సాగర తీరంలో భారీ తాబేలు కళేబరం | Huge turtle in the sea off the coast of carcass | Sakshi
Sakshi News home page

సాగర తీరంలో భారీ తాబేలు కళేబరం

Published Mon, Jun 1 2015 4:30 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM

సాగర తీరంలో భారీ తాబేలు కళేబరం

సాగర తీరంలో భారీ తాబేలు కళేబరం

సముద్ర తీరంలో భారీ తాబేలు కళేబరం ఆదివారం కనిపించింది. అతి భారీ సైజులో ఉన్న ఈ తాబేలును చూసి పర్యాటకులు ఆశ్చర్యపోతున్నారు. దీనితో పాటు ఆదివారం ఒక్కరోజే పవిత్ర కృష్ణాసాగరసంగమ ప్రాంతం నుంచి పాలకాయతిప్ప సమీపంలోని సముద్రం వరకు పది తాబేళ్ల కళేబరాలు కనిపించాయి. సముద్రంలో నివసించే ఆలివ్‌రీడ్లీ జాతికి చెందిన తాబేళ్లు ఇటీవల ఎక్కువ సంఖ్యలో మృతిచెంది తీరానికి కొట్టుకొస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇలా నిత్యం తాబేళ్లు మృతిచెంది తీరానికి కొట్టుకు వస్తుండటంపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 - కోడూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement