జగిత్యాలలో భారీ వర్షం | full rain in jagityala | Sakshi

జగిత్యాలలో భారీ వర్షం

Published Mon, Sep 12 2016 10:32 PM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM

జగిత్యాలలో భారీ వర్షం - Sakshi

జగిత్యాలలో భారీ వర్షం

జగిత్యాల అర్బన్‌: జగిత్యాల పట్టణంలో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో ప్రజలు ఇంట్లోంచి బయటకు వెళ్లలేదు. దీంతో రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారాయి. డ్రెయినేజీలు పొంగి పొర్లాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు నీళ్లు వస్తాయని భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి ఇలాగే కురిస్తే నీటితో నిండే పరిస్థితి ఉంది. భారీ వర్షంతోపాటు గాలి సైతం ఉండటంతో విద్యుత్‌లేక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. గణేశ్‌ నవరాత్రుల సందర్భంగా అనేక చోట్ల గణనాథులు వెలిశాయి. వర్షంతో ఇబ్బందులకు గురవుతునారు. కొన్ని చోట్ల షెడ్లు సక్రమంగా వేయకపోవడంతో నిర్వాహకులు నానా తంటాలుపడ్డారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement