రాహుకేతు పూజ నిర్వహిస్తున్న హీరో విశాల్
రానున్న ఎన్నికల్లో ప్రజలు మంచి నాయకుడుకి ఓటు వేసి ఎన్నుకోవాలని సినీనటుడు విశాల్ పిలుపు నిచ్చారు. శనివారం ఆయన తన తల్లితో కలసి శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చారు. రాహుకేతు పూజలు చేయించుకున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. నియోజకవర్గాన్ని ఏ నాయకుడు అయితే అభివృద్ధి చేస్తాడో... కనీసవసతులు కల్పిస్తాడో,సంక్షేమ పథకాలు సక్రమంగా పేదలకు అందించగలడనే నమ్మకం కలిగిన నాయకుడిని ఎంపిక చేసుకుని ఓట్లు వేయాలని సూచించారు.
ప్రలోభాలకు గురిచేసే వారిని ,డబ్బులతో ఓట్లు కొనుగోలు చేయాలనే వారికి ఓట్లేస్తే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. తాను ఏపార్టీకి చెందిన వ్యక్తిని కాదని, తమిళనాడులో పార్టీలతో నిమిత్తం లేకుండా తమ ని యోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తే మంచి నాయకుడుకి ఓటు వేస్తానని స్పష్టం చేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఇదే మొదటిసారిగా వచ్చానని తెలిపారు. ఆలయ శిల్పసౌందర్యం అద్భుతంగా ఉందన్నారు. తమిళం లో విజయవంతమైన చిత్రాన్ని తెలుగులో ఇంద్రుడు అనే పేరుతో అనువదిస్తునట్టు తెలి పారు. ఆయనకు ఆలయాధికారులు స్వామి,అమ్మవార్ల చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. విశాల్‌ను చూడడానికి భక్తులు, స్థానికులు ఆసక్తి కనబరిచారు.