కలెక్టరేట్, న్యూస్‌లైన్: నూతన ఇసుక పాలసీ విధానాన్ని అధికారులు తప్పక అమలుచేయాలని కలెక్టర్ టి.చిరంజీవులు కోరారు. శనివారం కలెక్టరేట్‌లో ఆర్‌డీఓలు, తహసీల్దార్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నూతన ఇసుక పాలసీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులను పూర్తిగా చదివి అవగాహన పొందాలన్నారు. స్థానిక అవసరాలకు సంబంధించి నిబంధనల ప్రకారం.. గృహ నిర్మాణ శాఖ వర్కు ఇన్‌స్పెక్టర్ ధ్రువీకరణ మేరకు ఒక ఇందిరమ్మ ఇంటికి 6 ట్రాక్టర్ల ఇసుక దశలవారీగా ఇవ్వాలన్నారు. తద్వారా దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి పంచాయతీ కార్యదర్శి అనుమతి మేరకు విడతల వారీగా ఇవ్వాలని, జారీచేసే పర్మిట్లు స్పష్టతతో ఉండాలని ఆదేశించారు.
వాహనం నంబరు, సమయం, ప్రదేశం, చేరాల్సిన చోటు సంబంధించి సీనరేజ్ చార్జీలు జిల్లా పరిషత్ సాధారణ నిధులకు చెల్లించిన తర్వాత పంచాయతీ సెక్రటరీ, తహసీల్దారు అనుమతించాలని, వే బిల్లుపై తహసీల్దారు కౌంటరు సైన్ చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పంచాయతీ అధికారి, ఇతర అధికారుల సమక్షంలో ఇసుక నిల్వల గుర్తింపు జరుగుతుందని తెలిపారు.
ఇటీవల భారీ వర్షాలు, వరదలకు కొట్టుకువచ్చిన ఇసుకను గుర్తించి పట్టా భూములలో ఇసుక మేట వేస్తే ప్రభుత్వ అనుమతి పొంది డ్వామా పీడీ వేబిల్లు ద్వారా మాత్రమే తరలించేందుకుు అవకాశం ఉందని పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్, డీఆర్‌ఓ అంజయ్య, డ్వామా పీడీ కోటేశ్వర్‌రావు, ప్రభుత్వ ప్లీడర్ వేణుగోపాల్‌రెడ్డి, ఆర్‌డీఓలు భాస్కర్‌రావు, జహీర్, శ్రీనివాస్‌రెడ్డి, రవినాయక్, తహసీల్దార్లు పాల్గొన్నారు.
పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది
పర్యావరణాన్ని పరిరక్షించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పారిశ్రామికవేత్తలపై ఉందని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు అన్నారు. జిల్లాలోని ఫార్మా కెమికల్ పరిశ్రమదారులతో శనివారం కలెక్టర్ తన చాంబర్‌లో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమదారులు వ్యర్థపదార్థాలను ఇరిగేషన్ కాలువలు, రోడ్ల వెంట డంపింగ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విధానాన్ని ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసినట్లు భావించి క్రిమినల్ చర్యలకు బాధ్యులు అవుతారని తెలిపారు. అధికారులతో టీమ్‌లను ఏర్పాటు చేసి పరిశ్రమలన్నింటినీ తనిఖీ చేసి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
బూత్ లెవల్ ఆఫీసర్ విధుల నుంచి తొలగింపు
కోదాడ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో మైనర్లకు చోటు కల్పించినందున సంబంధిత పోలింగ్ కేంద్ర పరిధిలోని బూత్ లెవల్ ఆఫీసర్‌ను విధుల నుంచి తొలగించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత పంచాయతీ సెక్రటరీ, ఏఈఆర్‌ఓకు చార్జెస్ ప్రేమ్ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినట్టు పేర్కొన్నారు. బాధ్యులపై విచారణ జరిపి వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
ఇసుక నూతన పాలసీని అమలుచేయాలి
Published Sun, Dec 22 2013 5:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM
Advertisement
Advertisement