T.chirugivellu
-
ఫస్ట్.. సెకండ్
నల్లగొండ, న్యూస్‌లైన్: ‘జిల్లాలో జరిగిన వరుస ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగిశాయి. మున్సిపాలిటీ, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీస్ శాఖ, ఇతర సిబ్బంది విశేష కృషి చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కావడంతో పాటు.. రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రథమ, ద్వితీయ స్థానాలను సాధించింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు సహకరించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు’ అని కలెక్టర్ టి.చిరంజీవులు పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో ఏఎస్పీ రమా రాజేశ్వరితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ 86.34శాతం నమోదై రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల విషయానికొస్తే తెలంగాణలో ఖమ్మం జిల్లా తర్వాత నల్లగొండ 80.56 శాతం నమోదు చేసి రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు. సూర్యాపేట మున్సిపాలిటీలో ఒకటి, రెండు చోట్ల మినహా మరెక్కడా రీపోలింగ్‌కు ఆస్కారం లేకుండా ఎన్నికలు పూర్తికావడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలకోడ్ అమలుచేయడంలో పోలీస్ శాఖ, ఇతర శాఖల అధికారులు నిస్పాక్షిపాతంగా, నిజాయితీగా వ్యవహరించారని చెప్పారు. తెలంగాణ అవతరణ ఉత్సవాలు... తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) సందర్భంగా ‘నల్లగొండ జిల్లా-తెలంగాణ సంబురాలు’ పేరిట ఆరు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నీలగిరి సంబురాలు పేరుతో నిర్వహించాలని భావించినప్పటికీ మేధావులు, కళాకారులు, మీడియా ప్రతినిధుల నుంచి వచ్చిన సలహా, సూచనల ప్రకారం సంబురాల పేరును మార్చినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు, మండల, పట్టణ కేంద్రాల్లో సంబురాలను ఏవిధంగా నిర్వహించాలనే అంశం మీద శనివారం డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరు రోజులపాటు జరుగుతున్న ఈ వేడుకల్లో ప్రధానంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆహ్వానించి ఘనంగా సత్కరిస్తారు. అదే విధంగా జిల్లాలో ప్రఖ్యాతి చెందిన కవులు, కళాకారులు, గాయకులను ప్రత్యేకంగా సత్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. అలాగే నల్లగొండలోని ఎన్జీ కాలేజీ మైదానంలో రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ వంటకాలను రుచి చూపించేందుకు ప్రత్యేకంగా ఫుడ్ ఫెస్టివల్, డ్వాక్రా ఉత్పత్తుల మేళా నిర్వహిస్తామన్నారు. తెలంగాణ జిల్లాలోని వివిధ రంగాల్లో నేపథ్యం ఉన్న కళాకారులను జిల్లాకు ఆహ్వానించి వారిచే తెలంగాణ సంప్రదాయాలు ఇనుమడింపజేసేందుకు నృత్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ వస్త్రధారణ, భారతీయ సంప్రదాయాలను అందరికీ తెలిసే విధంగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ టి.చిరంజీవులు తెలిపారు. నిష్పాక్షికంగా పోలీస్ సేవలు.. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికాకుండా పోలీస్ శాఖ అత్యంత నిష్పాక్షికంగా, పకడ్బందీగా ఎన్నికల విధులు నిర్వహించినట్టు ఏఎస్పీ రమారాజేశ్వరి తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా ఉండేందుకు మహారాష్ట్ర, కేరళ నుంచి ప్రత్యేక పోలీస్ బలగాల సహకారం కూడా తోడైందని ఆమె చెప్పారు. అలాగే సీఆర్పీఎఫ్, ఏపీఎస్పీ, ప్రత్యేక రైల్వే పోలీస్ బలగాలు, ఫోరోనిక్స్ నిపుణులు, విజిలెన్స్ బృందాలు అహర్నిశలు శ్రమించాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో రూ.5.99 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్, ఏజేసీ వెంకట్రావు, జెడ్పీ సీఈవో దామోదర్‌రెడ్డి, డీఎస్పీ రామోహ్మన్‌రావు పాల్గొన్నారు. -
లతీఫుల్లాషా ఖాద్రీ ఉర్సు ప్రారంభం
నల్లగొండ కల్చరల్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంలోని లతీఫుల్లాషాఖాద్రీ ఉర్సు గురువారం ఘనంగా ప్రారంభమయ్యింది. కలెక్టర్ టి.చిరంజీవులు గంధాన్ని మోసుకువచ్చి ఉత్సవాలను ప్రారంభించారు. స్థానిక గడియారం సెంటర్లోని మదీనా మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనల అనంతరం కలెక్టర్ టి.చిరంజీవులు, ఎస్పీ డాక్టర్ టి.ప్రభాకర్‌రావు, ఉర్సు ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు ఎంఏ బేగ్, ముతవల్లి అరీఫుల్లాఖాద్రీలు గంధాన్ని ఎత్తుకుని ఉర్సు ఊరేగింపునకు ప్రారంభించారు. ఉర్సు భారీ ఊరేగింపు గడియారం మీదుగా ఆర్పీ రోడ్డు, వన్ టౌన్ చౌరస్తా, పాతబస్తీ కమాన్ల మీదుగా లతీఫుల్లాషాఖాద్రీ మెట్ల వరకు చేరుకుంది. ఈ సందర్భంగా పకీర్ల విన్యాసం చూపరులను ఆకట్టుకుంది. అనంతరం కలెక్టర్ టి.చిరంజీవులు, ఎస్పీ టి.ప్రభాకర్‌రావు తదితరులు గంధం ఊరేగింపునకు స్వాగతం పలికారు. అనంతరం గంధా న్ని లతీఫుల్లాషాఖాద్రీ దర్గా వరకు తీసుకొని వెళ్లేందుకు ముతవల్లీలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాం మోహన్, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ నాయకులు కంచర్ల భూపాల్‌రెడ్డి, ఫషాహత్ అలీ బాబా, వంగాల అని ల్‌రెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, ఖాజాకుత్బుద్దీన్, హాషం, పులిజాల రాంమోహన్‌రావు, ముతవల్లీలు బషారుతుల్లాఖాద్రీ, జమాలత్ ఉల్లాఖాద్రీ తదితరులు పాల్గొన్నారు. -
తహసీల్దార్లకు పోస్టింగ్‌లు
సాక్షి, నల్లగొండ: ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో బదిలీ అయిన తహసీల్దార్ల స్థానంలో కొత్తవారికి గురువారం పోస్టింగ్‌లు ఖరారు చేశారు. ఈ నెల 11వ తేదీన 48మంది తహసీల్దార్లు బదిలీ అయిన విషయం తెలిసిందే. వాస్తవంగా మరుసటి రోజే కొత్తవారికి పోస్టింగ్‌లు ఖరారు చేయాల్సి ఉంది. అయితే జిల్లాకు మొదటగా 43మంది తహసీల్దార్లనే కేటాయించారు. దీంతో వారికి మండలాలను కేటాయించడంలో ఒకరోజు ఆలస్యమైంది. మిగిలిన ఐదుగురిని కూడా జిల్లాకు అలాట్ చేయడంతో తహసీల్దారులందరికీ పోస్టింగ్‌లు ఇస్తూ కలెక్టర్ టి. చిరంజీవులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్ నుంచి 25 మంది, మెదక్ 9 మంది, నిజామాబాద్ నుంచి ఆరుగురు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున జిల్లాలో పోస్టింగ్‌లు పొందారు. ఇప్పటికే జిల్లాలో పనిచేస్తున్న నలుగురికి ఇతర మండలంలో పోస్టింగ్ ఖరారు. వీరు సొంత జిల్లాకు చెందినవారు కాకపోవడంతో పాటు ఆయా మండలాల్లో తహసీల్దార్లుగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తికాలేదు. వీరికి జిల్లాలోనే ఇతర మండలాల్లో పోస్టింగ్ ఇచ్చారు. -
సమష్టి కృషితో ప్రగతి బాట
సాక్షి, నల్లగొండ : ‘‘ప్రగతి ఏ ఒక్కరితోనూ సాధ్యం కాదు. సమష్టి కృషి అవసరం. స్వాతంత్య్రం సాధించినప్పటి నుంచి పొందిన విజయాలతో సంతృప్తి పడకుండా ప్రతి పేదవాడి కన్నీటిని తుడిపివేయడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది’’ అని కలెక్టర్ టి. చిరంజీవులు పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని పరేడ్ మైదానంలో ఆదివారం కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎస్పీ డాక్టర్ ప్రభాకర్‌రావు, అదనపు ఎస్పీ రామ రాజేశ్వరి ఆధ్వర్యంలో పోలీసులు, ఎన్ఎస్ఎస్ క్యాడెడ్ల నుంచి కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ప్రసంగిస్తూ.... ప్రతి నిరుపేద కన్నీటిని దూరం చేసినప్పుడే అసలైన స్వాతంత్య్రమని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా కృషి చేస్తేనే ఇది సాధ్యమని చెప్పారు. సంకుచితత్వం, స్వార్ధాన్ని వదిలేసి బాధ్యతాయుతమైన పౌరులుగా నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉజ్వల భవిష్యత్ ఎంతో దూరంలో లేదని, అందరూ కష్టపడితే ఇది సాధ్యమని చెప్పారు. ఫలితంగా భారతావనిని ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలపుదామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న పథకాల తీరు, ప్రగతి గురించి వివరించారు. అన్నదాతల అభివృద్ధికి... ‘‘అన్ని రకాలుగా రైతులు అభివృద్ధి చెందడానికి జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఖరీఫ్‌లో రూ.1011.80 కోట్ల పంట రుణాల లక్ష్యానికిగాను... రూ.1129.84 కోట్ల రుణాలు అందజే శాం. ఇదే స్ఫూర్తితో ప్రస్తుత రబీల సీజన్లో అన్నదాతలకు ఉదారం గా రుణాలు అందజేయాలి. వడ్డీలేని రుణాల కింద 2.74 లక్షల మంది రైతులకు రూ.28.15 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశాం. గత అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల రైతులకు నష్టం జరిగిన వివరాలను ప్రభుత్వానికి నివేదిక పంపాం. త్వరలో ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేస్తాం’’ అని చెప్పారు. సాగుకు పెద్దపీట... పులిచింతల ప్రాజెక్టు ప్రారంభించి జిల్లాలో భూగర్భ జలాలు పెరిగి సాగుకు అవకాశం పెరిగిందన్నారు. పులిచింతల ముంపు గ్రామాల బాధితులకు సహాయ, పునరావాస చ ర్యలు యుద్ధప్రాతిపదికన కల్పిస్తున్నామని, కరువు పీడిత ప్రాంతాల్లో 3 లక్షల ఎకరాలకు సాగునీరు, 516 గ్రామాలకు తాగునీరు అందజేసేందుకు ఏఎమ్మార్పీ, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను చేపట్టామని తెలిపారు. ఈ ప్రాజెక్టుల కింద ఇప్పటివరకు రూ.3,774 కోట్లు ఖర్చుచేశామన్నారు. అదేవిధంగా జేబీఐసీ పథకం కింద రూ.39.80 కోట్ల వ్యయంతో డిండి, ఆసిఫ్‌నహర్ ప్రాజెక్టు ఆధునికీకరణ పనుల్లో భాగంగా.. ఇప్పటివరకు రూ.25.21 కోట్ల ఖర్చు చేసినట్టు తెలిపారు. నేతన్నలకు అండదండగా... చేనేతలను ఆదుకునేందుకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. 22 వేల చేనేత కుటుంబాల జీవనోపాధులకు భరోసా కల్పించాల్సిన బాధ్యతతో రూ.3.92 కోట్లతో 1025 మంది చేనేతలకు రుణ కార్డుల ఆధారంగా ఆర్థికంగా తోడ్పాటు అందించినట్టు చెప్పారు. అంతేగాక మరో పదివేల మందికిపైగా వృద్ధాప్య పింఛన్లు, బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. అన్ని రంగాల్లో మహిళలను.. ‘‘మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు బ్యాంకు లింకేజీ ద్వారా విరివిగా రుణ సౌకర్యం కల్పిస్తున్నాం. ఈ ఏడాది 22,503 సంఘాలకుగాను.. రూ.440.82 కోట్ల రుణాల లక్ష్యానికిగాను.. 16,721 సంఘాలకు రూ.354.5 కోట్ల రుణాలు అందజేశాం. బంగారుతల్లి పథకం కింద అర్హులైన 8,355 మంది ఆడ శిశువులను నమోదు చేసి ముందంజలో ఉన్నాం’’ అని వివరించారు. ‘పది’లంగా ఉండేందుకు.. పదో తరగతిలో ఉత్తీర్ణతాశాతం పెంచేందుకు వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. బడిబయట ఉన్న ఐదు నుంచి 14 సంవత్సరాలలోపు మూడు వేల మంది పిల్లలను గుర్తించినట్టు పేర్కొన్నారు. వీరిని వచ్చేనెల 10వ తేదీ వరకు బడిలో చేర్పించేందుకు బృహత్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. తల్లీబిడ్డల సంరక్షణకు.... మాతాశిశు మరణాలు తగ్గించడం, పోషక విలువలు పెంచడం, ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు జరిపే లక్ష్యంతో ఆయా శాఖలను సమన్వయ పరిచి ‘మార్పు’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని వివరించారు. జననీ సురక్ష యోజన, జననీ శిశు సంరక్ష పథకాల ద్వారా ప్రతి తల్లీ శిశువు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు సర్కారు ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. అర్హులందరికీ ఓటు హక్కు.... ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని పిలుపునిచ్చారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని, 74,869 మంది మందికి ఈ ఏడాది నూతనంగా ఓటు హక్కు కల్పించినట్టు తెలిపారు. భావితరాల భవిష్యత్ కోసం... ప్రభుత్వ పథకాల అమలులో అధికారుల జవాబుదారీతనాన్ని పెంపొంది స్తున్నామన్నారు. అలాగే వివిధ సామాజిక వర్గాల ప్రజల భాగస్వామ్యంతో నిరక్షరాస్యత, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పారిశుద్ధ్యం, రక్షిత తాగునీరు, ప్రజారోగ్యం, పౌష్టికాహారం అందజేత, స్త్రీ వివక్ష రూపుమాపడం, బాలికా శిశు సంరక్షణ మొదలైన అంశాలపై ప్రగతి సాధించేం దుకు నిత్యం పాటుపడుతున్నామని వివరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, జేసీ హరి జవహర్లాల్, డీసీసీబీ ఇన్చార్జ్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, డీసీఎంఎస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, స్వాతంత్య్ర సమరయోధుడు నర్రా రాఘవరెడ్డి, జిల్లా అధికారులు జెడ్పీ సీఈఓ వెంకట్రావు, డీఆర్డీఏ, డ్వామా పీడీలు సుధాకర్, కోటేశ్వరరావు, డీఈఓ జగదీష్, మాడా పీఓ సర్వేశ్వర్‌రెడ్డి, బీసీ, ఎస్పీ కార్పొరేషన్ ఈడీలు గంగాధర్, శ్రీధర్, డ్వామా అదనపు పీడీ నర్సింహులు, డీఎంహెచ్ఓ ఆమోస్, డీఆర్ఓ అంజయ్య, ఫైర్ ఆఫీసర్ హరినాథ్‌రెడ్డి పాల్గొన్నారు. -
మానవత్వంతో పనిచేయండి
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో అవసరం లేకున్నా చేస్తున్న సిజేరియన్లు ఆందోళన కలిగిస్తున్నాయి. నిరుపేదలను మరింత పేదరికంలోకి నెట్టుతున్నారు.. ఇది ఏమాత్రం సమాజానికి ఆరోగ్యకరమైన తీరుకాదు... డబ్బే ప్ర ధానం కాదు.. పేరుప్రఖ్యాతులు చాలా ముఖ్యం...చనిపోయినప్పుడు మనం ఏమీ వెంట తీసుకెళ్లం...పవిత్రమైన వైద్యవృత్తిలో కొనసాగుతున్న వారు మానవత్వంతో పనిచేయండి. పేదల జీవితాలతో అడుకోవద్దు.. జిల్లాలో సిజేరియన్ల సంఖ్యను గణనీయంగా తగ్గిం చండి.. ఇవి నేరుగా ఎవరిని కించపర్చేందుకు అంటున్న మాటలు కావు. ఆవేదనతో అంటున్న మాటలని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు అన్నారు. గురువారం కలెక్టర్ తన చాంబర్లో జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులు, నర్సిం గ్‌హోం నిర్వాహకులు, గైనకాలజిస్టులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిజేరియన్లు నిర్వహించడంలో నల్లగొండ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండడం చాలా బాధాకరమన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఏడాదికి కేవలం 29 శాతం కాన్పులు జరుగుతుండగా ప్రైవేటు ఆస్పత్రులలో 69 శాతం జరుగుతున్నాయన్నారు. ఇంటి వద్ద కేవలం 2 శాతం మాత్రమే కాన్పులు జరుగుతున్నాయని తెలిపారు. నల్లగొండ జిల్లాలో 78 శాతం సిజేరియన్లు జరిగి రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉంటే అదే వెనుకబడిన జిల్లా అనంతపురంలో కేవలం 21శాతం మాత్రమే జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలో ఇంత ఎక్కువ స్థాయిలో జరగడానికి గల కారణాలను అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు. అత్యవసర పరిస్థితులలో మాత్రమే అపరేషన్లు నిర్వహించాలన్నారు. హైదరాాబాద్‌లోని ఫెర్నాండేజ్ ఆస్పత్రిలో 90 శాతం సాధారణ కాన్పులు జరుగుతుంటే ఇక్కడ ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు. గర్భసంచి ఆపరేషన్లు ఎక్కువగా చేస్తున్నారని దీనిని తగ్గించా లన్నారు. గర్భసంచి తొలగింపుతో మహి ళలు మానసిక అనారోగ్యాలకు గురవు తున్నారని చెప్పారు. ఆశవర్కర్లు, 108 సిబ్బంది కొందరు గర్భిణులను ప్రభు త్వ ఆస్పత్రుల్లో చేర్చకుండా ప్రైవే టు ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారని, ఆ పద్ధతికి ఇక స్వస్తి పలకాలన్నారు. మాతాశిశు సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని చెప్పారు. జిల్లాలో అడపిల్లల సం ఖ్య గణనీయంగా పడిపోవడం అందోళన కలిగిస్తుందన్నారు. వెయ్యిమంది మగపిల్లలకు 829 మంది మాత్రమే ఆడపిల్లలు ఉన్నారన్నారు. గర్భస ్థ లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధించినందున వైద్యులు కచ్చితంగా పాటించాలన్నా రు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరిజ వహర్‌లాల్, అదనపుజేసీ నీల కంఠం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.ఆమోస్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఏబీ నరేంద్ర, డెమో తిరుపతయ్య, ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్లు పుల్లారావు, సుచరిత, జనార్దన్‌రెడ్డి, వినోద్‌కుమార్, నర్సింగ్‌హోంల నిర్వాహకు లు, గైనకాలజిస్టులు పాల్గొన్నారు. -
ఇసుక నూతన పాలసీని అమలుచేయాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: నూతన ఇసుక పాలసీ విధానాన్ని అధికారులు తప్పక అమలుచేయాలని కలెక్టర్ టి.చిరంజీవులు కోరారు. శనివారం కలెక్టరేట్లో ఆర్డీఓలు, తహసీల్దార్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నూతన ఇసుక పాలసీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులను పూర్తిగా చదివి అవగాహన పొందాలన్నారు. స్థానిక అవసరాలకు సంబంధించి నిబంధనల ప్రకారం.. గృహ నిర్మాణ శాఖ వర్కు ఇన్స్పెక్టర్ ధ్రువీకరణ మేరకు ఒక ఇందిరమ్మ ఇంటికి 6 ట్రాక్టర్ల ఇసుక దశలవారీగా ఇవ్వాలన్నారు. తద్వారా దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి పంచాయతీ కార్యదర్శి అనుమతి మేరకు విడతల వారీగా ఇవ్వాలని, జారీచేసే పర్మిట్లు స్పష్టతతో ఉండాలని ఆదేశించారు. వాహనం నంబరు, సమయం, ప్రదేశం, చేరాల్సిన చోటు సంబంధించి సీనరేజ్ చార్జీలు జిల్లా పరిషత్ సాధారణ నిధులకు చెల్లించిన తర్వాత పంచాయతీ సెక్రటరీ, తహసీల్దారు అనుమతించాలని, వే బిల్లుపై తహసీల్దారు కౌంటరు సైన్ చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పంచాయతీ అధికారి, ఇతర అధికారుల సమక్షంలో ఇసుక నిల్వల గుర్తింపు జరుగుతుందని తెలిపారు. ఇటీవల భారీ వర్షాలు, వరదలకు కొట్టుకువచ్చిన ఇసుకను గుర్తించి పట్టా భూములలో ఇసుక మేట వేస్తే ప్రభుత్వ అనుమతి పొంది డ్వామా పీడీ వేబిల్లు ద్వారా మాత్రమే తరలించేందుకుు అవకాశం ఉందని పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్, డీఆర్ఓ అంజయ్య, డ్వామా పీడీ కోటేశ్వర్రావు, ప్రభుత్వ ప్లీడర్ వేణుగోపాల్‌రెడ్డి, ఆర్డీఓలు భాస్కర్‌రావు, జహీర్, శ్రీనివాస్‌రెడ్డి, రవినాయక్, తహసీల్దార్లు పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది పర్యావరణాన్ని పరిరక్షించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పారిశ్రామికవేత్తలపై ఉందని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు అన్నారు. జిల్లాలోని ఫార్మా కెమికల్ పరిశ్రమదారులతో శనివారం కలెక్టర్ తన చాంబర్లో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమదారులు వ్యర్థపదార్థాలను ఇరిగేషన్ కాలువలు, రోడ్ల వెంట డంపింగ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విధానాన్ని ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసినట్లు భావించి క్రిమినల్ చర్యలకు బాధ్యులు అవుతారని తెలిపారు. అధికారులతో టీమ్‌లను ఏర్పాటు చేసి పరిశ్రమలన్నింటినీ తనిఖీ చేసి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బూత్ లెవల్ ఆఫీసర్ విధుల నుంచి తొలగింపు కోదాడ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో మైనర్లకు చోటు కల్పించినందున సంబంధిత పోలింగ్ కేంద్ర పరిధిలోని బూత్ లెవల్ ఆఫీసర్‌ను విధుల నుంచి తొలగించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత పంచాయతీ సెక్రటరీ, ఏఈఆర్ఓకు చార్జెస్ ప్రేమ్ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినట్టు పేర్కొన్నారు. బాధ్యులపై విచారణ జరిపి వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. -
కుల వివక్షపై పోరాడిన మహనీయుడు పూలే
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్: కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిబాపూలే అని కలెక్టర్ టి.చిరంజీవులు కొనియడారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక క్లాక్‌టవర్ సెంటర్లో జరిగిన పూలే వర్థంతి సభలో ఆయన మాట్లాడారు. విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని, మహిళా అక్షరాస్యత అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పోరాడాడన్నారు. అందరూ అక్షరాస్యులు అయితేనే పూలే ఆశయాలను సాధించినట్టవుతుందన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. బీసీల్లో 144 కులాలున్నాయన్నారు. ఐకమత్యంతో ఏదైనా సాధించవచ్చునన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ నిరక్షరాస్యత నిర్మూలన, నిర్బంధ విద్య కోసం పూలే ఎంతో కృషి చేశారన్నారు. విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని.. పూలే ఆశయాలను నెరవేర్చాలన్నారు. కేంద్రం విద్యాభివృద్ధికి రూ.50 వేల కోట్లు యేటా ఖర్చు చేస్తుందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పూల రవీందర్, ఏజేసీ నీలకంఠం, డీఈఓ జగదీష్, బీసీ సంక్షేమ శాఖ ఈడీ గంగాధర్, డీడీ రాజశేఖర్, ఆర్డీఓ జహీర్, పుల్లెంల వెంకటనారాయణగౌడ్, సుంకరి మల్లేష్‌గౌడ్, వీరెల్లి చంద్రశేఖర్, చక్రహరి రామరాజు, కొండేటి మల్లయ్య, పంకజ్‌యాదవ్, ఎస్.మల్లయ్య, పర్వతాలు, బొర్ర సుధాకర్, జి.వెంకన్న, డి.లక్ష్మీనారాయణ, వెంకటపతి, అంబటి వెంకన్న, మాసారం సిద్ధార్థ పూలే తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువుల వివరాలు నోటీసు బోర్డులో ఉంచాలి కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో సబ్సిడీని భరిస్తూ ప్రజలకు నిత్యావసర వస్తువులు సరఫరా చేసేందుకు కృషి చేస్తుందని.. పంచాయతీ కార్యాలయంలోని నోటీస్ బోర్డుపై వాటి వివరాలు ఉంచాలని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు తెలిపారు. గురువారం జేసీ ఛాంబర్లో పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్లు, కిరోసిన్ డీలర్లతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో ఉన్న రేషన్‌షాపుల వివరాలు.. అందులో వచ్చే సరుకుల వివరాలు గ్రామ ప్రజలకు తెలిసేలా చూడాలని కోరారు. కిరోసిన్ సక్రమంగా ప్రజలకు అందేలా చూడాలని తెలిపారు. అమ్మహస్తం కార్యక్రమం ద్వారా 9 రకాల నిత్యావసర వస్తువులను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్నప్పుడు వాటిని డీలర్లు డీడీలు చెల్లించడంలో అలసత్వం వహిస్తున్నారని, 3 నెలల వరకు డీడీలు చెల్లించని వారికీ నోటీసులు జారీ చేయాలని పౌర సరఫరాల అధికారిని ఆదేశించారు. అనంతరం ఎల్పీజీ, సీడింగ్, దీపం పథకం గ్రౌండింగ్, రేషన్‌కార్డుల సీడింగ్, కొత్త కార్డుల పంపిణీ, సేల్ ప్రొసీడ్స్పై జేసీ హరిజవహర్‌లాల్ సమీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఎల్పీజీ గ్యాస్ సీడింగ్‌లో ఆధార్‌నమోదు అనుకున్నంత రీతిలో జరగడం లేదని, దానిని ఏజెన్సీల వారు బాధ్యతగా తీసుకుని నమోదు చేయించాలని తెలిపారు. సమావేశంలో డీఎస్ఓ నాగేశ్వరరావు, ఎఎస్‌ఓ వెంకటేశ్వర్లు, కిరోసిన్ డీలర్లు, ఆధార్ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ ప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్లు పాల్గొన్నారు. -
ప్రజల కోసమే సత్యాగ్రహం
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వ భూములను పరిరక్షించాలని గ్రామ రెవెన్యూ అధికారులకు (వీఆర్ఓ) ఇజ ల్లా కలెక్టర్ టి.చిరంజీవులు పిలుపునిచ్చారు. అన్యాక్రాంతమైన చెరువులు, కుంటలను గుర్తించాలన్నారు. కలెక్టరేట్లోని ఉదయాధిత్య భ వన్‌లో ఐదు డివిజన్లకు చెందిన వీఆర్ఓలకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజ కీయ ఒత్తిడులున్నాయని ఆక్రమణలను విస్మరిస్తే ఎంతమాత్ర ఉపేక్షించబోమన్నారు. చెరువులు, ఆక్రమించి భవనాలు నిర్మిస్తుంటే చూసీ చూడనట్లు ఎలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిం చారు. వీఆర్ఓలు గ్రామస్థాయి ప్రభుత్వ అధికారి అన్న విషయం మరువరాదన్నారు. అక్రమాలకు పాల్పడితే వేటు తప్పదన్నారు. అక్ర మ ఇసుక రవాణా జరుగుతుంటే చోద్యం చూడటం సరికాదని, తహసీల్దార్, పోలీసుల దృష్టికి తెచ్చి అడ్డుకోవాలని కలెక్టర్ ఆదేశించా రు. వీఆర్‌ఓలందరూ పేదలతో అనునిత్యం మమేకమై వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. గత మూడు వారాలుగా ప్రజావాణి కార్యక్రమంలో 40శాతం సమస్యలు గ్రామస్థాయి నుంచే వస్తున్నాయన్నారు. వీఆర్వోలు పరిష్కరించాల్సినవి కూడా జిల్లా స్థాయికి రావ డం పట్ల కలెక్టర్ వారి పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు సానుకూల వాతావరణం కొరవడిందని అన్నారు. గ్రామస్థాయిలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత కూడా వీఆర్ఓలపై ఉందన్నారు. కొన్ని విషయాలు మీడియా ద్వారా తెలుసుకోవాల్సి వస్తుందని, వీఆర్ఓల నుంచి సంఘటనలు జరిగిన వెంటనే సమాచారం అందడం లేదన్నారు. తద్వారా రెవెన్యూ వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ సదస్సులో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్, అదనపు జేసీ నీల కంఠం, ఇన్చార్జ్ డీఆర్వో అంజయ్య తదిత రులు పాల్గొన్నారు.