మౌన నిరసన | High Court Quashes YSRCP MLA Roja's Suspension | Sakshi
Sakshi News home page

మౌన నిరసన

Published Sun, Mar 20 2016 3:58 AM | Last Updated on Mon, Oct 29 2018 8:08 PM

మౌన నిరసన - Sakshi

మౌన నిరసన

అంబేడ్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకం
నల్లబ్యాడ్జీలతో వైఎస్సార్ సీపీ శ్రేణుల వినూత్న నిరసన

 
వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజాకు చట్టసభ ఆవరణలో జరిగిన అవమానంపై జిల్లా వ్యాప్తంగా శనివారం నిరసన గళం వినిపించింది. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. రాజ్యాంగ రక్షణకు మళ్లీ తిరిగి భూమిపై అంబేడ్కర్ అడుగు పెట్టాలని వేడుకున్నారు.నిరసనలోవైఎస్‌ఆర్‌సీపీనాయకులతోపాట అన్ని విభాగాల నాయకులుపాల్గొన్నారు. - సాక్షి ప్రతినిధి, విజయవాడ
 
 
విజయవాడలో వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్ల నాయకత్వాన మాచవరంలోని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రాజ్యాంగాన్ని రక్షించాలంటూ నినాదాలు చేశారు. కార్పొరేటర్లతోపాటు  వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
 మైలవరంలో.. : మైలవరంలో నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో  ర్యాలీ, అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. జోగి రమేష్, మైలవరం, జి.కొండూరు మండలాల పార్టీ కన్వీనర్‌లు పామర్తి శ్రీనివాసరావు, మందా జక్రధరరావు, పట్టణ కన్వీనర్ షేక్ కరీం, ఎంపీటీసీ షేక్ రహీమ్ పాల్గొన్నారు. జి.కొండూరు మండలంలో  ఎంపీపీ వేములకొండ తిరుపతిరావు, జడ్‌పీటీసీ కాజా బ్రహ్మయ్య, వైఎస్‌ఆర్‌సీపీ మండల అధ్యక్షులు మండా జక్రధరరావు, కేడీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు వి.రాంబాబు, పామర్తి వెంకటనారాయణ, శాగం శంకరరెడ్డి పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలో మండల కన్వీనర్ బొమ్మసాని వెంకట చలపతిరావు, ఎం.నాగిరెడ్డిలు, రెడ్డిగూడెంలో మండల అధ్యక్షులు పాలంకి మురళీమోహనరెడ్డి అధ్వర్యంలో ఎస్సీ సెల్ మండల కన్వీనర్ సుధాకర్, పాల్గొన్నారు.
 గుడివాడలో... : గుడివాడ పట్టణం గాంధీ మండపంలోని  గాంధీజీ విగ్రహం ఎదుట నోటికి నల్ల రిబ్బన్లు ధరించి నిరసనలో పాల్గొన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ , సీనియర్ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. గుడ్లవల్లేరులో వైఎస్సార్‌సీపీ మండల యూత్ అధ్యక్షులు కొడాలి రామరాజు ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. గుడివాడ రూరల్ మండలం వలివర్తిపాడులో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.  

 కైకలూరులో.. : కైకలూరులో దూలం నాగేశ్వరరావు, కలిదిండిలో మండల పార్టీ అధ్యక్షులు నీలపాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి నంబూరి శ్రీదేవిలు, ముదినేపల్లి మండలంలో మండల పార్టీ అధ్యక్షుడు బడుగు భాస్కరరావు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు నిమ్మగడ్డ భిక్షాలు ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. కలిదిండిలో రోడ్డుపై ధర్నా నిర్వహించారు.

పెనమలూరులో.. : పెనమలూరు మండలం కామయ్యతోపు, యనమలకుదురు గ్రామాల్లో అంబేడ్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. యనమలకుదురులో ప్రజలకు గులాబీలు పంచి వినూత్న నిరసన తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు కిలారు శ్రీనివాసరావు, నియోజకవర్గ నాయకులు కాసరనేని కోటేశ్వరరావు, ఎంపీటీసీ ఫ్లోర్‌లీడర్ చాముండేశ్వరిలు పాల్గొన్నారు. ఉయ్యూరు మండలం కడవకొల్లు గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. నల్లరిబ్బన్లు ధరించి నేతలు నిరసన తెలిపారు. ఎంపీపీ తుమ్మూరు గంగారత్నం, పార్టీ జిల్లా నాయకులు వంగవీటి శ్రీనివాసప్రసాద్, మండల, పట్టణ అధ్యక్షులు దాసే రవి, జంపాన కొండలరావు పాల్గొన్నారు. కంకిపాడు లాకులు  అంబేడ్కర్ విగ్రహం వద్ద  నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. ఉయ్యూరు మండల నాయకులు తుమ్మల చంద్రశేఖర్, బండి నాంచారయ్య, మాదు వసంతరావు పాల్గొన్నారు.

పెడనలో.. : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెడన పట్టణ అధ్యక్షులు బండారు మల్లికార్జునరావు ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. పెడన సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్, పార్టీ యూత్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పాల రాము, పార్టీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు బండారు ఆనంద్ ప్రసాద్ పాల్గొన్నారు. బంటుమిల్లి లక్ష్మీపురం సెంటర్‌లో మండల అధ్యక్షులు ముత్యాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు తిరుమాని శ్రీనివాస్, పార్టీ మహిళా విభాగం జిల్లా కార్యదర్శి సైదాని పాల్గొన్నారు. గూడూరు సెంటర్‌లో బొమ్ము గంగాప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.

నూజివీడులో.. : చిన్నగాంధీబొమ్మ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పగడాల సత్యనారాయణ, మున్సిపల్ చైర్‌పర్సన్ బసవా రేవతి, మండల అధ్యక్షులు మందాడ నాగేశ్వరరావు, జెడ్పీటీసీ బాణావతు రాజు, యువజన విభాగం అధ్యక్షులు పిళ్లా చరణ్, దేవరకొండ మధు, పలవురు కౌన్సిలర్లు, నాయకులు  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement