అనంతపురం: అనంతపురం ఆర్టీసీ డిపో వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. ఉన్నతాధికారులు ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు నడపడంపై ఆ సంస్థ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులు నడుపుతున్న ప్రైవేట్ వ్యక్తులపై కార్మికులు దాడి చేశారు. అంతేకాకుండా ఐదు ఆర్టీసీ బస్సులపై దాడి చేసి అద్దాలు పగల కొట్టారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి కార్మికులను అరెస్ట్ చేశారు.