ఈపీడీసీఎల్‌లో భారీగా బదిలీలు | Huge Transfers as epdcl | Sakshi
Sakshi News home page

ఈపీడీసీఎల్‌లో భారీగా బదిలీలు

Published Sat, May 31 2014 3:21 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

ఈపీడీసీఎల్‌లో భారీగా బదిలీలు - Sakshi

ఈపీడీసీఎల్‌లో భారీగా బదిలీలు

10 మంది డీఈలకు స్థాన చలనం
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈపీడీసీఎల్ బదిలీల పర్వం మొదలయింది. ఏకంగా పది మంది డివిజనల్ ఇంజినీర్ల (డీఈ)లకు బదిలీలు చేస్తూ సీఎండీ ఎం.వి.శేషగిరిబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాలన సౌలభ్యం పేరిట బదిలీలు నిర్వహించినట్టు చెప్తున్నప్పటికీ.. చాలా వరకు సిబ్బందిలో నిర్లిప్తత రాజ్యమేలడం వల్లే మూకుమ్మడి బదిలీలు జరిగినట్టు తెలుస్తోంది. పది రోజుల కిందట గాలీవాన బీభత్సానికి పాడైన విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించడంలో నిర్లిప్తంగా వ్యవహరించిన విజయనగరం సర్కిల్ ఆపరేషన్స్ ఎస్‌ఈ డి.సత్యనారాయణపై ఈ నెల 24న బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే.

 పెద్దగా ప్రజలతో సంబంధాల్లేని రెగ్యులేటరీ అఫైర్స్ జీఎంగా ఈపీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్‌కు తీసుకొచ్చారు. శుక్రవారం జరిగిన బదిలీల్లో కూడా ఎక్కువ మంది అదే కోవకు చెందినవారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్స్ మరమ్మతుల విషయంలో నిర్లిప్తంగా వ్యవహరించి, సంస్థకు నష్టం కలిగించిన వైనంపై సీఎండీ ఆగ్రహం కూడా తాజా బదిలీల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. వచ్చే నెల్లో మరిన్ని బదిలీలు జరిగే అవకాశాలున్నట్టు సమాచారం.

బదిలీ ఉత్తర్వులాధారంగా నిబంధనలన్నీ పూర్తి చేసి తక్షణమే పాత స్థానాలను వీడి, కొత్త స్థానాల్లో చేరాల్సిందిగా సీఎండీ తన ఉత్తర్వుల్లో ఆదేశించారు. బొబ్బిలి డీఈ ఎం.లక్ష్మణరావును కార్పొరేట్ ఆఫీస్ డీఈ టెక్నికల్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో కార్పొరేట్ ఆఫీస్ ప్రాజెక్ట్స్-1 డీఈఈ ఎస్.మసిలామణిని నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement