చిత్తూరు జిల్లాలో భారీ వర్షం
Published Mon, Jun 9 2014 7:11 PM | Last Updated on Mon, Aug 13 2018 3:11 PM
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం నమోదైంది. జిల్లాలోని శ్రీకాళహస్తి, సత్యవేడు, తిరుపతి పట్టణాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇదురుగాలులతో కూడిన భారీ వర్షానికి రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. దాంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఆకస్మికంగా భారీ వర్షం కురియడంతో ప్రజలు ఇక్కట్లకు లోనయ్యారు. రోడ్లపై పడిన చెట్లను తొలగించడానికి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. భారీ వర్షం వల్ల ఎలాంటి ఆర్ధిక నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement