
సాక్షి, అమరావతి: వైజాగ్ వీధుల్లో హల్‌చల్ చేసిన డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆసుపత్రికి వెళ్లి సుధాకర్ వాగ్మూలాన్ని రికార్డు చేయాలని విశాఖ సెషన్స్ జడ్జిని హైకోర్టు ఆదేశించింది. రేపు సాయంత్రంలోగా వాగ్మూలాన్ని హైకోర్టులో సమార్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌తో పాటు వీడియో క్లిపింగ్స్‌ను కూడా పిటిషనర్ తరుపు న్యాయవాదికి ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి కోర్టు వాయిదా వేసింది. నర్సీపట్నానికి చెందిన డాక్టర్ రోడ్డుపై హల్‌చల్ చేస్తూ ప్రభుత్వం వివిధ ఆరోపణలు చేశారు. రోడ్డు మీద గోల చేయడంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే
Comments
Please login to add a commentAdd a comment