సర్కారు మాటలు గాలిమూటలవుతున్నాయి. లక్షల్లో నజరానాలంటూ ఊకదంపుడు ప్రకటనలు చేసి వాటిని మంజూరు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోంది. ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు రూ.7 లక్షలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు రూ.2 లక్షలంటూ ఆశ చూపి మరిచిపోయింది.
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సర్కారు మాటలు గాలిమూటలవుతున్నాయి. లక్షల్లో నజరానాలంటూ ఊకదంపుడు ప్రకటనలు చేసి వాటిని మంజూరు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోంది. ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు రూ.7 లక్షలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు రూ.2 లక్షలంటూ ఆశ చూపి మరిచిపోయింది. ‘ఏకగ్రీ వంగా ఎన్నుకోండి ... మేమిచ్చే నిధులతో అభివృద్ధి చేసుకోండి’ అంటూ ఇచ్చిన హామీ ఫక్తు రాజకీయ హామీ ని మరిపిస్తోంది.
పాలకవర్గాలు ఏకగ్రీవంగా ఎన్నికైతే గ్రామాల్లో ఐకమత్యం పెంపొందడమే కాకుండా ఎన్నికలు ప్రశాంతమవుతాయని భావించి ప్రభుత్వం ఏకగ్రీవాలను ప్రోత్సహించింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు రూ.2 లక్ష లు ప్రకటిస్తూఅప్పటి సహకారశాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి కృష్ణారావు గతేడాది జనవరి8న ఉత్తర్వులు జారీ చేశారు.జిల్లాలో 134 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలుం డగా వీటికి జనవరి 29, ఫిబ్రవరి 4(2013) లో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి.
జిల్లావ్యాప్తంగా 13 పీఏసీఎస్‌ల పాలకవర్గా లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 10 నెలలు దాటినా ప్రభుత్వం ప్రకటించిన నగదు ప్రో త్సాహం ఇవ్వడం లేదు. జిల్లాలోని గంగాధర మండలం కురిక్యాల, మల్యాల మండలం ముత్యంపేట, మేడిపల్లి మండలం పోరుమ ల్ల, కథలాపూర్ మండలం సిరికొండ, కోరుట్ల మండలం పైడిమడుగు, మల్లాపూర్ మండ లం సిర్‌పూర్, వీణవంక మండలం నర్సింగాపూర్, కోరుట్ల మండలం భూపతిపూర్, కొడిమ్యాల మండలం తిరుమలాపూర్, వెల్గటూర్ మండలం ఎండపల్లి, ధర్మారం, జమ్మికుంట మండలం బోగరపాడు సంఘాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.
ఏకగ్రీవమని మురవడమే...
జిల్లావ్యాప్తంగా 1207 గ్రామపంచాయతీలకు గాను 42 పంచాయతీలు ఏకగ్రీవమయ్యా యి. జూలైలో మూడు విడతలుగా నిర్వహిం చారు. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షలు గా ఉన్న నజరానాను రూ.7 లక్షలకు పెంచా రు. 42 పంచాయతీలకు రూ.2కోట్ల 94 లక్ష లు రావాల్సి ఉన్నా ఇప్పటికీ అందలేదు. నిధులు వస్తే అభివృద్ధి పనులు చేపట్టాలని భావిస్తున్న సర్పంచులంతా నిరాశలో కూరుకుపోయారు. ఆయా గ్రామాల్లో పంచాయతీ ల ప్రతినిధులు, సంఘాల పాలకవర్గం ఈ నిధుల ఆశతో సర్కారు కరుణ కోసం ఎదురుచూస్తూనే వున్నారు. ఈ పారితోషికంతో చేపట్టాల్సిన పనులు జరగక అభివృద్ధి కుంటుపడుతోంది. ఈ విషయమై డీపీవో కుమారస్వా మి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నిధులు విడుదల కావాల్సి ఉందన్నారు.సహకారశాఖ అధికారులు సైతం అదేమాట చెబుతున్నారు.