పులిచింతల వద్ద పోలీసుల ఓవరాక్షన్.. రైతు నాయకుల ఆగ్రహం | police try to stop farmers coming to ys vijayamma dharna at pulichintala | Sakshi
Sakshi News home page

పులిచింతల వద్ద పోలీసుల ఓవరాక్షన్.. రైతు నాయకుల ఆగ్రహం

Published Wed, Dec 4 2013 9:22 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

police try to stop farmers coming to ys vijayamma dharna at pulichintala

పులిచింతల ప్రాజెక్టు వద్దకు వస్తున్న వందలాదిమంది రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు నాయకుడు నాగిరెడ్డిని కూడా ప్రాజెక్టు స్థలానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు అపారంగా వస్తున్న మద్దతును తట్టుకోలేక ప్రభుత్వం నుంచి వస్తున్న ఆదేశాల వల్లే పోలీసులు ఇలా చేస్తున్నట్లు సమాచారం.

ప్రాజెక్టు వద్దకు ఎవరూ చేరుకోకుండా చేసేందుకే పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇలా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పోలీసుల ఓవరాక్షన్ పట్ల రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. విజయమ్మ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం గుండా జగ్గయ్యపేట మీదుగా ప్రాజెక్టు వద్దకు వస్తారని ముందుగా సమాచారం అందింది. దీంతో దాదాపు ప్రాజెక్టుకు -9 కిలోమీటర్ల దూరం నుంచే రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement