Heavy Water
-
నీట మునిగిన గండిపోచమ్మ ఆలయం
-
గలగలా గోదారి..
ధవళేశ్వరం : కాటన్ బ్యారేజ్ వద్ద మంగళవారం సాయంత్రం గోదావరి ఉధృతి స్వల్పంగా పెరిగింది. దీంతో మిగులు జలాల విడుదలను పెంచారు. బ్యారేజ్ వద్ద 6.50 అడుగుల నీటిమట్టం ఉండగా 3,24,806 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. మరోపక్క ఎగువ ప్రాంతాల్లో నీటిమట్టాలు క్రమేపీ పెరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు భద్రాచలం వద్ద 37.80 అడుగులకు చేరుకున్న నీటిమట్టం సాయంత్రం 6 గంటల వరకూ అదేస్థాయిలో నిలకడగా కొనసాగింది. తూర్పు డెల్టాకు 500, మధ్య డెల్టాకు 1000, పశ్చిమ డెల్టాకు 1000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో నీటి ఉధృతి పెరగడంతో బుధవారం ఉదయానికి కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 9.80 మీటర్లు, పేరూరులో 10.69 మీటర్లు, దుమ్ముగూడెంలో 10.46 మీటర్లు, కూనవరంలో 12.52 మీటర్లు, కుంటలో 4.47 మీటర్లు, కొయిదాలో 16.26 మీటర్లు, పోలవరంలో 10.37 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 14.02 మీటర్ల వద్ద నీటిమట్టాలు కొనసాగుతున్నాయి. కళకళా తాండవ కోటనందూరు : విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తాండవ జలాశయం నిండు కుండలా కళకళలాడుతోంది. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా జలాశయం సముద్రాన్ని తలపిస్తోంది. క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు పడుతున్నందున ఆశించిన స్థాయిలో ఇన్‌ఫ్లో వస్తోందని తాండవ అధికారులు చెబుతున్నారు. జలాశయ గరిష్ట నీటిమట్టం 380 అడుగులు కాగా ఇప్పటికే 372.5 అడుగులకు చేరింది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో రెండు రోజుల్లో జలాశయ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు వివరిస్తున్నారు. నీటిమట్టం 377 అడుగులకు చేరితే తరువాత వచ్చే ఇన్‌ఫ్లో ఆధారంగా అదే స్థాయిలో నీటిని నదికి విడిచి పెడతామని డీఈ రాజేంద్రకుమార్ తెలిపారు. ప్రస్తుతం పుష్కలంగా వర్షాలు ఉన్నందున ఆయకట్టుకు నీటి అవసరం లేదని, పంట చివర్లో కొంతమేర నీటిని విడిచి పెట్టి, రబీకి కూడా పూర్తిస్థాయిలో అందుతుందని డీఈ వివరించారు. జలాశయాన్ని పరిశీలించిన డీఈ తాండవ జలాశయాన్ని డీఈ ఎం.రాజేంద్రకుమార్ మంగళవారం పరిశీలించారు. జలాశయానికి ఉధృతంగా నీరు వస్తున్నందున ఏఈలు శ్యామ్‌కుమార్, చిన్నారావు, వర్క్ ఇన్స్పెక్టర్ నాగబాబులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. సందర్శకులను ఎవరిని జలాశయం వద్దకు వెళ్లనీÄñæ¬ద్దని సిబ్బందిని ఆదేశించారు. -
జగిత్యాలలో భారీ వర్షం
జగిత్యాల అర్బన్: జగిత్యాల పట్టణంలో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో ప్రజలు ఇంట్లోంచి బయటకు వెళ్లలేదు. దీంతో రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారాయి. డ్రెయినేజీలు పొంగి పొర్లాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు నీళ్లు వస్తాయని భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి ఇలాగే కురిస్తే నీటితో నిండే పరిస్థితి ఉంది. భారీ వర్షంతోపాటు గాలి సైతం ఉండటంతో విద్యుత్‌లేక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. గణేశ్ నవరాత్రుల సందర్భంగా అనేక చోట్ల గణనాథులు వెలిశాయి. వర్షంతో ఇబ్బందులకు గురవుతునారు. కొన్ని చోట్ల షెడ్లు సక్రమంగా వేయకపోవడంతో నిర్వాహకులు నానా తంటాలుపడ్డారు. -
శ్రీవారి మెట్ల మార్గం మూసివేత
-
మితిమీరి మంచి నీళ్లు తాగినా ముప్పే!
న్యూయార్క్: నీళ్లు ఎంత ఎక్కువ తాగితే ఆరోగ్యానికి అంత మంచిదని భావిస్తారు చాలా మంది. కానీ ఇలా అతిగా నీళ్లు తాగటం కూడా ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లయోలా యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన అంతర్జాతీయ నిపుణుల బృందం సూచనల ప్రకారం దాహం వేసినప్పుడు మాత్రమే నీటిని తాగాలి. అవసరం లేకున్నా అధికంగా నీళ్లు తాగకూడదు. సాధారణంగా మనం తాగే నీటిని మూత్ర పిండాలు వడపోస్తాయి. నీటిలోని వ్యర్థ పదార్థాల్ని మూత్రం రూపంలో బయటకు పంపేస్తాయి. ఇలా మూత్ర పిండాలకు కూడా ఒక స్థాయిలో పని చేయగలిగే శక్తి ఉంటుంది. కానీ అవసరానికి మించి నీళ్లను తాగడం వల్ల వాటిని మూత్ర పిండాలు వడపోయలేవు. ఎక్కువ నీటిని వడపోసే క్రమంలో మూత్ర పిండాలపై ఒత్తిడి పెరిగి, అవి వాపునకు గురవుతాయి. శరీరంలో సోడియం స్థాయి తగ్గిపోతుంది. ఫలితంగా అనేక కణజాలాలు ఉబ్బిపోయి ప్రాణానికే హాని కలగవచ్చు. ముఖ్యంగా క్రీడాకారుల్లో ఈ సమస్య ఎక్కువ తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే వారు గేమ్స్ ప్రాక్టీస్ చేసే సమయంలో అవసరం లేకున్నా అతిగా నీళ్లు తాగుతారు. ఇది ఎక్సర్సైజ్ అసోసియేటెడ్ హైపోనాట్రీమియా (ఈఏహచ్)కు దారి తీస్తుంది. తల తిరగడం, వాంతులు, వికారం లాంటి లక్షణాలు ఈఏహచ్కు సూచనలు. నీళ్లు తాగడం వల్ల అలసటను అధిగమించొచ్చని క్రీడాకారులు భావిస్తారు. చెమట ద్వారా కోల్పోయే నీటిని భర్తీ చేసేందుకు, ఆట ఆడే సమయంలో ఇతర సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కూడా నీటిని తీసుకుంటారు. దీని వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సహజ సిద్ధంగా దాహం వేసినప్పుడు మాత్రమే నీటిని తీసుకోవాలని, ఇది క్రీడాకారుల ఆరోగ్యానికి మేలు చేస్తుందని వారు చెబుతున్నారు. -
పులిచింతల వద్ద పోటెత్తుతున్న వరద
పులిచింతల: కృష్ణా జిల్లాలోని పులిచింతల ప్రాజెక్ట్ వద్ద వరద పోటెత్తుతుంది. పులిచింతల ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లో వాగులు పొంగి పోర్లుతున్నాయని అధికారులు తెలిపారు. పెద్ద మొత్తంలో వరద నీరు చేరుకోవడంతో 9 గేట్లు ఎత్తి 92 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. పులిచింతల ప్రాజెక్ట్ నుంచి విడుదల చేసిన నీరు ఈ రాత్రికి ప్రకాశం బ్యారేజ్ కు చేరే అవకాశముందని అధికారులు వెల్లడించారు. -
భారీ వర్షాలకి పూర్తిగా నిండిన వరాహపుష్కరిణి
-
వరికి ఊపిరి
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు వరి పంటకు ఊపిరిపోస్తున్నాయి. తీవ్ర వర్షాభావం కారణంగా వరి సాగు ప్రశ్నార్థకమైన తరుణంలో వర్షాలు రావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పంట విస్తారంగా సాగు చేయడానికి సమాయత్తమవుతున్నారు. వర్షాలకు తోడు హెచ్చెల్సీ ఆయకట్టుకు సకాలంలో నీరు విడుదల కావడంతో (ప్రస్తుతం కర్ణాటకలో కాలువకు గండి పడటంతో వారం రోజులు నీరు బంద్ చేశారు) ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో వేరుశనగ తర్వాత అత్యధిక విస్తీర్ణంలో పండించే పంట వరి మాత్రమే. హెచ్చెల్సీ ఆయకట్టు కింద 60 నుంచి 70 వేల ఎకరాల్లో వరి వేస్తారు. 50 -60 వేల ఎకరాల్లో మాత్రమే ఇతర ఆరుతడి పంటలు సాగవుతాయి. అయితే.. కొన్నేళ్లుగా వర్షాభావం, తుంగభద్ర డ్యాంలో పూడిక కారణంగా నీటి లభ్యత తక్కువగా ఉందనే నెపంతో హెచ్చెల్సీ ఆయకట్టు కింద పంటల సాగును కుదిస్తున్నారు. గతేడాది ఆరుతడి, తడి పంటలతో కలిపి 60 వేల ఎకరాలకు మాత్రమే నీరివ్వాలని హెచ్చెల్సీ అధికారులు లక్ష్యంగా పెట్టుకొని పనిచేశారు. ఈ ఏడాది కర్ణాటకలో వరదలు రావడంతో తుంగభద్ర డ్యాంలోకి భారీగా నీరు చేరింది. దీంతో హెచ్చెల్సీకి సకాలంలో నీరు విడుదల చేశారు. మొత్తం 90 వేల ఎకరాలకు నీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హెచ్చెల్సీ లోకలైజేషన్ ఈఈ ధనుంజయరావు చెప్పారు. ఇప్పటికే హైలెవల్ మెయిన్ కెనాల్‌తో పాటు గుంతకల్లు బ్రాంచ్ కెనాల్, మిడ్‌పెన్నార్ సౌత్ కెనాల్‌కు నీటిని సరఫరా చేస్తున్నారు. త్వరలో మిడ్‌పెన్నార్ నార్త్ కెనాల్‌తో పాటు తాడిపత్రి బ్రాంచ్ కెనాల్, ఆలూరు బ్రాంచ్ కెనాల్‌కు నీరు విడుదల చేయనున్నారు. ఈ కాలువల కింద ఎక్కువ శాతం వరి సాగు చేయడానికి రైతులు మక్కువ చూపుతున్నారు. గతేడాది ఆయకట్టుకు నీరు ఆలస్యంగా విడుదల చేయడంతో వరి సాగు గణనీయంగా పడిపోయింది. 23 వేల ఎకరాల్లో మాత్రమే సాగులోకి వచ్చింది. మరో 55 వేల ఎకరాల్లో వేరుశనగ, జొన్న, పొద్దుతిరుగుడు, పప్పుశనగ, కూరగాయలు వంటి ఆరుతడి పంటలు సాగు చేశారు. ఈ ఏడాది సకాలంలోనే నీరు విడుదల కావడానికి తోడు వరిసాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రికార్డు స్థాయిలో వరి సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఒక్క హెచ్చెల్సీ ఆయకట్టు కిందే దాదాపు 40వేల ఎకరాల్లో సాగు కావచ్చని అంచనా వేస్తున్నారు. బోరుబావుల కింద 25 వేల ఎకరాల్లో పంట సాగయ్యే అవకాశముంది. -
మంచినీళ్లు లేవు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :జోరు వానలు కురుస్తున్నాయి. జిల్లాలో ఎక్కడ చూసినా నీటి వరదలే. తెరిపిలేని వానలతో వాగులు, వంకలు, చెరువులు, కుంటలే కాదు... పొలాలు, చెలకలు సైతం నీటితోకనిపిస్తోంది. ఐదేళ్లలో ఎప్పడూ లేనంత ఎక్కువగా జిల్లాలో వర్షాలు కురిసినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇలా పుష్కలంగా నీళ్లున్నా... గ్రామీణ ప్రాంతాలకు మాత్రం తాగునీరు దొరకడం లేదు. గ్రామాల్లో తాగునీటి సరఫరా చేసే అన్ని పథకాలకు కరెంటు సమస్య వచ్చి పడింది. ఇది కరెంటు లేక కాదు... కరెంటు బిల్లులు చెల్లించక. గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ పరిధిలోని అన్ని పథకాలకు రెండేళ్లుగా కరెంటు బిల్లులు చెల్లించడం లేదు. ఇలా పేరుకుపోయిన బిల్లులు రూ.12 కోట్లకు చేరుకున్నాయి. కరెంటు బిల్లు చెల్లించని వారి విషయంలో ప్రైవేటు వినియోగదారుల తీరుగానే ఉండాలనే ఆదేశాలతో... విద్యుత్ శాఖ జిల్లా అధికారులు అన్ని తాగునీటి సరఫరా పథకాలకు కరెంటు కట్ చేసుకుంటూ పోతున్నారు. ఒకేసారి జిల్లా వ్యాప్తంగా చేయకుండా ఒక్కో ప్రాంతంలో ఒకసారి కట్ చేస్తున్నారు. బకాయిలు భారీగా ఉండడంతోనే విద్యుత్‌శాఖ అధికారులు ఈ పని చేస్తున్నారు. ఫలితంగా గ్రామాల్లో ప్రభుత్వ తాగునీటి వ్యవస్థ స్తంభించిపోతోంది. ప్రజలకు నాణ్యమైన తాగునీరు కరువై శుద్ధి చేయని నీరే దిక్కవుతోంది. అసలే వర్షాకాలం కావడంతో ఈ నీరు తాగి ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. ఎన్నికల ఎఫెక్ట్ స్థానిక సంస్థలకు ఎన్నికలు లేకపోవడంతో జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు పాలకవర్గాలు లేవు. పాలకవర్గాలు లేకపోవడం వల్లే గ్రామీణ తాగునీటి సరఫరా పథకాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడంలేదని అధికారులు చెబుతున్నారు. కరెంటు బిల్లులు పేరుకుపోయిన విషయం వాస్తమేనని, కరెంట్ కట్ చేస్తున్నారని గ్రామీణ తాగునీటి సరఫరా అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని అంటున్నారు. కేంద్రం నిధులివ్వకపోగా... రాష్ట్రం కూడా పట్టించుకోకపోవడంతో గ్రామాల్లో తాగునీటికి తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. అన్ని పథకాలకు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్వహించే నీటి పథకాలతోపాటు ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యం ఉన్న పథకాలకు సైతం కరెంట్ కట్ చేస్తున్నారు. సమగ్ర శాశ్వత నీటి సరఫరా(సీపీడబ్ల్యూఎస్) కింద జిల్లాలో మల్యాల, గంగాధర, వెంకట్రావుపల్లి, రామడుగు, తుమ్మనపల్లి(హుజూరాబాద్), బెజ్జంకి, గన్నేరువరం, మంథని, మంథని రూరల్, బీర్పూర్, ఇందుర్తి, కొత్తూరు(ఇల్లంతకుంట) పథకాలు ఉన్నాయి. ఈ 12 పథకాలకు కలిపి రూ.4 కోట్ల కరెంటు బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో ఒక్క ఇందుర్తి సీపీడబ్ల్యూఎస్కే రూ.2 కోట్ల బకాయిలున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారుల జోక్యంతో ఒకటిరెండు రోజులు కరెంటు పునరుద్ధరిస్తున్నా... ఆ వెంటనే మళ్లీ కటింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన తర్వాత నిధులు వచ్చే వరకూ ఇదే పరిస్థితి కొనసాగనుంది.