జగన్ రాకతో తిరుపతి జనసంద్రం
తిరుపతి : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాకతో జనసంద్రంగా మారింది. 'వైఎస్ఆర్ జనభేరి' సభకు వేలాదిగా జనం తరలి వస్తున్నారు. జగన్ రాకతో తిరుపతి రోడ్లు జనమయం అయ్యాయి. యువత, మహిళలు పెద్ద ఎత్తున రోడ్ షోలో పాల్గొన్నారు. మరోవైపు జగన్ నినాదాలతో తిరుపతి రోడ్లు మారుమోగుతున్నాయి. మరోవైపు నడవలేని స్థితిలో కూడా వృద్దులు రాజన్న తనయుడ్ని చూడటానికి తరలి వస్తున్నారు.
కాగా సీమాంధ్రను సింగపూర్ చేస్తానంటోన్న టీడీపీ అధినేత చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారని వైఎస్ఆర్ సీపీ నేతలు ప్రశ్నించారు. చంద్రబాబు రెండు కళ్లు, రెండు చిప్పల విధానంపై మండిపడ్డారు. సీమాంధ్రలోని 175 అసెంబ్లీ సీట్లలో 140కిపైగా అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వద్దంటేనే మంత్రులు, ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని తెలిపారు.