హుదూద్‌పై పీఎం మోదీ అత్యవసర భేటీ
న్యూఢిల్లీ: హుదూద్ తుపాను ప్రభావంపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు సాఫీగా జరిగేలా చూడాలన్నారు. తుపానును ఎదుర్కొనేందుకు సంసిద్ధతపై సమీక్షించేందుకు ప్రధాని శనివారం అత్యవసరంగా అత్యున్నతస్థారుు సమావేశం నిర్వహించారు. ఆయూ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఎప్పటికప్పుడు చర్చించాల్సిందిగా హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సూచించినట్లు అధికారిక ప్రకటన ఒకటి వెల్లడించింది. తుపాను ప్రభావిత రాష్ట్రాల అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని ప్రధాని కేంద్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించినట్లు ప్రకటన తెలిపింది.
ఎన్‌సీఎంసీ సమావేశం: తుపాను పరిస్థితులను సమీక్షిం చేందుకు జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ (ఎన్‌సీఎంసీ) శని వారం ఢిల్లీలో మరోమారు సమావేశమైంది. కేబినెట్ కార్యద ర్శి అజిత్ సేథ్ భేటీకి అధ్యక్షత వహించారు. ఏపీ, ఒడిశాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను ఆయన సమీక్షించారు.