
పులిచింతలలో దీక్ష చేపట్టిన విజయమ్మ
గుంటూరు : రైతుల నోట్లో మట్టికొడుతూ, రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా మారిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ తీర్పుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. తీర్పుకు నిరసనగా పులిచింతల చేరుకున్న పార్టీ గౌరవధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం నిరసన దీక్ష చేపట్టారు. రేపు వైఎస్ఆర్ జిల్లా గండికోట ప్రాజెక్టు పరిథిలో, శుక్రవారం... మహబూబ్‌నగర్ జిల్లా జూరాల ప్రాజెక్ట్ దగ్గర విజయమ్మ దీక్ష చేయనున్నారు. విజయమ్మ దీక్షకు కృష్ణా, గుంటూరు, పాలమూరు జిల్లా వాసులతో పాటు రైతులు భారీగా తరలి వచ్చారు.