శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియను స్క్రూటినీ చేస్తున్న ప్రిన్సిపాల్ బాబూరావు, కమిటీ సభ్యులు
సాక్షి, శ్రీకాకుళం : డిగ్రీకి డిమాండ్ పెరిగింది. ఇంజినీరింగ్ కోర్సులను కాదని అధిక సంఖ్యలో విద్యార్థులు డిగ్రీలో చేరుతున్నారు. ముఖ్యంగా సైన్స్ గ్రూపుల సీట్లకు ఎక్కడా లేని డిమాండ్ పెరిగిపోయింది. అదే విధంగా బీకాంకు ఇప్పటికీ క్రేజ్ తగ్గకపోవడం విశేషం. ఆర్ట్స్ గ్రూపులకు కూడా ఫరవాలేదనిపించే విధంగా అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇకపోతే పీజు రీయింబర్స్‌మెంట్ గత ఐదేళ్లలో సకాలంలో రాకపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతుండేవారు. జిల్లాకే తలమానికంగా నిలుస్తూ వస్తున్న ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. 2019–20 విద్యాసంవత్సరానికి గాను అడ్మిషన్ల పరంపర ఇటీవలి కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్) కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లో గత మూడు రోజుల కిందట ప్రవేశాలను మొదలు పెట్టారు. ప్రవేశాల కోసం ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్‌లను పూర్తిచేసిన అధికారులు తాజాగా వెయిటింగ్ లిస్ట్‌లో మెరిట్‌లో ఉన్న విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తున్నారు. కళాశాల విద్య కమిషనర్ ఆదేశాల మేరకు రోస్టర్ పాయింట్ల ప్రాతిపదికన, గ్రేడ్ పాయింట్ల లో మెరిట్ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు చోటు కల్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment