నెల్లూరు: కట్టుకున్న భార్యనే చంపేందుకు ప్రయత్నంచాడు ఓ భర్త. ఈ సంఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఆదివారం వెలుగుచూసింది. వివరాలు.. గ్రామంలోని శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి తన మాజీ భార్యను చంపేందుకు ఆమె ఇంటి చుట్టూ పెట్రోల్ పోసి, బాంబులు పెట్టాడు. గమనించిన భార్య.. స్థానికులతో కలిసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంటి చుట్టూ ఉన్న బాంబులు, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.