మిలీషియాపై ఉక్కుపాదం | heavy hand of the militia | Sakshi
Sakshi News home page

మిలీషియాపై ఉక్కుపాదం

Published Thu, Mar 12 2015 2:43 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

heavy hand of the militia

మిలీషియాపై ఉక్కుపాదం మోపడంతోపాటు మావోయిస్టుల ఏరివేతకు పోలీసుశాఖ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఆకురాల్చే కాలాన్ని అవకాశంగా తీసుకుని పట్టుబిగించేందుకు యోచిస్తోంది. ఈ సమయంలో అడవుల్లో దళసభ్యుల కదలికలను సులువుగా పసిగట్టే అవకాశం ఉంటుంది. ఈ వాతావరణాన్ని అనుకూలంగా మలచుకుని తూర్పుకనుమల్లోని ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో కూంబింగ్‌కు బలగాలు సిద్ధమవుతున్నాయి.
 
 
కొయ్యూరు: బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనమతి ఇచ్చిందన్న వార్తలతో మన్యంలో అలజడి రేగుతోంది. మావోయిస్టులు దీనిని కీలక అంశంగా చేసుకుని ప్రజాప్రతినిధులు,గిరిజన సంఘాల ద్వారా తమ ఉనికిని చాటుకునే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులపై గురిపెట్టే అవకాశాలు లేకపోలేదు. దీనిని పోలీసు శాఖ ముందుగానే పసిగట్టినట్టు తెలుస్తోంది. ఈ వేసవిలో సాధ్యమైనంత వరకు ఏవోబీని జల్లెడ పడితే దళసభ్యుల ప్రభావాన్ని నియంత్రించవచ్చన్న వాదన వ్యక్తమవుతోం ది. ఈమేరకు మావోయిస్టుల ఏరివేత కు వ్యూహం రూపొందించినట్టు భోగ ట్టా. అడవుల్లో ఆకురాల్చే కాలంలో దళసభ్యుల కదలికలను సులువుగా కనిపెట్టవచ్చు. ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకుని కూంబింగ్ కు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా జి. మాడుగుల,పెదబయలు, ముంచంగిపుట్టు ప్రాంతాల్లో దీనిపై దృష్టి పెట్టా రు. ముఖ్యంగా మావోయిస్టులకు వెన్నుదన్నుగా ఉండే మిలిషీయా వ్యవస్థను పోలీసులు కట్టడి చేస్తున్నారు. వా రిని అరెస్టు చేయడం లేకుంటే లొంగి పోయేటట్టు చేస్తున్నారు. మావోయిస్టుల కదలికలు చాలా వరకు మిలిషీయాపై ఆధారపడి ఉంటాయి. సమాచారం చేరవేయడం లేదా కరపత్రాలు వేయడం లేకుంటే చెట్లు నరకడం వంటి పనులను దళసభ్యులువీరి ద్వా రా చేయిస్తారు. వారిని తగ్గిస్తే మావోయిస్టుల కదలికలు తగ్గుతాయని భావించిన పోలీసులు వారిపై దృష్టి పెట్టారు. రెండు నెలల్లో సుమారు 60 మందిని అరెస్టు లేదా లొంగుపోయేటట్టు చేశారు.

మరో వైపు తూర్పుగోదావరి పోలీసులు కూడా కొయ్యూరు మండలానికి చెందిన సుమారు 20 మంది మిలిషీయా సభ్యులను అరెస్టు చేశారు. కాగా ఐదేళ్ల కిందటి వరకు మావోయిస్టుల  కదలికలు కొయ్యూరు, జీకే వీధి, చింతపల్లి మండలాల్లో విస్తృతంగా చోటుచేసుకున్నాయి. అనంతరం ఉద్యమం జి. మాడుగుల, పెదబయలు ప్రాంతాలకు విస్తరించింది. ప్రస్తుతం మావోయిస్టుల కదలికలు  లేదా విధ్వంసాలు ఆ మండలాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరవరం ఘటనలో డీసీఎం శరత్‌ను కోల్పోయిన మావోయిస్టులు మౌనంగా ఉండి సహచరుల మృతికి కారకులైన గబులంవీధి గురువుపై గురి పెట్టారు. అతని ఇంటి ని కూడా ధ్వంసం చేశారు. మావోయిస్టుల నుంచి ఏ రోజైనా ముప్పు తప్పదని భావించిన కొన్ని గిరిజన కుటుం బాలు  బలపం ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement