క్రైం (కడప అర్బన్) : జిల్లాలో హోంగార్డుల సేవలు పోలీసులతో సమానంగా ఉన్నాయని, వారి సంక్షేమానికి కృషి చేస్తామని జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ అన్నారు. పోలీస్ పెరేడ్‌గ్రౌండులో శనివారం సాయంత్రం 52వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా విచ్చేపిన జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాటీకి హోంగార్డ్స్ కమాండెంట్ శ్రీహరి ఆధ్వర్యంలో కవాతు నిర్వహించి గౌరవ వందనం చేశారు. అనంతరం వారి పెరేడ్‌ను ఎస్పీ స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో 782 మంది హోంగార్డులు ఉన్నారన్నారు. ప్రభుత్వం ప్రస్తుతంహోంగార్డుల కోసం రోజు వారిగా రూ 300 చొప్పున నెలకు రూ. 9 వేలు వేతనం ఇస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వమే ఈ మొత్తాన్ని భరిస్తోందన్నారు. ఉమేష్‌చంద్ర మెమోరియల్ కల్యాణ మండపంలో పోలీసు కుటుంబాలతో హోంగార్డు కుటుంబాలవారు ఫంక్షన్లు చేసుకుంటే వారికి కూడా రూ.6 వేలు మాత్రమే అద్దె తీసుకునే సౌకర్యం కల్పిస్తున్నారన్నారు.
హోంగార్డులు ఎవరైనా ప్రమాదవశాత్తు మృతి చెందితే తక్షణ సాయంగా రూ.3 వేలు అందిస్తామన్నారు. ఇటీవల వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారన్నారు. అలాగే కల్పతరువులోగాని, సీపీసీలో గాని, అక్కడ లభించే వస్తువులను పోలీసులతోపాటు కొనుగోలు చేసి తీసుకుని వెళ్లేలాసౌకర్యం కల్పించామన్నారు. జిల్లా అదనపు ఎస్పీ విజయ్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ చిన్నిక్రిష్ణ, ఆర్‌ఐలు హరికృష్ణ, సత్యగోపాల్, ఏఆర్ ఎస్‌ఐలు, ఏఆర్ సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.
హోంగార్డుల సంక్షేమానికి కృషి
Published Sun, Dec 7 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM
Advertisement
Advertisement