కులను తరలించి ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన నింపేలా చర్యలు చేపట్టారు. శ్రీశైలం ప్రాజెక్టులో మల్యాల ఎత్తిపోతల నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతి కాలువలోకి 1,688 క్యూసెక్కులను ఎత్తిపోస్తున్నారు. గత మూడేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ సామర్థ్యం కంటే అధికంగా అంటే 40 టీఎంసీల కంటే ఎక్కువగా తరలించి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసేలా చర్యలు చేపట్టారు. ఎన్నడూ లేని రీతిలో పెన్నా బేసిన్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో ప్రాజెక్టులకు జలకళ చేకూరింది. కృష్ణా ఉప నదులైన వేదవతి, హంద్రీలు ఉరకలెత్తుతుండటంతో వాటిపై ఉన్న భైరవానితిప్ప ప్రాజెక్టు, గాజులదిన్నె ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. తుంగభద్ర డ్యామ్‌లో పుష్కలంగా నీటి లభ్యత ఉండటంతో ఎగువ ప్రధాన కాలువ(హెచ్చెల్సీ), దిగువ కాలువ(ఎల్లెల్సీ)లకు కోటా జలాలు వస్తాయి. తుంగభద్ర డ్యామ్ దిగువన తుంగభద్రలో నీటి లభ్యత మెరుగ్గా ఉండటంతో కేసీ కెనాల్ ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందనున్నాయి. గత మూడేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో రికార్డు స్థాయిలో పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. -
‘పులిచింతల ప్రాజెక్టు వద్ద వైఎస్సార్ విగ్రహం’
సాక్షి, పులిచింతల: పులిచింతల ప్రాజెక్టు వద్ద దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. ‘పులిచింతల జల హారతి’ కార్యక్రమంలో అనిల్ కుమార్ తోపాటు రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రులు కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, చీరె, సారెలను సమర్పించారు. అనంతరం పులిచింతల ప్రాజెక్టును మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మీడియాతో మాట్లాడుతూ.. పులిచింతల ప్రాజెక్టు వద్ద సుమారు 45 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే వైఎస్సార్ స్మృతి వనం, పార్కును నిర్మిస్తామని తెలిపారు. వైఎస్సార్ విగ్రహంతో పాటు డా. కెఎల్ రావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పులిచింతల ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. రోడ్లు, భవనాలతోపాటు, నాలుగు కిలోమీటర్ల పాటు దిగువన ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాలను కలుపుతూ వారధి నిర్మిస్తామని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రాజెక్టు వద్ద స్థలాన్ని పరిశీలించినట్టు వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మించిన తర్వాత మొట్టమొదటి సారిగా పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం శుభపరిణామం అన్నారు. మరో ఇరవై ఏళ్ల పాటు రాష్ట్రంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ప్రభుత్వ విప్ సామినేని, ఎమ్మెల్యేలు నంబూరి శంకర్ రావు, జోగి రమేశ్ పాల్గొన్నారు. -
పులిచింతలలో కనీస మట్టాలుంచాలి
కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వ వినతి సాక్షి, హైదరాబాద్: పులిచింతల నీటిపై ఆధారపడి ఎత్తిపోతల పథకాల కింద వేసిన పంటలను కాపాడేలా చర్యలు తీసు కోవాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు బోర్డుకు లేఖ రాశారు. పులిచింతల నీటితో నల్లగొండ జిల్లాలో 9 ఎత్తిపోతల పథకాలు పనిచేస్తు న్నాయని, నీటినంతా తోడేస్తుండటంతో వీటికి నీరందడం లేదన్నారు. పెద్దవీడు, మహంకాళీగూడెం,చింత్రియాల, రేపల్లె, అడూకలరు, నక్కగూడెం ఎత్తిపోతల పథ కాల కింద 2,965 ఎకరాల ఆయకట్టు ఉం దన్నారు. పులిచింతలలో కనీస నీటి మట్టం 140 అడుగులు కాగా, ప్రస్తుతం దాని దిగువన తోడేస్తున్నారని, దీంతో ఈ పథకాలకు నీరందక పంటలు ఎండిపోతు న్నాయన్నారు. స్పందించిన బోర్డు, కనీస నీటిమట్టాలుండేలా చర్యలు తీసుకోవా లని మంగళవారం ఏపీని ఆదేశించింది. -
ఆయన అబద్ధాలు శృతిమించుతున్నాయి..
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దాలు శృతి మించుతున్నాయని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ..పులిచింతలపై ఉత్తమ్ మాట్లాడుతున్నవన్నీ అబద్దాలేనని స్పష్టం చేశారు. ఉత్తమ్ చెప్పిన దాంట్లో పులిచింతల హుజుర్ నగర్లో ఉందనేది మాత్రమే నిజమన్నారు. 2006లో పులిచింతల హైడల్ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు వచ్చినా కాంగ్రెస్ హాయంలో తట్టెడు మన్ను కూడా తీయలేదన్నారు. అపుడు ఆంధ్రా సీఎంలకు భయపడి ఉత్తమ్ లాంటి వారు పులిచింతలపై మాట్లాడలేదన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకే 2015లో పులిచింతల హైడల్ ప్రాజెక్టు డీపీఆర్ 563 కోట్ల రూపాయలతో రూపొందిందని తెలిపారు. కేసీఆర్ చొరవతోనే విద్యుత్ ప్రాజెక్టులు వేగిరంగా పూర్తవుతున్నాయని చెప్పారు. భూపాలపల్లి , కడప థర్మల్ ప్లాంట్లు ఒకేసారి మొదలయ్యాయి..భూపాలపల్లి పూర్తయితే కడప ప్లాంటు ఎందుకు పూర్తి కాలేదో కాంగ్రెస్ నేతలు చెప్పాలని కోరారు. ప్రాజెక్టులను ఆపేందుకు కాంగ్రెస్ నేతలు ట్రిబ్యునళ్ల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. అరవై సంవత్సరాల్లో కాంగ్రెస్ ఆరు వేల మెగావాట్ల కరెంటు యిస్తే గత మూడేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం 12 వేల మెగావాట్ల కరెంటు ఇచ్చిందని స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రం లో విద్యుత్ ఉత్పాదనను 28 వేల మెగావాట్లకు పెంచుతామన్నారు.మేము విద్యుత్ పై చెప్పిన గణాంకాలు తప్పుంటే ఉత్తమ్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. విద్యుత్ పై కాంగ్రెస్ నేతలు అబద్దాలు ఆడటం మానుకోవాలని సూచించారు. -
‘కృష్ణా’పై మీ వాదన అంగీకరించం
తెలంగాణకు మరోసారి బోర్డు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటిని 37:63 నిష్పత్తిన పంచాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదనను అంగీకరించేది లేదని కృష్ణా బోర్డు మరోమారు స్పష్టం చేసింది. శ్రీశైలం, సాగర్, జూరాల, తుంగభద్ర డ్యామ్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలతో మైనర్ ఇరిగేషన్ కింద ఉన్న మొత్తం కేటాయింపులను పరిగణనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే 37:63 నిష్పత్తిన ఇరు రాష్ట్రాలకు వాటా దక్కుతుందని తెలిపింది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతం లభ్యతగా ఉన్న జలాల్లో 25 టీఎంసీలు తమకు కేటాయించాలని, పట్టిసీమ కింద ఏపీ చేసిన వినియోగాన్ని, మైనర్ ఇరిగేషన్ కింద తాము చేసిన నీటి వినియోగాన్ని లెక్కలోకి తీసుకున్నా తమకు అధిక వాటా దక్కుతుందని తెలంగాణ రాసిన లేఖపై బోర్డు వివరణ ఇచ్చింది. పులిచింతలలో కనీస నీటిమట్టం ఉంచండి.. పులిచింతల ఫోర్‌షోర్ నీటిపై ఆధారపడి 8 ఎత్తిపోతల పథకాల కింద తెలంగాణ రైతులు వేసిన పంటలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్‌కు సూచించింది. ఈ మేరకు మంగళవారం ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. -
పులిచింతల నిర్వాసితులను పట్టించుకోరా..?
బెల్లంకొండ: పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వస్వం వీడి పునరావాస కేంద్రాలకు వచ్చిన తమను ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు జిల్లా జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని మాచాయపాలెం పునరావాస కేంద్రాల్లో మంగళవారం జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు. మొదట మండలంలోని పాపాయపాలెం గ్రామంలో మండల అధికారులు జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పునరావాస కేంద్రాల్లో జరిగిన కార్యక్రమంలో బాధితులు వారి సమస్యలను జేసీకి వివరించారు. తాము ఇక్కడకు వచ్చి దాదానుగా ఆరేళ్లు దాటినా ఇంతర వరకూ ప్రత్యేక పంచాయతీగా గుర్తించలేదని తెలిపారు. సైడ్ డ్రైనేజీలు లేవని, పుశువులు మేతకు వెళ్లేందుకు డొంక లేదని తెలిపారు. శ్మశానం లేక పోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని, మంచి నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని జేసీ శుక్లా హామీ ఇచ్చారు. ఎంపీడీవో సీహెచ్ బ్రమరాంబ, సర్పంచ్ నూన్సావతు బుజ్జికుమారి బాయి, ఎంపీటీసీ సభ్యుడు నరసింహానాయక్, పులిచింతల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవసహాయం, మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వరరెడ్డి, డిప్యూటీ తహశీల్ధార్ ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పులిచింతల నిర్వాసితులను పట్టించుకోరా..?
పులిచింతల నిర్వాసితులను పట్టించుకోరా..? పులిచింతల, నిర్వాసితులు, నిర్లక్ష్యం pulichintala, vicktims, negligecy 3పీడీపీ81–బాధితుల సమస్యలు వింటున్న జేసీ కృతికా శుక్లా, అధికారులు బెల్లంకొండ: పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వస్వం వీడి పునరావాస కేంద్రాలకు వచ్చిన తమను ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు జిల్లా జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని మాచాయపాలెం పునరావాస కేంద్రాల్లో మంగళవారం జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు. మొదట మండలంలోని పాపాయపాలెం గ్రామంలో మండల అధికారులు జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పునరావాస కేంద్రాల్లో జరిగిన కార్యక్రమంలో బాధితులు వారి సమస్యలను జేసీకి వివరించారు. తాము ఇక్కడకు వచ్చి దాదానుగా ఆరేళ్లు దాటినా ఇంతర వరకూ ప్రత్యేక పంచాయతీగా గుర్తించలేదని తెలిపారు. సైడ్ డ్రైనేజీలు లేవని, పుశువులు మేతకు వెళ్లేందుకు డొంక లేదని తెలిపారు. శ్మశానం లేక పోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని, మంచి నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని జేసీ శుక్లా హామీ ఇచ్చారు. ఎంపీడీవో సీహెచ్ బ్రమరాంబ, సర్పంచ్ నూన్సావతు బుజ్జికుమారి బాయి, ఎంపీటీసీ సభ్యుడు నరసింహానాయక్, పులిచింతల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవసహాయం, మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వరరెడ్డి, డిప్యూటీ తహశీల్ధార్ ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పులిచింతల ముంపువాసులను ఆదుకోవాలి
హుజూర్నగర్ : పులిచింతల ముంపు వాసులను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి కోరారు. శుక్రవారం పట్టణ ంలోని శ్రీలక్ష్మీగార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదతో పులిచింతల ప్రాజెక్ట్‌లో 30 టీఎంసీల నీటిని ఏపీ ప్రభుత్వం నిల్వ చేసిందన్నారు. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌తో ముంపుగ్రామాలు జల దిగ్బంధంలోకి వెళ్లినప్పటికీ ఇంకా కొంత మంది ముంపువాసులకుపరిహారం, పునరావాసం కల్పించకపోవడం శోచనీయమన్నారు. మట్టపల్లి వద్ద ముంపుకు గురైన మత్స్యకార్మికులకు ఇళ్ల స్థలాలివ్వాలని డిమాండ్ చేశారు. వర్షాలకు దెబ్బతిన్న పత్తి, మిర్చి, వరి పంటల రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు తిరుందాసుగోపి, పారేపల్లి శేఖర్‌రావు, పులిచింతల వెంకటరెడ్డి, వట్టికూటి జంగమయ్య, అనంతప్రకాశ్, యాకూబ్, వట్టెపు సైదులు, పాండునాయక్, ములకలపల్లి సీతయ్య, శీలం శ్రీను, నగేష్, రోషపతి, పల్లె వెంకటరెడ్డి, వెంకటచంద్ర, వినోద పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంలో విఫలం
రేబల్లె(మేళ్లచెర్వు) : పులిచింతల మనక గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆయన మంగళవారం మండలంలోని రేబల్లె గ్రామాన్ని సందర్శించి అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పులిచింతల ముంపు గ్రామాల వారికి పునరావాసం కల్పించేందుకు రూ. 565 కోట్లు ప్రకటించిందన్నారు. వాటిలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో 460 కోట్లకు పైగా ఇప్పించినట్లు పేర్కొన్నారు. మిగిలి ఉన్న వంద కోట్ల రూపాయలు ఇప్పించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి 27 నెలల కాలం గడిచినా కూడా ఇప్పించలేక పోయారన్నారు. తమ్మవరంలో 55 కుటుంబాలకు, రేబల్లెలో 400 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కలెక్టర్‌కు ఫోన్ ద్వారా విన్నవించారు. పులిచింతల మునక ప్రజలకు రావాల్సిన ప్యాకేజీ, ఇళ్ల స్థలాలు, నష్టపరిహారం అందించే వరకూ వారి తరపున పోరాడతామన్నారు. ఈ సమావేశంలో కాకునూరి భాస్కర్‌రెడ్డి, కర్నె ప్రతాపరెడ్డి, నాగిరెడ్డి, మోర్తాల వెంకటరెడ్డి, జె.గురవయ్య యాదవ్, జాలాది వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరెడ్డి, జక్కుల శంభయ్య, రామచంద్రయ్య, శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పులిచింతలకు కొనసాగుతున్న వరద
పులిచింతల ప్రాజెక్టు(మేళ్లచెర్వు): రెండు రోజులుగా కురుస్తున్న వానలతో పాటు మూసీ నది నుంచి నీటితో మండలంలోని పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టులో 30 టీఎంసీల నీటిని నిల్వ చేసి, ఆ పైన వస్తున్న నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం 1.60 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో అంతే మెుత్తంలో నీటిని నాలుగు గేట్లు ఎత్తి విడుదల చేస్తున్నారు. భారీగా పెరిగిన సందర్శకులు మండలంలోని పులిచింతల ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరడంతో పాటు దిగువకు నీటిని విడుదల చేస్తుండండతో శుక్రవారం సందర్శకులు భారీగా తరలివచ్చారు. మండలంలోని చుట్టుప్రక్కల గ్రామాలతో పాటు కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చారు. -
పులిచింతల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి
పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 54.34 మీటర్లు కాగా..ప్రస్తుతం నీటిమట్టం 49.9 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టులో 30 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 1,11,191 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుండగా అంతే మొత్తంలో నీటిని అధికారులు బయటికి వదులుతున్నారు. -
పులిచింతలలో నీటి నిల్వకు సహకరించాలి
మేళ్లచెర్వు : మండలంలోని పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వకు నిర్వాసితులు సహకరించాలని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. ఆయన బుధవారం నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండలంలోని పులిచింతల ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టులో 30 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేయనున్నట్లు దానికి గుంటూరు,నల్లగొండ జిల్లాల్లోని ప్రజలు సహకరించాలన్నారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు నీటి పంపకంలో సమన్యాయం పాటించనున్నట్లు చెప్పారు. ఆయన వెంట జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, వెంకటేశ్వరరావు, సీఈ సుధాకర్, ఎస్ఈ వెంకటరమణ తదితరులున్నారు. -
పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద
జగ్గయ్యపేట : తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని ముక్త్యాల సమీపంలోని పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 42 టీఎంసీలు. అయితే మంగళవారం సాయంత్రానికి 19.7 టీఎంసీల నీరు వచ్చి చేరిందని పులిచింతల డీఈ రఘనాథ్ తెలిపారు. ప్రాజెక్టు వద్ద ఎప్పటికప్పుడు నీటి నిల్వను పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారమిస్తున్నట్లు చెప్పారు. -
పెదబాబు డైరెక్షన్లో చినబాబు యాక్షన్
సాగునీటిలో అవినీతి సునామీ! అధికారులపై కీలకమంత్రి వత్తిళ్లు అదనపు చెల్లింపులు.. అందులో వాటాలు.. నాలుగు ప్రాజెక్టుల్లో రూ. 748 కోట్ల లూటీ ఏవో కుంటిసాకులు చూపించడం.. జరుగుతున్న పనులను ఆపేయడం.. కాంట్రాక్టులు రద్దు చేయడం.. ఆ తర్వాత అవే కాంట్రాక్టు పనుల అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేయడం.. ఆ కాంట్రాక్టులను సొంత మనుషులకు కట్టబెట్టడం.. యథేచ్ఛగా ప్రజా ధనాన్ని లూటీ చేయడం... ఇదీ సాగునీటి రంగంలో సాధించిన ప్రగతి. పెదబాబు డైరెక్షన్లో, చినబాబు నాయకత్వంలో... కాంట్రాక్టర్ల ముసుగులో ఉన్న అధికార పార్టీ ఎంపీలు, బినామీ కాంట్రాక్టర్లు అందినకాడికి దోచుకుంటున్నారు. వాటాలు పంచుకు తింటున్నారు. ఇరిగేషన్లో అవినీతిని ఏరులుగా పారిస్తున్నారు. పెదబాబు, చినబాబు, వీరికి తోడైన మంత్రి అవినీతి లీలలకు సాగునీటి శాఖ అధికారులు నివ్వెరపోతున్నారు. అవినీతి కోసం వేసిన సరికొత్త బాటలు చూసి అవాక్కవుతున్నారు. ఇరిగేషన్లో ‘బాబు’ల అవినీతి వ్యవహారాలకు మచ్చుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం. రూ. 748 కోట్లు లూటీ చేసిన ఓ నాలుగు ప్రాజెక్టులను పరిశీలిద్దాం.. ‘ఘోర’కల్లులో రూ.350 కోట్లు ఓ ప్రాజెక్టు పనులు 92 శాతం పూర్తయ్యాయి. బిల్లులూ చెల్లించేశారు. మిగిలిన 8 శాతం పనులకు ఎంత ఖర్చవుతుంది? ఖర్చులు పెరిగాయనుకున్నా ఎంత ఉండవచ్చు. మహా అయితే మిగిలిన బిల్లు రెట్టింపు.. కానీ 92 శాతం పనులకు ఎంత చెల్లించారో మిగిలిన 8 శాతం పనులకు అంత చెల్లించబోతున్నారు. ఆ మేరకు అంచనా వ్యయం పెంచేసి పంచుకోబోతున్నారు. ఆ కథేమిటో చూద్దామా... ప్రాజెక్టు వివరాలివీ: గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా శ్రీశైలం కుడి ప్రధాన కాలువ(ఎస్ఆర్బీసీ) 56.77 కి.మీల వద్ద 12.44 టీఎంసీల సామర్థ్యంతో కర్నూల్ జిల్లాలోని గోరకల్లులో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. శ్రీశైలం జలాశయానికి వరద వచ్చినప్పుడు ఎస్ఆర్బీసీ ద్వారా తరలించి, గోరకల్లు రిజర్వాయర్‌లో నిల్వ చేసి గాలేరు-నగరి సుజల స్రవంతి ఆయకట్టుకు నీళ్లందించడానికి ఈ ప్రాజెక్టు ఉద్దేశించింది. ఈ రిజర్వాయర్ పనులకు 2005లో టెండర్ పిలిచారు. సాబీర్-షూ-ప్రసాద్(జాయింట్ వెంచర్) సంస్థ 14.33 శాతం తక్కువ ధరకు కోట్ చేసి.. రూ.448.20 కోట్లకు పనులను చేజిక్కించుకుంది. ఈ జాయింట్ వెంచర్లో సింహభాగం వాటా టీడీపీ మాజీ మంత్రికి చెందిన సాబీర్ సంస్థదే కావడం గమనార్హం. ఇప్పటికే 92 శాతం పనులను పూర్తి చేసిన కాంట్రాక్టర్ రూ.428 కోట్లను బిల్లుల రూపంలో పొందారు. మరో రూ.20.20 కోట్ల విలువైన 8 శాతం పనులు మాత్రమే చేయాల్సి ఉంది. అవినీతి స్కెచ్ ఇలా గోరకల్లు ప్రాజెక్టులో తట్టెడు మట్టెత్తకుండానే రూ.350 కోట్లు కొట్టేసేందుకు ‘మాస్టర్’ప్లాన్ వేశారు. పెదబాబు డెరైక్షన్‌లో కీలక మంత్రి చక్రం తిప్పారు. అధికారపార్టీకి చెందిన మాజీ మంత్రి అయిన కాంట్రాక్టర్‌తో కలసి మాస్టర్‌ప్లాన్ అమలుకు పూనుకున్నారు. జలాశయంలోకి నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఇన్‌ఫాల్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడాన్ని సాకుగా చూపి అంచనా వ్యయాన్ని రూ.448.20 కోట్ల నుంచి రూ.840.34 కోట్లకు పెంచేశారు. అదనపు పని విలువ రూ.42.17 కోట్లకు మించదని జలవనరుల శాఖ అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. తక్కిన రూ.350 కోట్లను కాంట్రాక్టర్‌తో కలసి పెదబాబు దోచుకోవడానికి రంగం సిద్ధం చేశారు. పులిచింతలలో రూ. 300 కోట్లు ప్రాజెక్టు పూర్తి చేయకుండా కాంట్రాక్టరే జాప్యం చేశాడు. ధరలు పెరిగాయి కాబట్టి అదనంగా చెల్లించాలన్నాడు. జిల్లా కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కోర్టు చెప్పినదానికన్నా ఇంకా అదనంగా తనకు డబ్బురావాల్సి ఉందని కాంట్రాక్టరు వాదిస్తున్నాడు. పై న్యాయస్థానానికి వెళ్లి ప్రజాధనాన్ని కాపాడేందుకు ప్రయత్నించాల్సిన రాష్ర్టప్రభుత్వం కాంట్రాక్టరుకు అదనంగా చెల్లించడానికి సిద్ధమౌతోంది. ఇదీ ప్రాజెక్టు కృష్ణా డెల్టాలో 12.57 లక్షల ఎకరాల ఆయకట్టుకు సకాలంలో నీళ్లందించాలన్న లక్ష్యంతో కృష్ణా నదిపై నాగార్జునసాగర్‌కు 121 కి.మీల దిగువన.. ప్రకాశం బ్యారేజీకి 83 కి.మీల ఎగువన పులిచింతల ప్రాజెక్టుకు అక్టోబర్ 15, 2004న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.268.87 కోట్లతో చేపట్టిన పులిచింతల హెడ్ వర్క్స్ పనులను టీడీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ సంస్థ చేజిక్కించుకుంది. టెండర్ ఒప్పందం ప్రకారం పనులను మార్చి 31, 2007 నాటికే పూర్తి చేయాలి. అప్పట్లో ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినా పనులను పూర్తిచేయడంలో కాంట్రాక్టు సంస్థ తీవ్ర జాప్యం చేసింది. ఒకానొక దశలో చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవడంతో పనుల్లో కొంత కదలిక వచ్చింది. భారీ దోపిడీకి స్కెచ్ ఇలా పెదబాబు వ్యూహం మేరకు .. 2014 నుంచి వడ్డీతో కలిపి మొత్తం రూ.300 కోట్లు చెల్లించాలంటూ పులిచింతల కాంట్రాక్టర్ జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్‌కు లేఖ రాశారు. అదనంగా రూ.300 కోట్లు ఇవ్వాలంటూ కాంట్రాక్టర్ అలా లేఖ రాశారో లేదో పెదబాబు సూచనల మేరకు మంత్రి ఇలా స్పందించారు. కృష్ణా జిల్లా ప్రిన్సిపల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం తరఫున హైకోర్టును ఆశ్రయించాల్సిన మంత్రి తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. యాసిడ్ దాడి బాధితురాలికి అదనపు పరిహారం చెల్లించకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడిన చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టరుకు మాత్రం అదనంగా చెల్లించడానికి ఉత్సాహపడుతోంది. పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్టర్‌కు తక్షణమే రూ.300 కోట్లు చెల్లించాలంటూ ఆ శాఖ ఉన్నతాధికారులపై మంత్రి ఒత్తిడి తెస్తున్నారు. పులిచింతల కాంట్రాక్టర్‌తో ఆది నుంచి ఉన్న సంబంధాలు.. పెదబాబు డెరైక్షన్‌లో వాటాలు పంచుకోవడానికి ఒప్పందం కుదరడం వల్లే మంత్రి ఒత్తిడి తెస్తున్నారంటూ జలవనరుల శాఖ కీలక అధికారి ఒకరు ‘సాక్షి’తో ధృవీకరించడం గమనార్హం. హంద్రీ-నీవాలో రూ. 54 కోట్లు నచ్చినవారి కోసం ‘జరుగుతున్న పనులు’ రద్దు చేశారు. అంచనా వ్యయం పెంచి నిబంధనలకు విరుద్ధంగా అప్పగించారు. మూడొంతుల పనులకు బిల్లులూ చెల్లించేశారు. ఈ దశలో ఆ కాంట్రాక్టరును తప్పించి మరో బినామీ కాంట్రాక్టరును తెరపైకి తెచ్చారు. ఒక వంతు పనికి గాను ప్రాజెక్టు వ్యయానికన్నా రెట్టింపునకు పెంచేశారు. పెంచిన మొత్తాన్ని పంచుకోవడానికి పథకమేశారు. అదేమిటో మీరే చూడండి... ప్రాజెక్టు వివరాలివీ హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 40 టీఎంసీలను ఎత్తిపోసి రాయలసీమలో 4.04 లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా హంద్రీ-నీవా ప్రధాన కాలువ సమీపంలో చిత్తూరు జిల్లా కేవీ పల్లె మండలం అడవిపల్లె వద్ద 1.089 టీఎంసీల సామర్థ్యంతో ఓ రిజర్వాయర్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఈ రిజర్వాయర్‌కు నీళ్లందాలంటే చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలంలోని గొల్లపల్లె నుంచి వైఎస్సార్ కడపజిల్లా చిన్నమండ్యం మండలంలో కోటగడ్డకాలనీ వరకు 4.54 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వాలి. 4.54 కిమీల సొరంగం పనులతోపాటూ 1.1 కిమీల ప్రధాన కాలువ తవ్వకం పనులను 20వ ప్యాకేజీ కింద రూ.45.57 కోట్లకు ఏకేఆర్ కోస్టల్ అనే సంస్థ తొలుత చేజిక్కించుకుంది. ప్రధాన కాలువ 1.1 కిమీల తవ్వకం పనులను పూర్తి చేసిన ఆ సంస్థ.. 800 మీటర్ల మేర సొరంగం పనులనూ పూర్తి చేసింది. ఇందుకు ఆ సంస్థకు రూ.18.97 కోట్లను బిల్లుల రూపంలో చెల్లించారు. దోపిడీకి స్కెచ్ ఇలా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సొంత పార్టీ నేతలకు పనులు కట్టబెట్టి.. నిధులు దోచిపెట్టడానికి పెదబాబు ఎత్తులు వేశారు. ఆ క్రమంలోనే పనులు చేయడం లేదనే సాకు చూపి సొరంగం పనులను రద్దు చేసి, ఏకేఆర్ కోస్టల్ సంస్థ చేయగా మిగిలిన పనులను అంటే 3.74 కిమీల సొరంగం పనులను రూ.28.6 కోట్లకు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే కన్స్ట్రక్షన్స్ సంస్థకు ఏకంగా ‘నామినేషన్’పై అప్పగించేశారు.రూ.పది లక్షల విలువైన పనులను మాత్రమే నామినేషన్‌పై అప్పగించవచ్చు. అంటే.. సొంత పార్టీ నేతకు పనులు కట్టబెట్టడానికి నిబంధనలు తుంగలో తొక్కారన్నమాట. ఆర్కే కన్స్ట్రక్షన్స్ సంస్థ 300 మీటర్ల పనులను మాత్రమే చేసింది. ఇందుకు ఆ సంస్థకు రూ.11.88 కోట్లు బిల్లులు చెల్లించారు. తక్కిన రూ.16.77 కోట్ల విలువైన పనులను రద్దు చేసి.. అంచనాలు పెంచేసి మరో బినామీ కాంట్రాక్టర్‌కు అప్పగించి..దోపిడీ చేయడానికి సిద్ధమయ్యారు. ఆమేరకు అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.70.82 కోట్లకు పెంచేసి టెండర్లు పిలిచారు. అంటే రూ. 54 కోట్ల మేర కాజేయడానికి రంగం సిద్ధం చేశారన్నమాట. అవుకులో రూ.44 కోట్ల లూటీ వాటాల వ్యవహారంలో తేడాలు రావడంతో రెండు ప్రాజెక్టులలో అదనపు దోపిడీ గురించి బైటపడింది. ఓ ఎంపీ, మంత్రి ఒకరి విషయం మరొకరు బైటపెట్టుకున్న ఉదంతమిది. ధరలేవీ పెరగకపోయినా కుంటిసాకులు చెప్పి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని భారీగా పెంచేశారు. ఇద్దరికీ పెదబాబు రాజీ కుదర్చడంతో ఆ అదనపు బిల్లులను ప్రభుత్వం చెల్లించేసింది. ఈ వివరాలేమిటో చూద్దామా..? ప్రాజెక్టు వివరాలివీ గాలేరు - నగరి సుజల స్రవంతి పథకం (జీఎన్ఎస్ఎస్)లో భాగంగా అవుకు సొరంగం పనులు చేపట్టారు. జీఎన్ఎస్ఎస్ వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని అవుకు రిజర్వాయర్‌కు తరలించడానికి వీలుగా అవుకు టన్నెల్ -2 తవ్వకం పనుల (30వ ప్యాకేజీ) ని రూ. 401 కోట్లకు ఎన్సీసీ - మేటాస్ (జాయింట్‌వెంచర్) సంస్థ చేజిక్కించుకుంది. దోపిడీ పథకమిదీ టన్నెల్ తవ్వకంలో బండరాళ్లు అడ్డురావడం, మట్టిపెళ్లలు విరిగిపడడం వల్ల అలైన్మెంట్ మార్చాల్సి వచ్చిందనే కుంటిసాకులు చూపుతూ 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల పని అదనంగా చేయాల్సి వచ్చిందంటూ 2015 అక్టోబర్‌లో ఎన్సీసీ - మేటాస్ సంస్థ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాసింది. అదనంగా చేసిన పనికి రూ. 44 కోట్లు చెల్లించాలని కోరింది. ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్రక్షన్ (ఈపీసీ) నిబంధనల ప్రకారం అదనంగా చేసిన పనికి ఎలాంటి బిల్లులు చెల్లించనక్కరలేదు. అందులోనూ డీజిల్, పెట్రోలు, ఇనుము ధరలు తగ్గాయి. సిమెంట్ ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ పెదబాబు, చినబాబుల డెరైక్షన్‌లో కాంట్రాక్టర్‌కు రూ. 44 కోట్లు అదనంగా చెల్లించాలంటూ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులపై తీవ్రఒత్తిడి తీసుకొచ్చారు. ఇదే ప్రాజెక్టులో 29 వ ప్యాకేజీలో మిగిలిపోయిన రూ.12 కోట్ల విలువైన పనులను రద్దు చేసి రూ. 110 కోట్లకు పెంచి తెలుగుదేశం ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్కు కట్టబెట్టారు. అందులో రూ. 35 కోట్లను చెల్లించేశారు. అది తనకు తెలియకుండానే జరిగిందని జలవనరులశాఖ మంత్రి దేవినేని వ్యాఖ్యానించడంతో కినుక వహించిన సీఎం రమేశ్ 30వ ప్యాకేజీలో అదనంగా చెల్లించబోతున్న రూ. 44 కోట్ల సంగతిని బయటపెట్టారు. అయితే ఇద్దరి మధ్య పెదబాబు రాజీ కుదర్చడంతో ఆ తర్వాత వివాదాలన్నీ సమసిపోయాయి. 30వ ప్యాకేజీలో రూ.44 కోట్ల బిల్లును ప్రభుత్వం చెల్లించేసింది. -
ఈ నీళ్లు ఏ మూలకు?
సాగర్ నుంచి ఇప్పటివరకు 3.68 టీఎంసీలు విడుదల కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చెరువులను చేరని తాగునీరు సాక్షి, విజయవాడ బ్యూరో :కృష్ణా, గుంటూరు జిల్లాలకు తాగునీటి సరఫరా చేసే విషయంలో జలవనరులు, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తాగు నీటి కోసం కృష్ణాడెల్టాకు కేటాయించిన 4 టీఎంసీలు ప్రజల అవసరాలకు సరిపోవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులుగా ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదల చేస్తున్న నీరు కాల్వల్లో ప్రవహిస్తుందేగానీ, చెరువులకు చేరడం లేదు. కాల్వల విడుదల సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అతి తక్కువ పరిమాణంలో నీటిని వదలడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. నేడో రేపో సాగర్ నుంచి నీటి విడుదల నిలిపి వేయనున్నప్పటికీ, ఇంకా 10 శాతం చెరువులు కూడా నిండలేదు. తాగునీటి అవసరాలకు 4 టీఎంసీలు కృష్ణాడెల్టా పరిధిలోని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్న 480 మంచినీటి చెరువులను నింపితే గానీ మార్చి నుంచి ఎదురయ్యే తాగునీటి ఎద్దడి పరిష్కారం కాదు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 4 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం కృష్ణాడెల్టాకు మళ్లించాల్సి ఉంది. ఇందులో భాగంగా గత శుక్రవారం నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటి విడుదల జరుగుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో 10 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. ఇక్కడి నుంచి కృష్ణా తూర్పు, పశ్చిమ కాల్వలకు 4,981 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. గుంటూరు చానల్‌కు మరో 43 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శనివారం సాయంత్రం నుంచి అటు తూర్పు, ఇటు పశ్చిమ డెల్టా కాల్వలకు నీటి విడుదల జరుగుతున్నా తాగునీటి చెరువులు 10 శాతం కూడా నిండలేదు. తూర్పు, పశ్చిమ వైపు ఉన్న రెండు ప్రధాన కాల్వలకూ కనీసం 8 వేల క్యూసెక్కులు వదిలితేనే కాల్వ దిగువ వరకు వేగంగా ప్రవహించే వీలుంటుంది. 5 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న రైవస్, ఏలూరు కాల్వలకు 1000, 500 క్యూసెక్కుల చొప్నున విడుదల చేయడంతో మూడు రోజులుగా నీళ్లు ప్రయాణం చేస్తూనే ఉన్నాయి. ఇంకా రెండ్రోజులైతేనే చెరువులను చేరతాయి. పులిచింతలలో 1.20 టీఎంసీలు... నాగార్జునసాగర్ నుంచి విడుదల చేస్తున్న తాగునీటిలో 1.20 టీఎంసీలను పులిచింతల రిజర్వాయర్‌లో నిల్వ చేస్తున్నారు. మిగతా నీటిని మాత్రమే కిందకు విడుదల చేస్తున్నారు. ఈ నీటినే బ్యారేజీ అధికారులు రెండు జిల్లాల తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, పెదకాకాని మండలాల్లోని 100కు పైగా చెరువులకు తాగునీటి అవసరం ఉంది. కేటాయించిన 4 టీఎంసీల్లో ఇప్పటి వరకు 3.68 టీఎంసీలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇంకా 0.32 టీఎంసీలు మాత్రమే విడుదల చేయాల్సి ఉంది. ఉన్న నీరు సరిపోకపోతే పులిచింతల నీటిని వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. నీటిని కేవలం తాగు అవసరాలకే ఉపయోగించుకోవాలని, పంటల సాగు, చేపల చెరువుల కోసం వాడకూడదని విజయవాడ ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ వైఎస్ సుధాకర్‌రావు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఈ నీరు.. శివారుకు చేరేనా! దాహార్తి తీరేనా?
పులిచింతలకు 2.8 టీఎంసీలు చేరిక ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న నీటిమట్టం కాల్వలకు కొద్దికొద్దిగా నీటి విడుదల నాలుగు రోజుల్లో చెరువులకు తాగునీరు శివారుకు చేరికపై అనుమానాలు సాక్షి, విజయవాడ : కృష్ణా డెల్టాలో చెరువులు అడుగంటడంతో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. నాలుగు టీఎంసీలు విడుదల చేస్తామని అంగీకరించిన కృష్ణా యాజమాన్య బోర్డు ఆ మేరకు శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తోంది. ఆ నీరు ఇప్పుడిప్పుడే ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది. ఇరిగేషన్ అధికారులు ఆ నీటిని కొద్దికొద్దిగా కాలువలకు వదులుతున్నారు. చెరువులకు నీరందే సరికి మరో నాలుగైదు రోజులు పడుతుందని చెబుతున్నారు. అయితే ఈ నీటిలో శివారుకు ఎంత చేరుతుందనే అనుమానాలు ఆ ప్రాంతాల్లో వ్యక్తమవుతున్నాయి. పులిచింతలలో, ప్రకాశం బ్యారేజీలో నిల్వలు పోను విడుదల చేసే నీటిలో చెత్తా చెదారం వల్ల కొంత వృథాగా పోతుందని, మరికొంత ఇంకిపోతుందని చెబుతున్నారు. మిగిలిన నీటిలో అక్రమ మళ్లింపులు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులిచింతల వద్దకు 2.8 టీఎంసీల నీరు... ఎగువ నుంచి విడుదల చేసిన నీరు శనివారానికి పులిచింతల వద్దకు 2.8 టీఎంసీలు చేరింది. ఇందులో 1.2 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీకి వదిలారు. ఇప్పటివరకు ప్రకాశం బ్యారేజీ వద్ద 8.2 అడుగుల నీరు ఉండగా, ప్రస్తుతం వస్తున్న నీటితో 10.6 అడుగులకు చేరింది. బ్యారేజీ వద్ద 12 అడుగుల మేరకు నీటిని నిల్వ చేసి మిగిలినది కాల్వల ద్వారా చెరువులకు వదిలిపెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీలో కొంత నీరు చేరడంతో కొద్దికొద్దిగా కాల్వలకు వదులుతున్నారు. కాల్వలకు 3,212 క్యూసెక్కుల నీరు... కృష్ణాడెల్టా పరిధిలోని కాల్వలకు 3,212 క్యూసెక్కుల నీరు వదులుతున్నామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. రైవస్ కాల్వకు 503 క్యూసెక్కులు, ఏలూరు కాల్వకు 511, బందరు కాల్వలకు 152, అవనిగడ్డ, నాగాయలంక వైపు వెళ్లే కేఈబీ కాల్వకు 500, తెనాలి వైపు వెళ్లే కేడబ్ల్యూ కాల్వకు 1,516 , గుంటూరు చానల్‌కు 30 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. కాల్వల ద్వారా వదులుతున్న నీటితో జిల్లాలోని 370 చెరువులకు, బందరు, గుడివాడ మున్సిపాలిటీలకు నీరు ఇవ్వనున్నారు. పులిచింతల నుంచి వస్తున్న నీటి నుంచే విజయవాడ కార్పొరేషన్‌తో పాటు, ఎన్టీటీపీఎస్ అవసరాలకు ఉపయోగిస్తున్నారు. విడుదల చేసిన నీటిలో దాదాపు ఐదువేల క్యూసెక్కుల మేరకు కాలువల్లో పేరుకుపోయిన మురుగు, చెత్తాచెదారం పారదోలేందుకు పోతుందని అధికారులు చెబుతున్నారు. నీరంతా వృథా కాకుండా ఉండటం కోసం తొలుత బందరు కాల్వకు 500 క్యూసెక్కులు వదిలిన అధికారులు.. ప్రస్తుతం 152 క్యూసెక్కులకు తగ్గించారు. -
కృష్ణమ్మ చెంత.. దాహం కేకలు
కృష్ణమ్మ చెంత ఈ ఏడాది దాహం కేకలు తప్పేలా లేవు. వేసవి సమీపించకముందే ప్రకాశం బ్యారేజీ వద్ద నదినీటిమట్టం అడుగంటింది. జిల్లాలో చెరువులు కూడా ఎండిపోయాయి.దీంతో కృష్ణానది నీటిపై ఆధారపడేప్రాంతాలకు ఈ ఏడాది తీవ్ర తాగునీటిఎద్దడి ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ : కృష్ణా నదిలో నీటి నిల్వలు పూర్తిస్థాయిలో పడిపోయాయి. తాగేందుకు కూడా నీరందించే పరిస్థితి లేదు. దీంతో ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు కృష్ణా నీటి విడుదలపై మల్లగుల్లాలు పడుతున్నాయి. నదిలో నీరు డెడ్ స్టోరేజ్‌కి చేరుకోవడంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు చర్చించి మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌కు నాలుగు టీఎంసీల నీరు వదులుతున్నట్లు చెప్పినా ఇంతవరకు రాలేదు. పది రోజులు పట్టే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. పులిచింతలకు చేరింది 0.15 టీఎంసీలే. నాగార్జున సాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు ఒక టీఎంసీ నీటిని వదలగా అందులో ప్రాజెక్టుకు ఇప్పటివరకు 0.15 టీఎంసీల నీరు మాత్రమే చేరిందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కాలువల్లో నీరు ఇంకిపోవడం, ఆవిరి కావడం, కొంతమంది కాలువపై మోటార్లు పెట్టి నీటిని మళ్లించటం జరుగుతోంది. దీంతో నీరు సక్రమంగా బ్యారేజ్‌కు చేరే పరిస్థితి లేదు.50 మిలియన్ గ్యాలన్లు అవసరం రోజుకు విజయవాడ నగరానికి 50 మిలియన్ గ్యాలన్ల తాగునీరు అవసరం. కార్పొరేషన్ అధికారులు ప్రజల కోసం తాగునీటిని కృష్ణా నది నుంచే తీసుకుంటున్నారు. ఇందులో 15 మిలియన్ గ్యాలన్ల నీరు వృథాగా పోతోందని సమాచారం. అంటే నగరంలో ప్రజలకు ఉపయోగపడుతున్నది కేవలం 35 మిలియన్ గ్యాలన్లే. దీంతో కొండ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు తాగునీరందటం లేదు. మోటార్లు సైతం నీటిని పైకి అందించలేకపోతున్నాయి. పైపుల్లో నీరు లేకపోవటమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. గుంటూరు పట్టణ తాగునీటి అవసరాల కోసం కొంతమేరకు నీటిని గుంటూరు కెనాల్‌కు అందిస్తున్నారు. అందులో వారికీ పూర్తిస్థాయిలో నీరందే పరిస్థితి లేదు. సాగర్ నుంచి నీరు రాకుండా అందరికీ నీరందే అవకాశం లేదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఎన్టీటీపీఎస్కు నీరందేనా? ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)కు కృష్ణా నీటిని అందిస్తున్నారు. నదిలో నీటి మట్టం పూర్తిస్థాయిలో పడిపోవడంతో ఎన్టీటీపీఎస్కి కూడా నీటి సరఫరా ఆపివేసే పరిస్థితులు నెలకొన్నాయి. అదే జరిగితే విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుంది. దీంతో అనేక పట్టణాలు అంధకారంలోకి వెళతాయి. దీనిపై అధికారులు సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఎండిపోయిన చెరువులు... బందరు కాలువకు తాగునీటిని పూర్తిస్థాయిలో వదలాల్సి ఉంది. కేవలం కృష్ణా నీటిపైనే ఆధారపడి ప్రజలు జీవిస్తున్నారు. కృష్ణమ్మను నమ్ముకొని తూర్పు కృష్ణాలో చాలా మంది బోర్లు కూడా వేయలేదు. జిల్లా వ్యాప్తంగా చెరువులు ఎండిపోయాయి. దీంతో ఈ ఏడాది తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. బందరు కాలువకు 1.5 టీఎంసీల నీరు విడుదల కావాల్సి ఉంది. నదిలో నీరు అడుగంటుతుండటంతో ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో అధికారులు ఉన్నారు. -
పులిచింతల రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు
గుంటూరు : పులిచింతల రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. దాంతో అధికారులు తొమ్మిది గేట్లను 2 మీటర్ల మేర ఎత్తివేశారు. 90,740 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుత నీటిమట్టం 11.67 టీఎంసీలు ఉంది. మరోవైపు ప్రాజెక్ట్ పరిధిలోని ముంపు గ్రామాలకు నీటి ప్రవాహం రోజు రోజుకూ పెరుగుతోంది. నెల రోజుల నుంచి పులిచింతల ప్రాజెక్ట్ పరిధిలో నీరు నిల్వ ఉండటంతో ముంపు గ్రామాలైన పులిచింతల, కోళ్లూరు, గొల్లపేట, చిట్యాల, చిట్యాల తండా, బోదనం, గోపాలపురం, కామేపల్లి గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఆదివారం ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు చేరటం, అధిక వర్షాలు కురవటంతో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. ముంపు గ్రామాల్లోకి పది అడుగుల మేర నీటి ప్రవాహం పెరగడంతో ముంపు గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుప్పదండి, ఓగేరు, చంద్రవంక, కొండవీటి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మంగళగిరి, వెల్దుర్తి, దుర్గి, గురజాల మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి. గుంటూరు శివారు కాలనీలు జలమయం అయ్యాయి. రెంటచింతల సమీపంలో గోలివాగు ఉధృతంగా ప్రవహించటంతో మాచర్ల, గుంటూరుకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రొంపిచర్ల మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కాగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రైవేట్ విద్యాసంస్థలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది. -
పులిచింతల వద్ద పోటెత్తుతున్న వరద
పులిచింతల: కృష్ణా జిల్లాలోని పులిచింతల ప్రాజెక్ట్ వద్ద వరద పోటెత్తుతుంది. పులిచింతల ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లో వాగులు పొంగి పోర్లుతున్నాయని అధికారులు తెలిపారు. పెద్ద మొత్తంలో వరద నీరు చేరుకోవడంతో 9 గేట్లు ఎత్తి 92 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. పులిచింతల ప్రాజెక్ట్ నుంచి విడుదల చేసిన నీరు ఈ రాత్రికి ప్రకాశం బ్యారేజ్ కు చేరే అవకాశముందని అధికారులు వెల్లడించారు. -
గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు
-
పల్నాడులో కుండపోత
గుంటూరు: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పల్నాడు ప్రాంతంలో కుండపోతగా వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలకు మాచర్ల పట్టణంలో పల్లపు ప్రాంతాలు నీట ముగినిగాయి. 15, 16 వార్డుల్లో ఇళ్లలోకి నీరు చేరింది. చంద్రవంక వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పంటపొలాలు నీట ముగిగాయి. పులిచింతల ప్రాజెక్ట్ లో నీటిమట్టం పెరగటంతో కోళ్లూరు గ్రామం పూర్తిగా జలమయం అయ్యింది. ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పల్నాడులో 29 సెంటీమీటర్ల వర్షం పడింది. -
సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయలేం
-
'సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయలేం'
నాగార్జున సాగర్ : తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. సాగర్‌లో 27వేల క్యూసెక్కుల నీటితో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కాగా నాగార్జున సాగర్ చీఫ్ ఇంజినీర్‌కు పులిచింతల ప్రాజెక్ట్ ఎస్ఈ లేఖ రాశారు. సాగర్ నీటితో పులిచింతల నిండుతోందని, దీనివల్ల నల్గొండలో గ్రామాలు మునుగుతాయని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అయితే సాగర్ అధికారులు మాత్రం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయలేమని పులిచింతల ప్రాజెక్ట్ అధికారులకు స్పష్టం చేశారు. సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తే విద్యుత్ కోత తీవ్రంగా ఉంటుందని తెలిపారు. -
పులిచింతల ముంపు ప్రాంతాలకు పరిహారం తక్షణమే విడుదల చేయాలి
-
ఏపీ రాజధాని కోసం కొత్త బ్యారేజీ!
ఏమిటి?: పులిచింతల, ప్రకాశం బ్యారేజీల మధ్య కృష్ణానదిపై మరో వంతెనతో కూడిన ఆనకట్ట నిర్మాణానికి సర్కారు యోచన. ఎందుకు?: నదికి రెండు వైపులా 30 కి.మీ. విస్తీర్ణంలో కొత్త నగరం ఏర్పడుతుందని, దీనికి తాగునీటి అవసరాలు తీర్చాలంటే కొత్త ఆనకట్ట అవసరమని ప్రభుత్వ భావన. ఎక్కడ?: అమరావతి-చెవిటికల్లు, లేదా గుడిమెట్ల-తాడువాయి ప్రాంతాల్లో నిర్మించాలన్నది ప్రస్తుత ఆలోచన. 6 టీఎంసీలు: బ్యారేజీ నిర్మిస్తే సుమారు 6 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చని అధికారుల అంచనా. బ్రిడ్జి వల్ల విజయవాడ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నారు. సాక్షి, విజయవాడ బ్యూరో: కొత్త రాజధాని తాగునీటి అవసరాలు తీర్చడానికి సర్కారు సమాయత్తమవుతోంది. అందుకోసం పులిచింతల, ప్రకాశం బ్యారేజీల మధ్య కృష్ణానదిపై మరో వంతెనతో కూడిన ఆనకట్ట నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయవాడ పరిసరాల్లోనే నూతన రాజధాని అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో ఈ బ్యారేజీ నిర్మించాల్సిన అవసరం కనిపిస్తోంది. కృష్ణానదికి ఇరువైపులా ఉన్న ప్రాంతంలోనే కొత్త రాజధాని అన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. నీటిపారుదల శాఖ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు దీని నిర్మాణ ప్రతిపాదనలకు బలం చేకూరుస్తున్నాయి. నదికి తూర్పున కృష్ణా, పశ్చిమాన గుంటూరు జిల్లాలు ఉన్నాయి. నదికి రెండు వైపులా 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త నగరం ఆవిర్భవించనుందని అధికార పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీ జేసీ దివాకరరెడ్డి ప్రకటించారు. ఈ నెల 3న తనను కలసిన వామపక్ష నేతలతోనూ సీఎం ఇదే విషయాన్ని చెప్పారు. దీన్నిబట్టి నదికి పశ్చిమానున్న మంగళగిరి, వెంకటాయపాలెం, తుళ్లూరు, అమరావతి మండలాలు, తూర్పున ఉన్న గొల్లపూడి, పరిటాల, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో జనావాసాలు, కార్యాలయ భవనాల నిర్మాణం జరుగుతుందని అధికార పక్ష నేతలు భావిస్తున్నారు. అలా అయితే వచ్చే ఐదేళ్లలో రెండు నుంచి మూడు లక్షల జనాభా పెరిగే అవకాశముంది. వీరికి తాగునీరు అందించే వీలవుతుందా? అన్న కోణంలో ప్రభుత్వం దృష్టి సారించిందని సమాచారం. ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు. అయినా పూడిక పెరిగి ఆ నిల్వ సామర్థ్యం బాగా తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ నుంచే బెజవాడ, గుంటూరు, మంగళగిరికి తాగునీరు సరఫరా చేస్తున్నారు. భవిష్యత్తులో నగరాలు విస్తరిస్తే ఈ నీటిని సర్దుబాటు చేయడం అధికారులకు కష్టమే. ఈ నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీకి ఎగువన మరో బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణానికి ఆలోచన చేస్తోంది. ఇప్పటికే నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం. అమరావతి-చెవిటికల్లు, లేదా గుడిమెట్ల, తాడువాయి ప్రాంతాల్లో బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మిస్తే ఎలా ఉంటుందన్న దానిపై అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీనివల్ల ఐదు, తొమ్మిదో నంబరు జాతీయ రహదారుల మధ్య కనెక్టివిటీ ఏర్పడి విజయవాడ మీదుగా వెళ్లే వాహనాల సంఖ్య తగ్గుతుందనీ, దీనివల్ల నగరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అంతేకాకుండా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం వల్ల కృష్ణాలోని ఎగువ జలాలను కర్నూలు, నెల్లూరు జిల్లాలకు ఏ మేరకు మళ్లించే వీలుంటుందో పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేయాలని కూడా ప్రభుత్వం చీఫ్ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసింది. 6 టీఎంసీల నిల్వ అవకాశం... ఏటా వర్షాలు సక్రమంగా పడితే పులిచింతల దిగువనున్న మున్నేరు నుంచి ప్రకాశం బ్యారేజీకి 50 నుంచి 60 టీఎంసీల నీరు వచ్చి చేరుతుంది. కొత్తగా బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మిస్తే అక్కడ సుమారు 6 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చని అధికారుల అంచనా. అమరావతి-చెవిటికల్లు మధ్య వంతెన, బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని 2005లోనే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారులను ఆదేశించారు. అక్కడ సాధ్యం కాకపోతే పెదఅవుటపల్లి, ఫెర్రీ, మీదుగా గుంటూరు జిల్లా వెంకటాయపాలెం, కాజ గ్రామం వరకూ నిర్మించ తలపెట్టిన విజయవాడ బైపాస్ రోడ్డు పనుల్లో భాగంగా వెంకటాయపాలెం దగ్గర నదిపై వంతెన నిర్మించాల్సి ఉంది. అక్కడే బ్యారేజీని నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదనలను కూడా తయారు చేసే అవకాశాలున్నాయనీ, అది నిర్మిస్తే నూతన నగరానికి భవిష్యత్తులో తాగునీటి సమస్యే ఉండబోదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
భూతంలా జలయజ్ఞం!
హైదరాబాద్: జలయజ్ఞాన్ని భూతంలా చూపించి పబ్బం గడుపుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ దిశగానే సాగునీటి రంగంపై శ్వేతపత్రం రూపొందించడానికి కసరత్తు కొనసాగిస్తోంది. శ్వేతపత్రం రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం మీద నిందలు మోపే విధంగా శ్వేతపత్రాన్ని రూపొందించాలని సీఎం సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముగింపు దశలో ఉన్న పులిచింతల, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ వంటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయడానికి అవకాశం ఉన్నా వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వీటిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే ఫలితాలు అందుతాయి. అలాంటి ప్రాజెక్టుల పనుల్ని పక్కన పెట్టిన ప్రభుత్వం జలయజ్ఞాన్ని భూతంలా చూపించాలని తాపత్రయపడుతోంది. ఇదే తపన ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేయడంపై చూపిస్తే వేలాది ఎకరాలకు నీరు అందేది. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన హయాంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు కూడా పైసా ఇవ్వని విషయం తెలిసిందే. అయితే సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఇదే జలయజ్ఞంపై ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కొత్త ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంపై అధికారుల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
సమైక్య ‘భజన’
=పులిచింతల సభలో సమైక్యవాదం = సీఎం గొంతుచించుకున్నా స్పందన కరువు = మధ్యలోనే సగం కుర్చీలు ఖాళీ = ప్రాజెక్టు కోసం కృషి చేసిన రైతుల ప్రస్తావన శూన్యం సాక్షి, విజయవాడ : అధిష్టానంపై నిప్పులు చెరిగినా, తాను ఎంత సమైక్యవాదినని గొంతు చించుకున్నా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రసంగానికి సభికుల నుంచి స్పందన కరువైంది. పులిచింతలను జాతికి అంకితం చేసే సభను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పూర్తిగా విభజనపై తన వాదం వినిపించేందుకు ఉపయోగించుకున్నారు. పులిచింతల ఏర్పాటుకోసం తపించి, ఉద్యమాలు చేసిన రైతు నాయకుల ప్రస్తావన కూడా లేకుండా పోయింది. నిరసనలు వ్యక్తమవుతాయన్న భయంతో విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టు చేశారు. విజయవాడలో పట్టాల సమస్య, కార్పొరేషన్ ఉద్యోగులకు 010 పద్దు కింద జీతాలు, నగరంలో ముంపు ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపిస్తారంటూ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తన ప్రసంగంలో చెప్పినా.. సీఎం కనీసం పట్టించుకోలేదు. 13 లక్షల ఎకరాలకు సంబంధించి డెల్టా ఆయకట్టు స్థిరీకరణ ప్రాజెక్టు అయినప్పటికీ రైతులు ఈ సభకు రావడానికి ఆసక్తి చూపలేదు. దీంతో అధికారులు పూర్తిగా డీఆర్డీఏ ద్వారా డ్వాక్రా మహిళలను తరలించడంపై దృష్టి పెట్టారు. చాలా మందికి చెక్కులు ఇస్తామని ఆశపెట్టి తీసుకువచ్చారు. ఇక్కడకు వ చ్చాక బహిరంగ సభ కావడంతో సగం మంది వెనుతిరిగి వెళ్లిపోయారు. జనాన్ని కదిలించలేకపోయిన ప్రసంగాలు... శనివారం సాయంత్రం విజయవాడ స్వరాజ్‌మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు జనాన్ని తరలించగలిగిన కాంగ్రెస్ నేతలు తమ ప్రసంగాలతో వాళ్లను కదిలించలేకపోయారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి అధిష్టానాన్నే లక్ష్యంగా చేసుకొని మాటల తూటాలు పేల్చారు. కేంద్రంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకోవడమే తప్పా అని ప్రశ్నించారు. 2004 తరువాతే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందంటూ పరోక్షంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషిని సీఎం ప్రస్తావించారు. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ కెఎల్.రావు సాగర్ పులిచింతల ప్రాజెక్ట్ ప్రారంభంతో దశాబ్దాల నాటి కల నెరవేరిందన్నారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పులిచింతల ప్రాజె క్టుకు శంకుస్థాపన చేశారని చెబుతుండగా సభికుల నుంచి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి తోట నరసింహం మాట్లాడుతూ 13 లక్షల ఎకరాలకు సాగునీరందించే పులిచింత ప్రాజెక్ట్ చరిత్రలో నిల్చిపోతుందన్నారు. ఆకట్టుకోని లగడపాటి డైలాగులు... జై సమైక్యాంధ్ర అంటూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వినూత్న తరహాలో ప్రసంగాన్ని ప్రారంభించినప్పటికీ జనాన్ని ఆకట్టుకోలేకపోయారు. సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న ధర్మ పోరాటంలో సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి పద్మవ్యూహంలో అభిమన్యుడవుతాడా, లేక అర్జునుడవుతాడా అని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోందంటూ సినీఫక్కీలో చేసిన డైలాగ్‌కు స్పందన కనిపించలేదు. సగం ఖాళీ పాలకపక్షం నేతలు, అధికార యంత్రాంగం గత వారం రోజులుగా హైరానాపడి సీఎం సభకు భారీగానే జనాన్ని తరలించగలిగారు. డ్వాక్రా మహిళలు, కిరాయి కార్యకర్తలతో ఎట్టకేలకు మధ్యాహ్నానికి సభాస్థలిని నింపగలిగారు. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు ప్రసంగాలు చేస్తుండగానే జనం కుర్చీల్లోంచి లేవడం ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన మంత్రులు వెంటనే మైక్ సీఎం చేతికి ఇచ్చారు. అప్పటికే వెనక వైపు సగం కుర్చీలు ఖాళీ అయ్యాయి. రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, కాసు కృష్ణారెడ్డి, మాణిక్య వరప్రసాద్, పితాని సత్యనారాయణ, వట్టి వసంతకుమార్, ఎమ్మెల్సీలు పాలడుగు వెంకట్రావ్, గాదె వెంకటరెడ్డి, సింగం బసవ పున్నయ్య, కృష్ణారెడ్డి, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, యలమంచిలి రవి, దిరిశం పద్మజ్యోతి, డీవై దాస్, కారుమూరి నాగేశ్వరరావు (తణుకు), ఉగ్రనరసింహారెడ్డి (కనిగిరి), మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
జనాన్ని తోలండి...
=సీఎం పర్యటనకు అధికారుల హైరానా =డ్వాక్రా సంఘాలు,విద్యార్థులపై గురి =బలవంతంగా బస్సుల స్వాధీనం =ప్రైవేటు పాఠశాలలకు సెలవులు =జనసమీకరణలో ఉద్యోగులు విజయవాడ సిటీ, న్యూస్‌లై న్ : ‘పులిచింతల’ అధికారులకు చింతలే మిగులుస్తోంది. ఈ నెల ఏడున పులిచింతల ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు నగరంలో ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి బహిరంగసభను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం నానా హైరానా పడుతోంది. జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దాదాపు లక్షమందిని సమీకరించి సభను జయప్రదం చేసే భారాన్ని అధికార యంత్రాంగంపై మోపారు. ఇటు ప్రొటోకాల్ ఏర్పాట్లతోపాటు అటు జనాన్ని తోలే కార్యక్రమం కూడా జిల్లా యంత్రాంగంపై పడింది. దీంతో వారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన పర్యవేక్షణలో రవాణా, విద్యాశాఖ, ఐకేపీ సిబ్బంది, వ్యవసాయాధికారులు, సిబ్బంది సభకు జనాన్ని తరలించే బాధ్యతను తమ భుజాలకెత్తుకున్నారు. జిల్లాలో రెండు వేల ప్రైవేటు పాఠశాలల బస్సులను బలవంతంగా లాక్కునే పనిలో రవాణా, విద్యాశాఖ అధికారులు ఉన్నారు. బుధవారం జిల్లా విద్యాశాఖ నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు.. ఎంఈవోలు అన్ని మండలాల్లోని ప్రైవేటు పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు. శనివారం విజయవాడలో జరగనున్న సీఎం సభకు బస్సులు పంపాలని హుకుం వేశారు. ఆ రోజు పాఠశాలలన్నింటికీ సెలవలు ఇచ్చి టీచర్లు, విద్యార్థులను కూడా తరలించాలని ఆదేశించారు. దీనికి సంబంధించి జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్లలో ఉప విద్యాశాఖాధికారులు మంగళ, బుధవారాల్లో ప్రైవేటు పాఠ శాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశాలు కూడా నిర్వహించారు. విద్యాశాఖ అధికారులు మండలానికి ఇద్దరు చొప్పున ఉపాధ్యాయులను నియమించి బస్సుల నంబర్లతోపాటు హాజరయ్యే వారి సంఖ్యను కూడా నమోదు చేయాలని ఆదేశించారు. డ్వాక్వా సంఘాలపై ఆశలు జిల్లాలో పంటలు మునిగి పుట్టెడు కష్టంలో ఉన్న రైతులు ఈ సభకు పెద్దగా వచ్చే అవకాశం లేకపోవడంతో డ్వాక్వా సంఘాలపై అధికార యంత్రాంగం అశలు పెట్టుకుంది. డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఐకేపీ సిబ్బంది గ్రామగ్రామాన తిరిగి మహిళలను సమీకరించాలని ఆదేశాలందాయి. ఎంపీడీవోలు కూడా తమ వంతు ప్రయత్నాన్ని గ్రామ కార్యదర్శులతో చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో తిరిగి ఆదర్శ రైతులు, రైతు సంఘాల ద్వారా జనాన్ని సమీకరించేపనిలో పడ్డారు. సర్వత్రా నిరసన సీఎం సభకు అధికారులు బలవంతంగా జనాన్ని తరలించే కార్యక్రమంపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభావంతో ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలలు సరిగా జరగలేదని, అనవసరంగా సెలవు ఇవ్వడం తమ వల్ల కాదని విద్యాసంస్థల ప్రతినిధులు అంటున్నారు. తమ బస్సులను కూడా పంపబోమని కొందరు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు మొండికేస్తున్నట్లు సమాచారం. -
పులిచింతలలో దీక్ష చేపట్టిన విజయమ్మ
-
పులిచింతలలో దీక్ష చేపట్టిన విజయమ్మ
గుంటూరు : రైతుల నోట్లో మట్టికొడుతూ, రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా మారిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ తీర్పుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. తీర్పుకు నిరసనగా పులిచింతల చేరుకున్న పార్టీ గౌరవధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం నిరసన దీక్ష చేపట్టారు. రేపు వైఎస్ఆర్ జిల్లా గండికోట ప్రాజెక్టు పరిథిలో, శుక్రవారం... మహబూబ్‌నగర్ జిల్లా జూరాల ప్రాజెక్ట్ దగ్గర విజయమ్మ దీక్ష చేయనున్నారు. విజయమ్మ దీక్షకు కృష్ణా, గుంటూరు, పాలమూరు జిల్లా వాసులతో పాటు రైతులు భారీగా తరలి వచ్చారు. -
పులిచింతల వద్ద పోలీసుల ఓవరాక్షన్..
-
పులిచింతల వద్ద పోలీసుల ఓవరాక్షన్.. రైతు నాయకుల ఆగ్రహం
పులిచింతల ప్రాజెక్టు వద్దకు వస్తున్న వందలాదిమంది రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు నాయకుడు నాగిరెడ్డిని కూడా ప్రాజెక్టు స్థలానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు అపారంగా వస్తున్న మద్దతును తట్టుకోలేక ప్రభుత్వం నుంచి వస్తున్న ఆదేశాల వల్లే పోలీసులు ఇలా చేస్తున్నట్లు సమాచారం. ప్రాజెక్టు వద్దకు ఎవరూ చేరుకోకుండా చేసేందుకే పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇలా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పోలీసుల ఓవరాక్షన్ పట్ల రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. విజయమ్మ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం గుండా జగ్గయ్యపేట మీదుగా ప్రాజెక్టు వద్దకు వస్తారని ముందుగా సమాచారం అందింది. దీంతో దాదాపు ప్రాజెక్టుకు -9 కిలోమీటర్ల దూరం నుంచే రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు. -
‘పులిచింతల’ ప్రారంభోత్సవం 7న
=సీఎం చేతుల మీదుగా జాతికి అంకితం =అదేరోజు సాయంత్రం విజయవాడలో సభ =ఐదు గేట్లు మినహా ప్రాజెక్టు అంతా పూర్తి =మాధ్యమిక విద్యా శాఖ మంత్రి పార్థసారథి వెల్లడి సాక్షి, విజయవాడ : పులిచింతల ప్రాజెక్టు ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతులమీదుగా ఈ నెల ఏడో తేదీన చేపడుతున్నట్లు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అదేరోజు మధ్యాహ్నం మూడు గంటలకు విజయవాడ స్వరాజ్య మైదానంలో రెండు లక్షల మందితో భారీ సభ నిర్వహిస్తామన్నారు. సభా ప్రాంగణానికి కాకాని వెంకటరత్నం పేరు పెడుతున్నట్లు చెప్పారు. పులిచింతల ప్రాజెక్టు నమూనాను ప్రాంగణం వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. పులిచింతల ప్రాజెక్టు 40 టీఎంసీల సామర్థ్యంతో కూడుకున్నదన్నారు. మొదటి ఏడాది 20 టీఎంసీలకు మించి నింపబోరని చెప్పారు. 19 గేట్లు పూర్తిచేశారని... ఇంకా ఐదు గేట్లు చేయాల్సి ఉందని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి గేట్లన్నీ పూర్తవుతాయన్నారు. గుంటూరు జిల్లాలో పైలాన్... పులిచింతల ప్రాజెక్టు ప్రారంభ పైలాన్ గుంటూరు జిల్లాలో ఉంటుందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం ప్రారంభిస్తే... కిరణ్‌కుమార్‌రెడ్డి వాటిని పూర్తిచేస్తున్నారన్నారు. వైఎస్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే... అందులోని లొసుగులను కిరణ్‌కుమార్‌రెడ్డి సరిదిద్దారని చెప్పారు. 60-70 ఏళ్లున్నవారు కూడా ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని ఉపయోగించుకోవడాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి సరిదిద్దారని చెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డిని గుడ్ గవర్నెన్స్ అవార్డుకు ఎంపిక చేయడం ఆనందదాయకమన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ఆఖరి నిమిషం వరకు అందుకోసం పోరాడతామని తెలిపారు. నేరస్తులైన ప్రజాప్రతినిధుల విషయంలో వచ్చిన ఆర్డినెన్స్‌ను రాహుల్‌గాంధీ చింపివేయలేదా.. అని అంటూ అలాగే తెలంగాణ విషయంలో జరగొచ్చన్నారు. ప్రతిపక్షాలు చెప్పడం వల్లే వారు విభజన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మార్క్‌ఫెడ్ చైర్మన్ కంచి రామారావు, డీసీసీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు పాల్గొన్నారు. -
పులిచింతల ప్రాజెక్టుకు తొలిసారి జలకళ
గుంటూరు/మేళ్లచెరువు, న్యూస్‌లైన్: పులిచింతల ప్రాజెక్టుకు తొలిసారి జలకళ వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కల సాకారమైంది. జలయజ్ఞంలో భాగంగా రాష్ర్టంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ ప్రాజెక్టు నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండలంలోని పులిచింతలలో నిర్మించారు. ఎగువన నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో బుధవారం అక్కడ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో గురువారం పులిచింతల ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి పెరిగింది. నీటిమట్టం పెరగడంతో ప్రాజెక్టుకు బిగించిన 18 గేట్లలో 14 క్రస్ట్‌గేట్లను ఎత్తి 2.70 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీకి వదిలారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద క్రస్ట్ లెవల్ పైనుంచి దాదాపు 15 అడుగులకు పైగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రాజెక్ట్‌లో అంతర్భాగంగా నిర్మిస్తున్న విద్యుదుత్పత్తి ప్లాంటులోకి వరద నీరు చేరి, పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా తొణికిసలాడుతోంది. కాగా, గేట్ల పైభాగంలో మెకానికల్ పనులకు ఆటంకం లేకపోవడంతో గేట్ల బిగింపు, వెల్డింగ్ పనులను మరింత ముమ్మరం చేశారు. ఈ నెల 15వ తేదీలోగా ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని, స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాజెక్టును ప్రారంభించాలని నెల రోజుల క్రితం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో గడిచిన ఇరవై రోజులుగా ప్రాజెక్టు చివరి దశ పనులు వేగంగా జరుగుతున్నాయి. క్రస్ట్‌గేట్లు 24 బిగించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 18 గేట్లు బిగించారు. మిగతా ఫ్యాబ్రికేషన్ పనులు జరుగుతున్నాయి. ముంపు గ్రామాలను తాకిన నీరు ఇదిలా ఉండగా పులిచింతల ప్రాజెక్టుకు ఎగువన రిజర్వాయర్‌కు ఆనుకుని ఉన్న ముంపు గ్రామాల శివార్లకు వరదనీరు చేరింది. ఇటు గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం, అటు నల్గొండ జిల్లా మేళ్లచెర్వు మండలంలోని గ్రామాలు కేతవరం, బోధనం, చిట్యాల, గొల్లపేట, కోళ్లూరు, చింత్రియాల, అడ్లూ రు, కృష్ణాపురం, వెల్లటూరు వరదనీటి బారిన పడే ప్రమాదం ఉందని గుర్తించిన ఆయా మండలాల రెవెన్యూ అధికారులు వీఆర్వోలకు ప్రత్యేక విధులను కేటాయించారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు.