విదర్భ నుంచి తెలంగాణ , దక్షిణ కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ఆవరించి ఉన్న అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది.
సాక్షి, విశాఖపట్నం: విదర్భ నుంచి తెలంగాణ , దక్షిణ కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ఆవరించి ఉన్న అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణ , రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుముల తో కూడినజల్లులు కురిసే అవకాశా లున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణ లోని పలు జిల్లాల్లో రాగల 48 గంట ల్లో తీవ్ర వడగాల్పులుంటాయని భారత వాతావరణ శాఖ తన నివేదికలో పేర్కొంది.
వేడిగాలుల తీవ్రత కోస్తాం ధ్రలో గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోను, తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీం నగర్, వరంగల్ జిల్లాల్లోనూ ప్రభావం చూపనున్నట్టు తెలిపింది. వేడిగాలుల వల్ల ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6 డిగ్రీలు ఎక్కువగా నమోదు కావచ్చని పేర్కొంది. శనివారం రెంటచింతలలో అత్యధికంగా 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని వెల్లడించింది.