వరంగల్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : జిల్లాలోని పలు ప్రాంతా ల్లో గురువారం భారీ వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు అత్యధికంగా పరకాలలో 8.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతా లు జలమయం కాగా... పలుప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. కొడకండ్ల మండల కేంద్రంలోని బయ్యన్నవాగులోకి వరద నీరు భారీగా చేరుతుండడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. గ్రామంలో భారీ వృక్షం నేలకొరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
పద్మశాలి కాలనీలో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. తొర్రూరు, చిట్యాల, వెలికట్ట, బొమ్మకల్ గ్రామాల్లో చెరువులు అలుగు పోస్తున్నాయి. ఆయూ ప్రాంతాల్లో పత్తి, పెసర పంటలు నీట మునిగాయి. నెల్లికుదురు మండలంలో కాచికల్-ఎర్రబెల్లిగూడెం గ్రామాల మధ్య కల్వర్టుపై వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. తొర్రూరు-కేసముద్రం, నెల్లికుదురు-మహబూబాబాద్ మార్గాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడగా.. కురవి బస్టాండ్ సెంటర్‌లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. నర్సింహులపేట మండలంలో పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.
డో ర్నకల్ మండల కేంద్రంలో వీధులన్నీ జలమయమయ్యా యి. మున్నేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. కేసముద్రం మండలం ఇనుగుర్తిలో పంటలు నీటిలో కొట్టుకుపోయాయి. ఎస్సీ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతంలో ఇళ్లలోకి వరదనీరు చేరింది.
బుధవారం నుంచి గురువారం వరకు వర్షపాతం ఇలా..
బచ్చన్నపేట 10.4 మి.మీ ,స్టేషన్‌ఘనపూర్ 2.0, ధర్మసాగర్ 4.8, హసన్‌పర్తి 6.2, హన్మకొండ 10.6, వర్ధన్నపేట 2.4, జఫర్‌గఢ్ 10.8, పాలకుర్తి 8.0, దేవరుప్పుల 9.4, కొడకండ్ల 8.4, రాయపర్తి 4.8, తొర్రూరు 2.0, నర్సింహులపేట 3.8, మరిపెడ 65.4, డొర్నకల్ 8.0, కురవి 18.2, కేసముద్రం 38.4, నెక్కొండ 6.8, గూడూర్ 31.4, కొత్తగూడ 12.8, ఖా నాపూర్ 5.2, చెన్నారావుపేట 4.0, పర్వతగిరి 3.2, సంగెం 13.8, నల్లబెల్లి 9.8, దుగ్గొండి 6.2, గీసుకొండ 45.0, ఆత్మకూర్ 50.6, శాయంపేట 40.0, పరకాల 87.8, రేగొండ 24.2, మొగుళ్లపల్లి 3.6, గణపురం 11.8, ములుగు 13.4, తాడ్వాయి 2.0, ఏటూరునాగారం 11.2, వరంగల్ 21.4 మిల్లీ మీటర్లుగా నమోదైనట్లు వ్యవసాయ శాఖ ఆధికారులు తెలిపారు.
భారీ వర్షం
Published Fri, Aug 16 2013 2:38 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
Advertisement