home gurd
-
పెళ్లికి నిరాకరించిందనే.. దారుణ హత్య
బంజారాహిల్స్ : జవహర్‌నగర్‌లో జరిగిన యువతి హత్య కేసులో మిస్టరీ వీడింది. ఆమె ప్రియుడే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... తూర్పుగోదావరి జిల్లా, రావులపాలెం గ్రామానికి చెందిన అగ్గిరాముడు, అన్నపూర్ణ దంపతుల కుమార్తె వెంకటలక్ష్మి(19) ఏడాది క్రితం మధురానగర్‌లోని ఓ ఇంట్లో పని చేసేది. అదే ఇంటిపై ఉంటున్న హైదరాబాద్ ట్రాఫిక్ మాజీ డీసీపీ రంగనాథ్ (ప్రస్తుతం నల్లగొండ ఎస్పీ) ఇంట్లో ఖమ్మంకు చెందిన మిడికొండ సాగర్(24) అనే హోంగార్డు డ్రైవర్‌గా పని చేసేవాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీయడంతో ఇద్దరు కలిసి తిరిగారు. అయితే కులాలు వేరుకావడంతో వెంకటలక్ష్మి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో ఏడాది క్రితం అక్కడ పనిమానేసిన వెంకటలక్ష్మి జవహర్‌నగర్‌లోని జోడి వన్‌గ్రామ్ గోల్డ్ స్టోర్‌లో సేల్స్‌గర్ల్‌గా చేరింది. అప్పటి నుంచి సాగర్‌ను దూరం పెట్టడంతో కక్ష పెంచుకున్న సాగర్ రెండు, మూడుసార్లు దుకాణానికి వస్తున్న ఆమెను అడ్డుకుని ఘర్షణ పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు కూడా మందలించినా సాగర్ వైఖరిలో మార్పు రాలేదు. ఐదు రోజుల క్రితం వెంకటలక్ష్మి మరో యువకుడితో బైక్‌పై వెళుతుండటాన్ని చూసిన సాగర్ ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం బ్లేడ్ కొనుక్కొని వెంకటలక్ష్మి పని చేస్తున్న స్టోర్‌కు వచ్చి తనను ఎందుకు దూరం పెడుతున్నావని నిలదీశాడు. దీంతో ఆమె తన యజమానికి ఫోన్ చేసి సాగర్ తనతో గొడవపడుతున్నట్లు చెప్పడంతో పోలీసులు వస్తారేమోనన్న భయంతో సాగర్ బ్లేడ్‌తో ఆమె గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడుతున్న వెంకటలక్ష్మి ఇంకా చనిపోలేదని గుర్తించి చున్నీతో ఉరివేసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎస్పీ రంగనాథ్ ఇంటికి వెళ్లి డ్యూటీలో చేరిపోయాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు మృతురాలి తల్లిదండ్రుల ద్వారా సాగర్ వివరాలు తెలుసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. -
హోంగార్డుల సంక్షేమానికి కృషి
క్రైం (కడప అర్బన్) : జిల్లాలో హోంగార్డుల సేవలు పోలీసులతో సమానంగా ఉన్నాయని, వారి సంక్షేమానికి కృషి చేస్తామని జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ అన్నారు. పోలీస్ పెరేడ్గ్రౌండులో శనివారం సాయంత్రం 52వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా విచ్చేపిన జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాటీకి హోంగార్డ్స్ కమాండెంట్ శ్రీహరి ఆధ్వర్యంలో కవాతు నిర్వహించి గౌరవ వందనం చేశారు. అనంతరం వారి పెరేడ్‌ను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో 782 మంది హోంగార్డులు ఉన్నారన్నారు. ప్రభుత్వం ప్రస్తుతంహోంగార్డుల కోసం రోజు వారిగా రూ 300 చొప్పున నెలకు రూ. 9 వేలు వేతనం ఇస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వమే ఈ మొత్తాన్ని భరిస్తోందన్నారు. ఉమేష్‌చంద్ర మెమోరియల్ కల్యాణ మండపంలో పోలీసు కుటుంబాలతో హోంగార్డు కుటుంబాలవారు ఫంక్షన్లు చేసుకుంటే వారికి కూడా రూ.6 వేలు మాత్రమే అద్దె తీసుకునే సౌకర్యం కల్పిస్తున్నారన్నారు. హోంగార్డులు ఎవరైనా ప్రమాదవశాత్తు మృతి చెందితే తక్షణ సాయంగా రూ.3 వేలు అందిస్తామన్నారు. ఇటీవల వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారన్నారు. అలాగే కల్పతరువులోగాని, సీపీసీలో గాని, అక్కడ లభించే వస్తువులను పోలీసులతోపాటు కొనుగోలు చేసి తీసుకుని వెళ్లేలాసౌకర్యం కల్పించామన్నారు. జిల్లా అదనపు ఎస్పీ విజయ్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ చిన్నిక్రిష్ణ, ఆర్ఐలు హరికృష్ణ, సత్యగోపాల్, ఏఆర్ ఎస్ఐలు, ఏఆర్ సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు. -
హోంగార్డు వీరంగం
పెండ్లిమర్రి, న్యూస్‌లైన్ : ఓ హోంగార్డు క్రమ శిక్షణ తప్పాడు. వీరంగం సృష్టించాడు. చివరకు భక్తులు తిరగబడటంతో తోక ముడిచాడు. ఈ సంఘటన పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నందిమండలం గ్రామ సమీపంలోని కొండ గంగమ్మ ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. బండలాగుడు పోటీలు కూడా నిర్వహించారు. ఉత్సవాలకు వచ్చిన ఉలవలపల్లెకు చెందిన విశ్వనాథ్‌రెడ్డి అనే భక్తుడు అల్లరి చేస్తుండగా అతన్ని మందలించాల్సిన హోంగార్డు శేఖర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. దురుసుగా మాట్లాడాడు. అంతటితో ఆగక ‘ఖాకీ అంటే ఏమనుకుంటున్నావ్.. నా తడాఖా చూపిస్తా.. అనే లెవల్లో రెచ్చిపోయాడు.దీంతో భయపడిన విశ్వనాథ్‌రెడ్డి తప్పించుకునేందుకు పరుగులు పెట్టాడు. హోంగార్డు కూడా వెంబడించాడు. అయితే అతను దొరకలేదన్న అక్కసుతో లాఠీని విసిరాడు. అది కాళ్లకు తగులుకొని విశ్వనాథరెడ్డి కిందపడిపోయాడు. సంఘటనలో అతని కాలుకు గాయమైంది. ఇదంతా గమనించిన భక్తుల్లో అగ్రహం కట్టలు తెంచుకుంది. హోంగార్డుపై తిరగబడ్డారు. రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటనలో హోంగార్డు తలకు తీవ్ర గాయాలయ్యాయి. బందోబస్తులో ఉన్న పోలీసులు హోంగార్డును వేంపల్లె ప్రభుత్వాస్పత్రికి, విశ్వనాథరెడ్డిని కడప రిమ్స్‌కు తరలించారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో హోంగార్డు చర్యలను నిరసిస్తూ బాధితుడు విశ్వనాథరెడ్డి బంధువులు కడప-పులివెందుల ప్రధాన ర హదారిపై బైఠాయించారు. దీంతో రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. కొందరు గ్రామస్తులు, పోలీసులు కల్పించుకుని వారికి సర్దిచెప్పారు. దీంతో వారు రాస్తారోకోను విరమించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థతిని అదుపులోకి తెచ్చారు.