నాగార్జున సాగర్ : తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. సాగర్లో 27వేల క్యూసెక్కుల నీటితో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కాగా నాగార్జున సాగర్ చీఫ్ ఇంజినీర్కు పులిచింతల ప్రాజెక్ట్ ఎస్ఈ లేఖ రాశారు. సాగర్ నీటితో పులిచింతల నిండుతోందని, దీనివల్ల నల్గొండలో గ్రామాలు మునుగుతాయని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అయితే సాగర్ అధికారులు మాత్రం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయలేమని పులిచింతల ప్రాజెక్ట్ అధికారులకు స్పష్టం చేశారు. సాగర్లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తే విద్యుత్ కోత తీవ్రంగా ఉంటుందని తెలిపారు.