నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో అవసరం లేకున్నా చేస్తున్న సిజేరియన్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. నిరుపేదలను మరింత పేదరికంలోకి నెట్టుతున్నారు.. ఇది ఏమాత్రం సమాజానికి ఆరోగ్యకరమైన తీరుకాదు... డబ్బే ప్ర ధానం కాదు.. పేరుప్రఖ్యాతులు చాలా ముఖ్యం...చనిపోయినప్పుడు మనం ఏమీ వెంట తీసుకెళ్లం...పవిత్రమైన వైద్యవృత్తిలో కొనసాగుతున్న వారు మానవత్వంతో పనిచేయండి. పేదల జీవితాలతో అడుకోవద్దు.. జిల్లాలో సిజేరియన్‌ల సంఖ్యను గణనీయంగా తగ్గిం చండి.. ఇవి నేరుగా ఎవరిని కించపర్చేందుకు అంటున్న మాటలు కావు. ఆవేదనతో అంటున్న మాటలని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు అన్నారు. గురువారం కలెక్టర్ తన చాంబర్‌లో జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులు, నర్సిం గ్‌హోం నిర్వాహకులు, గైనకాలజిస్టులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిజేరియన్‌లు నిర్వహించడంలో నల్లగొండ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండడం చాలా బాధాకరమన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఏడాదికి కేవలం 29 శాతం కాన్పులు జరుగుతుండగా ప్రైవేటు ఆస్పత్రులలో 69 శాతం జరుగుతున్నాయన్నారు. ఇంటి వద్ద కేవలం 2 శాతం మాత్రమే కాన్పులు జరుగుతున్నాయని తెలిపారు. నల్లగొండ జిల్లాలో 78 శాతం సిజేరియన్‌లు జరిగి రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉంటే అదే వెనుకబడిన జిల్లా అనంతపురంలో కేవలం 21శాతం మాత్రమే జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలో ఇంత ఎక్కువ స్థాయిలో జరగడానికి గల కారణాలను అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు.
అత్యవసర పరిస్థితులలో మాత్రమే అపరేషన్‌లు నిర్వహించాలన్నారు. హైదరాాబాద్‌లోని ఫెర్నాండేజ్ ఆస్పత్రిలో 90 శాతం సాధారణ కాన్పులు జరుగుతుంటే ఇక్కడ ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు. గర్భసంచి ఆపరేషన్లు ఎక్కువగా చేస్తున్నారని దీనిని తగ్గించా లన్నారు. గర్భసంచి తొలగింపుతో మహి ళలు మానసిక అనారోగ్యాలకు గురవు తున్నారని చెప్పారు. ఆశవర్కర్లు, 108 సిబ్బంది కొందరు గర్భిణులను ప్రభు త్వ ఆస్పత్రుల్లో చేర్చకుండా ప్రైవే టు ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారని, ఆ పద్ధతికి ఇక స్వస్తి పలకాలన్నారు.
మాతాశిశు సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని చెప్పారు. జిల్లాలో అడపిల్లల సం ఖ్య గణనీయంగా పడిపోవడం అందోళన కలిగిస్తుందన్నారు. వెయ్యిమంది మగపిల్లలకు 829 మంది మాత్రమే ఆడపిల్లలు ఉన్నారన్నారు. గర్భస ్థ లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధించినందున వైద్యులు కచ్చితంగా పాటించాలన్నా రు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరిజ వహర్‌లాల్, అదనపుజేసీ నీల కంఠం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.ఆమోస్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఏబీ నరేంద్ర, డెమో తిరుపతయ్య, ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్లు పుల్లారావు, సుచరిత, జనార్దన్‌రెడ్డి, వినోద్‌కుమార్, నర్సింగ్‌హోంల నిర్వాహకు లు, గైనకాలజిస్టులు పాల్గొన్నారు.
మానవత్వంతో పనిచేయండి
Published Fri, Jan 24 2014 3:41 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement