
సాక్షి, గుంటూరు: జిల్లాలోని చేబ్రోలు మండలం వడ్లమూడి సంగం డైరీలో సోమవారం భారీ దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దుండగులు సంగం డైరీలో చొరబడి బీరువా పగులగొట్టి డబ్బు దోచుకెళ్లారు. ఆఫీస్ రూమ్‌లోని రూ.44 లక్షల సొమ్మును అపహరించుకుపోగా.. అక్కడే ఉన్న మరికొంత నగదును వదిలేసి పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనం జరిగిన విధానం చూస్తే ఇది తెలిసిన వారి పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రంగంలోకి దిగిన క్లూస్‌టీమ్ ఆధారాల కోసం వేలిముద్రలు సేకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment