పులిచింతలలో నీటి నిల్వకు సహకరించాలి
పులిచింతలలో నీటి నిల్వకు సహకరించాలి
Published Wed, Sep 14 2016 10:29 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
మేళ్లచెర్వు : మండలంలోని పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వకు నిర్వాసితులు సహకరించాలని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. ఆయన బుధవారం నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండలంలోని పులిచింతల ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టులో 30 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేయనున్నట్లు దానికి గుంటూరు,నల్లగొండ జిల్లాల్లోని ప్రజలు సహకరించాలన్నారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు నీటి పంపకంలో సమన్యాయం పాటించనున్నట్లు చెప్పారు. ఆయన వెంట జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, వెంకటేశ్వరరావు, సీఈ సుధాకర్, ఎస్‌ఈ వెంకటరమణ తదితరులున్నారు.
Advertisement
Advertisement