'30 మందికి వెంటనే పెన్షన్లు ఇవ్వండి'
Published Thu, Jan 28 2016 11:21 AM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM
శ్రీకాకుళం: జన్మభూమి కమిటీలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయటంలో పక్షపాతం కనబరుస్తాయని చెప్పేందుకు తార్కాణం ఇది. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం అప్పల అగ్రహారం గ్రామానికి చెందిన వృద్ధులు హైకోర్టును ఆశ్రయించి గెలుపుసాధించుకున్నారు.
గ్రామంలోని దాదాపు 30 మంది వృద్ధులకు అందుతున్న పింఛన్ ను అధికారులు నిలిపివేశారు. ఇదేమని అడిగితే గ్రామ జన్మభూమి కమిటీ ఆ మేరకు సిఫారసు చేసిందని బదులిచ్చారు. దీనిపై వృద్ధులంతా కలసికట్టుగా హైకోర్టును ఆశ్రయించారు. తాము అన్ని విధాలుగా అర్హులైనప్పటికీ రాజకీయ కారణాలతో పింఛనును ఆపారని విన్నవించుకున్నారు. వారి ఫిర్యాదును పరిశీలించిన న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. తక్షణమే 30 మంది బాధితులకు పింఛను అందించాలని ఎంపీడీవోను ఆదేశించింది.
Advertisement