సంరక్షణ ఎలా? | How to care? | Sakshi
Sakshi News home page

సంరక్షణ ఎలా?

Published Sat, Jul 18 2015 2:49 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM

How to care?

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన మహోత్సవ కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. హరిత అనంత పథకం కింద 20 లక్షల మొక్కల పెంపకం అధికారులకు కత్తి మీద సాములా మారుతోంది. భూగర్భ జలాలు రోజు రోజుకు అడుగంటుతున్న ప్రస్తుత నేపధ్యంలో మొక్కలను బతికించేదెలా అన్నది అధికారులను వేధిస్తున్న ప్రశ్న. ఈ ఏడాది ఇప్పటి వరకు సరైన వర్షాలు కూడా లేకపోవడంతో ఈ కార్యక్రమం ముందుకు సాగడం అనుమానంగానే ఉంది.
 
 యూనివర్సిటీ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం యూజీ విభాగంలో అక్రమాలను నిగ్గు తేల్చడానికి నియమించిన కమిటీ దర్యాప్తు కొనసాగుతోంది. సత్వరంగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కమిటీ భావించినప్పటికీ అవకతవకలు అంచనాలకు మించి ఉండడంతో జాప్యమవుతోంది. సమగ్ర దర్యాప్తునకు మరింత సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. శుక్రవారం వరకు జరిగిన దర్యాప్తులో తేలిన వివరాలు ఇలా ఉన్నాయి.
 
 66 మంది విద్యార్థులు ఎలాంటి పరీక్ష ఫీజు కట్టకుండా, పరీక్షలకు గైర్హాజరు అయినప్పటికీ ఉత్తీర్ణత చెందినట్లు ప్రకటించారు. ఆ మేరకు సర్టిఫికెట్లు జారీ చేశారు. ఒకే గ్రూపునకు సంబంధించిన 1,980 మంది విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులు కలపకపోవడంతో ఫెయిలయ్యారు. 1,420 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టారు. ఈ విషయం నామినల్ రోల్స్‌లోనూ ఉంది. కానీ వారి ఫలితాలు ఆపేశారు.  
 
 డిగ్రీ ఫలితాలు గత నెల 18న విడుదల చేశారు. ఫెయిలైనవారు, మార్కులు తక్కువ వచ్చిన వారు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 3న తుది గడువు ఇచ్చారు. ఈ దఫా ఆన్‌లైన్‌లో నూతన దరఖాస్తు విధానాన్ని అమలు చేశారు.  ఈ నెల 4న 14 మంది, ఏడోతేదీన 48 మంది దరఖాస్తు చేశారు. వాస్తవానికి ఆన్‌లైన్‌లో మూడోతేదీ తర్వాత దరఖాస్తులు స్వీకరించకూడదు. అయినప్పటికీ 4,7 తేదీలలో దరఖాస్తులు తీసుకోవడానికి సహకరించిన ఔట్‌సోర్సింగ్ సంస్థపై ఆరోపణలు వస్తున్నాయి.
 
 లెక్కకు మించి తప్పిదాలు :  ఒక్క గ్రూప్‌లోనే మూడు వేల మంది విద్యార్థులను ఫెయిల్ చేసినట్లు తెలిసింది. ఇంకా రెండు గ్రూపుల సబ్జెక్టుల వివరాలు తెలియాల్సి ఉంది. దీంతో లెక్కకు మించి తప్పిదాలు జరిగినట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement