ఈ మాస్క్‌లు..ఎండ నుంచి.. క్యాప్‌డతాయ్!
హాట్ సమ్మర్‌కి... కూల్ థింక్స్
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎండ వేడి నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన రోజులివీ.. మహిళలు ముఖాలకు స్కార్‌ఫలు ధరిస్తుండగా.. మగవారు కర్చీఫ్‌లు, మాస్క్‌లను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు ఎండవేడి నుంచి రక్షణ కల్పించే టోపీలు, ఫేస్‌మాస్క్‌లు.. క్లాత్ మాస్క్‌లు ఆన్‌లైన్ మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
ఫ్యాన్ క్యాప్
‘గ్రీన్ హారిజన్స్ సాలిడ్ హెడ్ క్యాప్’ పేరిట ఆన్‌లైన్ మార్కెట్‌లో ఫ్యాన్‌తో కూడిన క్యాప్‌లు లభ్యమవుతున్నాయి. ద్విచక్ర వాహనం, నడుచుకుంటూ వెళ్లే వారికి ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. దీని ధర రూ.500 వరకూ ఉంది.
ఫేస్ మాస్క్
‘ఫేస్, నోస్, ఇయర్, నెక్ పేరిట ద్విచక్ర వాహన చోదకుల కోసం ప్రత్యేకంగా మాస్క్‌లు రూపొందించారు. చెవి, ముక్కు, చెవ్వులకు వేడి గాలులు తగలకుండా ఇది రక్షణ కవచంగా పని చేస్తుంది. లోపల చిన్నపాటి ఫ్యాన్లు ఉండడంతో చల్లగా గాలి వీస్తుంది. ముఖానికి ఎంత నుంచి రక్షణ కల్పించే దీని ధర రూ.1500.
క్లాత్ మాస్క్ : కాటన్‌తో తయారు చేయబడిన క్లాత్ మాస్క్ ఎండ ముక్కుకు, చెవులకు తగల కుండా కాపాడుతుంది. దీని ధర రూ.130వీటితో పాటు ఎండ నుంచి రక్షణ పొందేందుకు చేతిలో, జేబుల్లో ఇమిడిపోయే బోలెడు పరికరాలు అందుబాటులో ఉన్నాయి. లిటిల్ ఫ్యాన్ అందుబాటులో ఉంది. దీనిని మన సెల్ చార్జింగ్ పిన్‌కు అనుసంధానం చేసి వినియోగించుకోవచ్చు. దీని ధర రూ.300. ఇది ఆన్‌లైన్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది.