low-lying areas
-
వరద గోదారిపై హైఅలర్ట్
* అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం కేసీఆర్ * అన్ని చర్యలు తీసుకోండి.. ప్రాణనష్టం జరగకూడదు * లోతట్టు ప్రాంతాలవారిని రక్షిత ప్రదేశాలకు తరలించండి * మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఎప్పటికప్పుడు స్పందించాలి * రెండేళ్ల వరకు కరువుండదని వ్యాఖ్య.. వరదలపై సమీక్ష సాక్షి, హైదరాబాద్: గోదావరికి వరద పోటెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు, ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. మంత్రులు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను సమన్వయం చేసుకుంటూ పని చేయాలని, జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు వచ్చిన సమాచారం ఆధారంగా స్పందించాలన్నారు. రాష్ట్రంలో వరదల పరిస్థితిపై ఆదివారం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు ఇతర అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. సోమవారం జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ సమాచారం సేకరించాలని, అవసరమైన సూచనలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి సూచించారు. మనుషులు, మూగజీవాల ప్రాణాలను కాపాడడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలన్నారు. అధికారుల సూచనలు పాటించి ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ప్రాజెక్టుల వద్ద నిరంతర పర్యవేక్షణ గోదావరి బేసిన్ ప్రాజెక్టులన్నీ నిండాయని, లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని సీఎం చెప్పారు. ఇన్‌ఫ్లోలను బట్టి ఔట్‌ఫ్లోలను నిర్ధారించుకోవాలని మంత్రి హరీశ్‌రావుకు సూచించారు. ప్రతీ ప్రాజెక్టు వద్ద నీటి పారుదల శాఖ అధికారులను అప్రమత్తంగా ఉంచి, పర్యవేక్షించాలన్నారు. గండిపేట, హిమాయత్‌సాగర్‌తోపాటు రాష్ట్రంలోని దాదాపు అన్ని చెరువులు నిండాయని, చెరువులు అలుగుపోయడంతో గ్రామాల్లో ప్రజలు ఆనందంగా ఉన్నారని సీఎం పేర్కొన్నారు. మరో రెండేళ్ల వరకు కరువు దరిచేరని విధంగా వర్షాలున్నాయని వ్యాఖ్యానించారు. గోదావరి, కృష్ణా నీళ్లను హైదరాబాద్ మంచినీటి అవసరాలకు వాడాలని, గండిపేట, హిమాయత్‌సాగర్ నీళ్లను యథావిధిగా ఉంచడం వల్ల నగర పరిధిలో భూగర్భ జలమట్టం పెరుగుతుందన్నారు. చెరువు కట్టలను ఎప్పటికప్పుడు గమనించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టులు, చెరువులను చూసేందుకు వెళ్లే సందర్శకులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. పోలీసులు కూడా ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రమాదకరస్థాయికి గోదావరి! వరదలతో ఉప్పొంగుతున్న గోదావరి ప్రమాద స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయని సీఎం అన్నారు. ఎగువన మహారాష్ట్ర నుంచి పెద్దఎత్తున వరద ప్రవాహం వస్తోందని, ఎస్సారెస్పీ, నిజాంసాగర్, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, సింగూరు తదితర ప్రాజెక్టులన్నీ నిండాయన్నారు. వాటి నుంచి నీరు విడుదల చేస్తున్నందున గోదావరికి గంటగంటకూ నీటి ప్రవాహం పెరుగుతుందన్నారు. ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకల ద్వారా భారీగా నీరు గోదావరిలోకి చేరుతోందన్నారు. అందువల్ల కాళేశ్వరం నుంచి భద్రాచలం వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గోదావరి ప్రవాహ ఉధృతి ఆదివా రం రాత్రికి 8 లక్షల క్యూసెక్కులకు చేరుతుందన్న అంచనా ఉందన్నారు. ఏటూరునాగారం వద్ద బస చేసి పరిస్థితిని పర్యవేక్షించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణను, భద్రాచలం వద్ద ఉండి ఎప్పటికప్పుడు స్పందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సీఎం ఆదేశించారు. -
శివమొగ్గలో భారీ వర్షం
జనజీవనం అస్తవ్యస్తం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న వానలు యడూరిలో 158 మిమీ వర్షం శివమొగ్గ : శివమొగ్గ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం వరకు నగరంలో భారీ వర్షం నమోదైంది. దీంతో జన జీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మధ్యాహ్నం వర్షం కొంచెం తగ్గుముఖం పట్టినా సాయంత్రం కుండపోత పడింది. దీంతో నగర వాసులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్యోగస్తులు, విద్యార్థులు ఇళ్లలోని ఉండిపోయారు. హెలీప్యాడ్ సర్కిల్, కువెంపు సర్కిల్, ఇతర ప్రముఖ కూడళ్లలో వరద నీరు చెరువును తలపించింది. నమోదైన వర్షం వివరాలు గడిచిన 24 గంటల వ్యవధిలో పశ్చిమ కొండ ప్రాంతాలు ఆగుంబె 107 మిమీ, యడూరిలో 158, మాస్తీకట్టెలో 148, హులికల్లు 128, మాణిడ్యాం ప్రదేశంలో 162 మిమీ, శివమొగ్గలో 9.20, భద్రావతిలో 47.80, తీర్థహళ్లిలో 87.20, సాగరలో 36.60, శికారిపురలో 36.40, సోరభలో 27, హోసనగరలో 36.6 మిమీ వర్షపాతం నమోదైంది. జలాశయాల నీటి మట్టం అధికారుల వివరాల మేరకు జలాశయాల నీటిమట్టం ఈ విధంగా ఉన్నాయి. ప్రముఖ జల విద్యుత్ ఉత్పాదన కేంద్రం లింగనమక్కి జలాశయంలో నీటిమట్టం 1778.40 అడుగులు ఉంది. గరిష్ట నీటి మట్టం 1819 అడుగులు. జలాశయంలో 46,341 క్యూసెక్కుల వరద నీరు చేరింది. భద్రా జలాశయం నీటి మట్టం 163.30 అడుగులు కాగా ఈ జలాశయం గరిష్ట నీటి మట్టం186 అడుగులు. 23,281 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి చేరింది. 144 క్యూసెక్కుల నీటిని బయటికి విడుదల చేశారు. తుంగా జలాశయంలో ఇప్పటికే 588.24 అడుగులకు నీరు చేరింది. బుధవారం జలాశయంలోకి 41 వేల క్యూసెక్కుల వరద నీరు జలాశయంలో చేరగా అంతే ప్రమాణంలోబయటకు విడుదల చేశారు. లింగనమక్కిలో జలాశయంలో బుధవారం నాటికి 1778.40 అడుగుల నీరు చేరింది. -
వాన.. హైరానా..!
-
భారీ వర్షం
వరంగల్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : జిల్లాలోని పలు ప్రాంతా ల్లో గురువారం భారీ వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు అత్యధికంగా పరకాలలో 8.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతా లు జలమయం కాగా... పలుప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. కొడకండ్ల మండల కేంద్రంలోని బయ్యన్నవాగులోకి వరద నీరు భారీగా చేరుతుండడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. గ్రామంలో భారీ వృక్షం నేలకొరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పద్మశాలి కాలనీలో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. తొర్రూరు, చిట్యాల, వెలికట్ట, బొమ్మకల్ గ్రామాల్లో చెరువులు అలుగు పోస్తున్నాయి. ఆయూ ప్రాంతాల్లో పత్తి, పెసర పంటలు నీట మునిగాయి. నెల్లికుదురు మండలంలో కాచికల్-ఎర్రబెల్లిగూడెం గ్రామాల మధ్య కల్వర్టుపై వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. తొర్రూరు-కేసముద్రం, నెల్లికుదురు-మహబూబాబాద్ మార్గాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడగా.. కురవి బస్టాండ్ సెంటర్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. నర్సింహులపేట మండలంలో పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. డో ర్నకల్ మండల కేంద్రంలో వీధులన్నీ జలమయమయ్యా యి. మున్నేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. కేసముద్రం మండలం ఇనుగుర్తిలో పంటలు నీటిలో కొట్టుకుపోయాయి. ఎస్సీ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతంలో ఇళ్లలోకి వరదనీరు చేరింది. బుధవారం నుంచి గురువారం వరకు వర్షపాతం ఇలా.. బచ్చన్నపేట 10.4 మి.మీ ,స్టేషన్ఘనపూర్ 2.0, ధర్మసాగర్ 4.8, హసన్‌పర్తి 6.2, హన్మకొండ 10.6, వర్ధన్నపేట 2.4, జఫర్‌గఢ్ 10.8, పాలకుర్తి 8.0, దేవరుప్పుల 9.4, కొడకండ్ల 8.4, రాయపర్తి 4.8, తొర్రూరు 2.0, నర్సింహులపేట 3.8, మరిపెడ 65.4, డొర్నకల్ 8.0, కురవి 18.2, కేసముద్రం 38.4, నెక్కొండ 6.8, గూడూర్ 31.4, కొత్తగూడ 12.8, ఖా నాపూర్ 5.2, చెన్నారావుపేట 4.0, పర్వతగిరి 3.2, సంగెం 13.8, నల్లబెల్లి 9.8, దుగ్గొండి 6.2, గీసుకొండ 45.0, ఆత్మకూర్ 50.6, శాయంపేట 40.0, పరకాల 87.8, రేగొండ 24.2, మొగుళ్లపల్లి 3.6, గణపురం 11.8, ములుగు 13.4, తాడ్వాయి 2.0, ఏటూరునాగారం 11.2, వరంగల్ 21.4 మిల్లీ మీటర్లుగా నమోదైనట్లు వ్యవసాయ శాఖ ఆధికారులు తెలిపారు.