పులిచింతలకు కొనసాగుతున్న వరద
పులిచింతల ప్రాజెక్టు(మేళ్లచెర్వు): రెండు రోజులుగా కురుస్తున్న వానలతో పాటు మూసీ నది నుంచి నీటితో మండలంలోని పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టులో 30 టీఎంసీల నీటిని నిల్వ చేసి, ఆ పైన వస్తున్న నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం 1.60 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో అంతే మెుత్తంలో నీటిని నాలుగు గేట్లు ఎత్తి విడుదల చేస్తున్నారు.
భారీగా పెరిగిన సందర్శకులు
మండలంలోని పులిచింతల ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరడంతో పాటు దిగువకు నీటిని విడుదల చేస్తుండండతో శుక్రవారం సందర్శకులు భారీగా తరలివచ్చారు. మండలంలోని చుట్టుప్రక్కల గ్రామాలతో పాటు కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చారు.