విజయవాడ: కృష్ణాజిల్లా గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. కాంట్రాక్ట్ కార్మికులతో బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు యత్నించారు. ఆ క్రమంలో బస్సులు బస్టాండ్ నుంచి బయలుదేరుతున్న సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు బస్టాండ్ వద్దకు చేరుకుని... బస్సులు కదలడానికి వీలు లేదని వారు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బస్టాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.