buchireddypalem
-
నగర పంచాయతీల ఎన్నికల నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా గురజాల, దాచేపల్లి నగర పంచాయతీలతో పాటు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికలు ఆపడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన అప్పీళ్లను కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాలను వీలైనంత త్వరగా విచారణ జరపాలని సింగిల్ జడ్జిని ధర్మాసనం కోరింది. గుంటూరు జిల్లా గురజాల, జంగమేశ్వరపురం గ్రామ పంచాయతీలను విలీనం చేసి గురజాల నగర పంచాయతీగాను.. దాచేపల్లి, నడికుడి గ్రామ పంచాయతీలను విలీనం చేసి దాచేపల్లి నగర పంచాయతీగాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. అలాగే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సమీప గ్రామాలను విలీనం చేసి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఏర్పాటు చేస్తూ మరో జీవో ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటికి ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఎన్నికలను నిలువరించేందుకు నిరాకరించగా.. ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వడం సాధ్యం కాదన్న ధర్మాసనం అప్పీళ్లను కొట్టేసింది. -
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం, 8 మంది మృతి
-
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం, 8 మంది మృతి
సాక్షి, నెల్లూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు జాతీయరహరదారిపై ఆదివారం ఉదయం ఆగిఉన్న ఓ లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. టెంపోలో ఉన్న ఇద్దరు చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరణించినవారు తమిళనాడు వాసులుగా పోలీసులు గుర్తించారు. శ్రీశైలం యాత్ర ముగించుకుని నెల్లూరు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో టెంపోలో మొత్తం 15 మంది ప్రయాణం చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: మహిళ గొంతుకోసిన కానిస్టేబుల్ -
దేవుని భూములనూ వదల్లేదు
సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం (నెల్లూరు): బుచ్చిరెడ్డిపాళెం మండలం కావేటిపాళెంలో సుమారు 530 ఎకరాల దేవదాయ ధర్మాదాయ శాఖ భూములున్నాయి. వీటిని సెక్షన్ 22ఏ కింద నిషేధిత భూములుగా ఆ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రకటించారు. రిజిస్ట్రేషన్ శాఖ గెజిట్ పబ్లికేషన్‌లో నిషేధిత భూములుగా ఇచ్చి ఉన్నారు. వీటిని మళ్లీ రివైజ్డ్ చేసి కూడా 2018 జూన్ 2వ తేదీన నిషేధిత జాబితాలో చూపించారు. బుచ్చిరెడ్డిపాళెంలోని కోదండరామస్వామి దేవస్థానానికి ఇనాంగా వచ్చినట్లు, ఆలయానికి చెందినదిగా ట్రిబ్యునల్‌లో కేసు సైతం వేశారు. నిషేధిత భూములకు అడంగల్, 1బీ నిషేధిత భూములకు గతంలో తహసీల్దార్‌గా ఉన్న రామలింగేశ్వరరావు, ఆర్ఐ, వీఆర్వో కృష్ణప్రసాద్ టీడీపీ నేతలతో కుమ్మక్కై ప్రస్తుతం భూములను సాగుచేస్తున్న వారి పేర్లను అడంగల్, 1బీలో నమోదు చేశారు. కేసులతో పాటు నిషేధిత జాబితాలో ఉందని తెలిసినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి మరీ భూములకు సంబంధించి అడంగల్, 1బీలో పేర్లు నమోదు చేశారు. రెవెన్యూ శాఖకు సంబంధం లేని ఈ భూములను దేవదాయ ధర్మాదాయ శాఖ అనుమతి లేకుండాను తమ ఇష్టానుసారంగా మ్యుటేషన్ చేసి హక్కులు కల్పించారు. కేవలం అగ్రిమెంట్స్‌పై అడంగల్‌తో పాటు 145 ఖాతాల నంబర్లను క్రియేట్ చేసిన ఘనత ఈ అధికారులదే. ఏకంగా 300 ఎకరాల నిషేధిత భూములను పట్టాలుగా మార్చేశారు. రూ.60 లక్షలకు పైగా స్వాహా నిషేధిత భూములను సాగుచేసుకుంటున్న వారి నుంచి పంచేడుకు చెందిన టీడీపీ నేతలు 60 లక్షలకు పైగా వసూలు చేశారని ఆరోపణలున్నాయి. వీటిలో తహసీల్దార్ రామలింగేశ్వరరావుతో పాటు ఆర్ఐ, వీఆర్వోకు ముట్టజెప్పినట్లు సమాచారం. మిగతా ఆయా నేతలు స్వాహా చేశారని అంటున్నారు. గత కలెక్టర్ ముత్యాలరాజు సీరియస్ కావేటిపాళెంలో రెవెన్యూ అధికారులు దందా విషయంపై గత కలెక్టర్ ముత్యాలరాజుకు పలువురు రైతులు సమాచారం ఇచ్చారు. తహసీల్దార్ రామలింగేశ్వరరావు చేసిన దందాపై వివరాలు తెలిపారు. దీంతో ముత్యాలరాజు సీరియస్ అయ్యారు. దీంతో పాటు పలు నిషేధిత భూములకు పట్టాలు మంజూరుచేయాలన్న తహసీల్దార్ ప్రతిపాదనలపై మండిపడినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఎన్నికల ముందు ఇప్పుడు విధుల్లో ఉన్న తహసీల్దార్ల సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఆరోపణలున్నా.. మళ్లీ బుచ్చిరెడ్డిపాళేనికి కావేటిపాళెంలో జరిగిన దందా జిల్లా మొత్తం హాట్‌టాపిక్‌గా మారిన రామలింగేశ్వరరావును మిగిలిన వారి పేర్ల నమోదుకు సంబంధించి పలువురు టీడీపీ నేతలు మళ్లీ బుచ్చిరెడ్డిపాళేనికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మండలంలో పలు భూములకు సంబంధించి నాయకుల పేర్లు నమోదు చేసేందుకు సమయం లేకుండా పోయింది. అందుకోసం ఇతరులను పురమాయించామని, దాదాపు ఖరారయిందని టీడీపీ నేతలు చెప్పడం విశేషం. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబుతున్న నేపథ్యంలో ఇటువంటి అవినీతి అధికారులపై ప్రస్తుత కలెక్టర్ శేషగిరి బాబు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి పేదలకు ఇచ్చేందుకు సెంటు భూమి లేదని చెబుతున్న రెవెన్యూ అధికారులు నిషేధిత భూములకు లంచాలు తీసుకుని పలువురి పేర్లను రికార్డులో నమోదు చేయడం దారుణం. ఓ వైపు రిజిస్ట్రేషన్ శాఖ గెజిట్ పబ్లికేషన్ విడుదల చేసి ఉన్నప్పటికీ, సంబంధం లేని రెవెన్యూ అధికారులు ఆయా భూముల్లో పలువురి పేర్లను పట్టాదారులుగా అడంగల్, 1బీలో నమోదు చేయడం దారుణం. దీనికి కారకులైన అప్పటి తహసీల్దార్ రామలింగేశ్వరరావు, ఆర్ఐ, వీఆర్వోపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. – పచ్చా మధుసూదన్‌రావు, దళిత హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావేటిపాళెం భూముల విషయం నా దృష్టికి రాలేదు కావేటిపాళెంలోని నిషేధిత భూములకు పట్టాదారులుగా పలువురి పేర్లు చేర్చిన విషయం నా దృష్టికి రాలేదు. నిషేధిత భూములకు అడంగల్, 1బీ ఇచ్చే హక్కు లేదు. దీనిపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటాం. – చిన్నికృష్ణ, ఆర్డీఓ, నెల్లూరు -
మనుమరాలిపై కిరాతకం
బుచ్చిరెడ్డిపాళెం: బుసలుకొట్టిన కామం.. ఆ వృద్ధుడిని మానవ మృగంగా మార్చింది. వావివరసలు మరిచి వికృతంగా ప్రవర్తించేలా చేసింది. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన 16 ఏళ్ల మనుమరాలి (కూతురు బిడ్డ)పై ఆ వృద్ధుడు కన్నేశాడు... ఒంటరిగా ఉండడంతో అత్యాచారానికి యత్నించాడు... ఊహించని పరిణామంతో షాక్ తిన్న ఆ బాలిక ప్రతిఘటించింది. దీంతో అత్యంత హేయంగా మెడవిరిచేశాడు... అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలికపై క్రూరంగా అత్యాచారం చేసి, చంపేశాడు.. సభ్యసమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. ఐదు రోజుల కిందట దగదర్తి మండలం సున్నపుబట్టి గిరిజన కాలనీ పాతూరులో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వివరాలను బుచ్చిరెడ్డిపాళెం సీఐ బి.సురేష్‌బాబు బుధవారం వెల్లడించారు. సున్నపుబట్టి గిరిజన కాలనీ పాతూరులో కలగందల పోలయ్య, మంగమ్మ దంపతులు నివాసముంటున్నారు. పోలయ్య నెల్లూరులో కూలీ పనులకు వెళ్లి వస్తుంటాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తెకు వివాహం కాగా మరో పదహారేళ్ల కుమార్తెకూ పెళ్లి చేయాలని పోలయ్య ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈ వివాహం భార్య, కుమార్తెకు ఇష్టం లేదు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య కొద్ది రోజులుగా వివాదం జరుగుతోంది. ఈ క్రమంలో మే 30వ తేదీన పోలయ్య నెల్లూరు నుంచి తన భార్యకు ఫోన్‌చేసి పెళ్లి విషయమై వాదులాటకు దిగాడు. దీనికి మంగమ్మ నిరాకరించడంతో అయితే నువ్వు చచ్చిపో అంటూ పోలయ్య భార్యను తిట్టాడు. దీంతో మంగమ్మ ఆవేశంతో చనిపోతానంటూ బయటకు వెళ్లిపోయింది. వీరు ఉంటున్న ఇంటికి సమీపంలోనే మంగమ్మ తల్లిదండ్రులు ఉప్పు వెంకటేశ్వర్లు, రమణమ్మ నివాసముంటున్నారు. కూతురు ఆవేశంగా బయటకు వెళ్లిపోవడంతో రమణమ్మ వెతుక్కుంటూ వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో పదహారేళ్ల బాలిక మాత్రమే ఉంది. అయితే రమణమ్మ తన కుమార్తె మంగమ్మను తీసుకుని తిరిగి ఇంటికి వచ్చి చూసే సరికి బాలిక విగతజీవిగా పడి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేయగా.. పెళ్లి విషయంలో బాలిక మనస్తాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని, తన తండ్రి చూసి చున్నీ కట్ చేసి మృతదేహాన్ని కిందికి దించాడని మంగమ్మ పోలీసులకు తెలిపింది. అయితే మృతురాలి మెడకు ఉరేసుకున్న గుర్తులు లేవు. మృతురాలి తాత, అమ్మమ్మ మాటలకు పొంతన లేదు. అంతా అనుమానాస్పందగా ఉండడంతో పోలీసులు కుటుంబీకులపై అనుమానం పడ్డారు. అదే సమయంలో వెంకటేశ్వర్లు అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఎంతో కాలంగా తన మనమరాలిపై కన్నేశాడని, ఒంటరిగా ఉండడంతో అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడన్నారు. నిరాకరించే సరికి మెడను మెలి తిప్పి విరిచేశాడని పోలీసులు తెలిపారు. అపసార్మకస్థితిలోకి జారుకుంటుండగా అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఉరేసి ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు. ఈ మేరకు వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేశామన్నారు. నిందితుడుని కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు సీఐ తెలిపారు. -
బుచ్చిరెడ్డిపాలెంలో ఓటర్లకు టీడీపీ ప్రలోభాలు
-
ఇద్దరు పిల్లల్ని బావిలోకి తోసేసి..
బుచ్చిరెడ్డి పాలెం: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పార్వతి అనే మహిళ తన ఇద్దరు పిల్లల్ని బావిలోకి తోసేసి ఆ తర్వాత తానూ దూకింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందగా..స్థానికులు గమనించి పార్వతిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పార్వతి ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. కుటుంబకలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారు
బుచ్చిరెడ్డిపాళెం: తనను తల్లి, మేనమామలు వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారని, తట్టుకోలేక బంధువుల ఇంటికి వచ్చానని నందా గౌతమి(26) అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట ఆమె విలేకరులతో మాట్లాడారు. తనకు మేనమామ మూర్తి(36)తో వివాహమైందని, తన తల్లి ఈశ్వరమ్మ తనను వ్యభిచారం చేయాలని బలవంతం చేస్తోందని వాపోయింది. దీంతో బుచ్చిరెడ్డిపాళెంలో మామ వరుసైన పరంధామయ్య ఇంటికి వచ్చానన్నారు. అయితే తన తల్లి, మేనమామతోపాటు మరికొందరు మూడు రోజుల క్రితం బుచ్చిరెడ్డిపాళెంలోని మామ ఇంటికి వచ్చారని, అక్కడ మాటల నేపథ్యంలో తోపులాట జరిగిందని, అక్కడి నుంచి వెళ్లి దాడి చేసినట్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని గౌతమి వాపోయింది. తనకు న్యాయం చేయాలని కోరింది. కేసు నమోదు తన కుమార్తెను తీసుకెళ్లేందుకు వచ్చిన తనతోపాటు మరికొందరిపై పరంధామయ్య మరికొందరు దాడి చేసి గాయపరిచారని ఈశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఎస్సై ప్రసాద్‌రెడ్డిని సంప్రదించగా గాయపడిన బాధితులు ఆస్పత్రిలో చేరారని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. అనంతరం గౌతమి ఫిర్యాదు చేసిందన్నారు. దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
వసూల్ రాజా
బుచ్చిరెడ్డిపాళెం: బుచ్చిరెడ్డిపాళెం ఎస్సై పేరం నాగశివారెడ్డి అవినీతికి కేరాఫ్‌గా నిలిచాడు. గతేడాది మే 19న బాధ్యతలు స్వీకరించాడు. ప్రకాశం జిల్లాలో పనిచేసిన ఈయన నెల్లూరు జిల్లాలో తొలిపోస్టింగ్ బుచ్చిరెడ్డిపాళెంలోనే. నెల రోజులపాటు ట్రాఫిక్, శాంతిభద్రతలపై దృష్టి సారించిన ఎస్సై అనంతరం దృష్టి మరల్చాడు. సీఐ సుబ్బారావుతో కలిసి పలు విషయాల్లో మామూళ్లకు పాల్పడ్డాడు. మామూళ్లే లక్ష్యంగా పనిచేయడం ప్రారంభించాడు. అతని అవినీతి పర్వం ఎస్పీ రామకృష్ణ దృష్టికి వెళ్లడంతో వీఆర్‌కు వెళ్లాడు. మామూళ్లు ఇస్తే సరి.. లేకుంటే గురి స్టేషన్‌కు వచ్చే ప్రతి విషయాన్ని ఎస్సై తన వ్యాపారాలకు అనుగుణంగా మలుచుకున్నాడు. అందుకు స్టేషన్లో ఒక కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. తొలుత ఎస్సై బాధితులను బెదిరించేవాడు. తరువాత కానిస్టేబుల్‌ను పంపి వ్యాపారాన్ని పక్కాగా చక్కబెట్టేవాడు. కానిస్టేబుల్‌కు నోట్లు అందిన వెంటనే ఎంతటి కేసైనా చిటెకెలో పరిష్కారమయ్యేది. ఒకవేళ ఎవరైనా ఇవ్వనంటే వారికి నరకం చూపేవాడు. వారినే లక్ష్యం చేసుకుని ప్రతి విషయంలోను ఇబ్బంది పెట్టేవాడు. మామూళ్ల పర్వం ఇలా.. ఎస్సై నాగశివారెడ్డి మామూళ్ల పర్వంలో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని.. ⇔ మండలంలోని రామచంద్రాపురానికి చెందిన ఓ గిరిజన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన ఓ కామాంధుడు అత్యాచారం చేసి వదిలేశాడు. సదరు బాలిక కుటుంబసభ్యులు నాగశివారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అత్యాచారం చేసిన వ్యక్తి నుంచి మామూళ్లు తీసుకుని కేసు లేకుండా చేశాడు. ⇔ సెల్ఫోన్ల దొంగతనం విషయంలో దొంగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖాజానగర్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.15 వేలు లంచం తీసుకున్నాడు. ఇదే కేసులో మహిళల నుంచి రూ.7 వేల నగదు లంచంగా కానిస్టేబుల్ ద్వారా తీసుకున్నాడు. ⇔ లారీని పట్టుకున్న కేసులో తొలుత కేసు నమోదు చేయకుండా రూ.15 వేలు లంచం తీసుకున్నాడు. తరువాత సీఐ వద్దకు పంపాడు. సీఐకు లంచం అందేలా చేశాడు. అంతటితో ఆగక డీఎస్పీ వద్దకు వెళ్లమన్నాడు. దీంతో విరక్తి చెందిన లారీ యజమాని కేసు నమోదు చేయండి.. కోర్టులో విడిపించుకుంటాం అని చెప్పడంతో కేసు నమోదు చేశారు. ⇔ మండలంలోని కాగులపాడుకు చెందిన ఓ వివాహిత 20 ఏళ్ల యువకుడిని పెళ్లి చేసుకున్న విషయంలో వివాహిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకుడిని ఎస్సై నాగశివారెడ్డి బెదిరించాడు. కేసు నమోదు చేయకుండా ఉండేందుకు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని బ్రోకర్‌గా పెట్టుకుని రూ.40 వేలు లంచం తీసుకున్నాడు. ⇔ అప్పుగా తీసుకున్న వ్యక్తి నుంచి నగదు వసూలు చేసేందుకు లంచం తీసుకున్న నాగశివారెడ్డి సదరు వ్యక్తి ద్విచక్రవాహనాన్ని అప్పుకు జమచేసేలా చేశాడు. ⇔ ముంబయి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదానికి కారకుడైన డ్రైవర్‌కు లైసెన్స్ లేకపోవడంతో మరొకరి పేరు చేర్చి మామూళ్లకు పాల్పడ్డాడు. నెలసరి మామూళ్లిలా.. ⇔ మండలంలోని విలియమ్స్‌పేట, రామచంద్రాపురంలో జరుగుతున్న గ్రావెల్ రవాణాకు సంబంధించి ప్రతి నెలా మామూళ్లు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ⇔ ఒక్కో మద్యం దుకాణం నుంచి నెలకు రూ.5 వేలు ప్రతినెలా లంచం తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ⇔ ఇసుక, మట్టి తదితర అక్రమ రవాణాల నుంచి మామూళ్లు అందుతున్నట్లు ఫిర్యాదులు లేకపోలేదు. నకిలీ విలేకరులను మధ్యస్తంగా.. నకిలీ విలేకరులను మధ్యస్తంగా పెట్టుకుని ఎస్సై నాగశివారెడ్డి మామూళ్లు వసూలు చేసినట్లు బాధితులే నేరుగా ఫిర్యాదు చేసిన దాఖలాలు ఉన్నాయి. తన నుంచి ఎస్సై నాగశివారెడ్డి విలేకరులను అడ్డుపెట్టుకుని లంచం వసూలు చేసినట్లు ముద్ర రుణాల మోసగాడు ఆవుల వెంకటేశ్వర్లు పోలీసుల ఉన్నతాధికారుల విచారణలో వెల్లడించాడు. ఇదే విషయాన్ని నాగశివారెడ్డితోను చెప్పాడు. తాజాగా కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లోనూ మామూళ్లు వసూలు చేసేందుకు ఓ ఎలక్ట్రానిక్ మీడియా వ్యక్తిని మధ్యస్తానికి ఉపయోగించినట్లు ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లింది. శాంతిభద్రతలు గాలికి... ఎస్సై నాగశివారెడ్డి మండలంలో శాంతిభద్రతలను పూర్తిగా గాలికొదిలేశాడు. పట్టపగలు గొలుసుదొంగలు మహిళల మెడలో నుంచి చైన్లు తెంచుకెళుతున్నా దొంగలను పట్టుకున్న దాఖలాలు లేవు. హత్యలు జరుగుతున్నా, అత్యాచారాలకు పాల్పడుతున్నా పట్టించుకోలేదు. రికార్డింగ్ డ్యాన్సులకు అనధికారికంగా అనుమతులిస్తూ ఉన్నతాధికారుల దృష్టిలో పడ్డాడు. హిజ్రాల నృత్యాలతో గొడవలు జరుగుతున్నా ఆపిన దాఖలాలు లేవు. ఉన్నతాధికారుల దృష్టికి.. మామూళ్లే ధ్యేయంగా పనిచేసిన ఎస్సై పి.నాగశివారెడ్డి అవినీతి పర్వం ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ దృష్టికి వెళ్లింది. బాధితులకు జరిగిన అన్యాయం, ఎస్సై లంచగొండితనంపై ఎస్పీ విచారణ జరిపారు. వసూల్ రాజా నాగశివారెడ్డికి చెక్ పెట్టారు. వీఆర్‌కు పిలుస్తూ శనివారం ఉత్వర్వులు జారీ చేశారు. కాగా ఎస్సైని సస్పెండ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
గాంధీనగర్‌లో దొంగలు పడ్డారు
మూడిళ్లలో చోరీ.. కొన్ని వస్తువులు మరో ఇంట్లో మరిచిన వైనం అనుమానితుల్ని విచారిస్తున్న పోలీసులు బుచ్చిరెడ్డిపాళెం : పట్టణంలోని గాంధీనగర్‌లో శనివారం అర్ధరాత్రి తర్వాత మూడిళ్లలో దొంగలు లూటీ చేశారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక గాంధీనగర్‌లో తొలుత సాయిబాబా గుడి పక్కనున్న ఏటూరి శ్రీనివాసులు ఇంట్లోకి దొంగలు ప్రవేశించారు. బీరువా తాళాలు పగలగొట్టి Ðఅందులోని ఒక జత కమ్మలు, రోల్డ్‌గోల్డ్ ఆభరణాలు ఒక కవర్లో పెట్టుకున్నారు. అక్కడ నుంచి వీరారెడ్డి ఇంట్లోకి వెళ్లి ప్రవేశించి బీరువాను పగలగొట్టారు. బీరువాలోని 8.4 సవర్ల బంగారు, కిలో వెండి ఆభరణాలను అపహరించారు. ఏటూరి శ్రీనివాసులు ఇంట్లో అపహరించిన వస్తువుల కవర్‌ను వీరారెడ్డి ఇంట్లో కుర్చీలో పెట్టి మరచిపోయారు. అక్కడ నుంచి రమేష్‌రెడ్డి ఇంటి కింది పోర్షన్ తలుపులు పగలగొట్టారు. అలికిడికి పైన పడుకుని ఉన్న రమేష్‌రెడ్డి కిందికి వచ్చాడు. దీంతో దొంగలు పరారీ అయ్యారు. దొంగల కలకలంతో స్థానికులందరూ గుమికూడారు. మూడిళ్లలో దొంగలు పడ్డారని నిర్ధారణకు వచ్చారు. సమాచారం అందుకున్న ఎస్ఐ సుధాకర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌టీం రంగంలోకి దిగి వేలిముద్రలను సేకరించింది. పక్కా ప్రణాళికతోనే.. దొంగలు పక్కా ప్రణాళికతో దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఎవరూ లేనిది చూసి దొంగతనం చేశారు. ఏటూరి శ్రీనివాసులు కుటుంబం వివాహానికి వెళ్లింది. వీరారెడ్డి కుటుంబం నెల్లూరుకు వెళ్లి తిరిగి బుచ్చిరెడ్డిపాళెనికి చేరుకుని బంధువైన రమేష్‌రెడ్డి ఇంట్లో ఉన్నారు. రమేష్‌రెడ్డి ఇంటి కింద గదిలో బాడుగకు ఉన్న వ్యక్తులు శుభకార్యానికి వెళ్లారు. ప్రొఫెషనల్ దొంగల పనే గాంధీనగర్‌లో మూడిళ్లలో జరిగిన దొంగతనాన్ని చూస్తే ప్రొఫెషనల్ దొంగల పనిగా తెలుస్తోందని పోలీసులు భావిస్తున్నారు. గతంలో పలు దొంగతనాల్లో ప్రమేయమున్న వ్యక్తుల పనేనని అంటున్నారు. అయితే ఇద్దరు, ముగ్గురు వ్యక్తుల పని కాదని, ఒక్కడే ఉంటాడని పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
వ్యక్తి మృతి
బుచ్చిరెడ్డిపాళెం : టిప్పర్ టైర్లు వ్యక్తి తలపైకి ఎక్కడంతో అతను మృతిచెందిన సంఘటన మండలంలోని రేబాల వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. రేబాల వద్ద బొల్లినేని కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ముంబయి జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం సికరా ప్రాంతానికి చెందిన గంగాప్రసాద్‌యాదవ్ ( 60) తన కుమారుడితో కలిసి కొంతకాలంగా రహదారి పనులు చేస్తున్నాడు. రేబాల వద్ద శుక్రవారం మట్టిని అన్లోడ్ చేసే క్రమంలో టిప్పర్ టైర్లు గంగా ప్రసాద్ తలపైకి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చోరీ కేసులో ఇద్దరు దొంగల అరెస్ట్
– రూ.1.86 లక్షల బంగారు నగల రికవరీ బుచ్చిరెడ్డిపాళెం : చోరీ కేసులో ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.1.86 లక్షల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు. తన కార్యాలయంలో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దగదర్తి మండలం చవటపుత్తేడుకు చెందిన గొల్లపల్లి కవిత ఇంట్లో ఈ ఏడాది జూలై 24వ తేదీన దొంగతనం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఊచగుంటపాళెం వద్ద శనివారం చవటపుత్తేడుకు చెందిన శెట్టిపల్లి నందకిషోర్, దువ్వూరు శ్రీనివాసులు అలియాస్ ధర్మ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారన్నారు. దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా కవిత ఇంట్లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారన్నారు. చోరీ చేసిన బంగారంలో కొంత ముణప్పరం ఫైనాన్స్‌లో కుదువ పెట్టినట్లు ఒప్పుకున్నారన్నారు. దీంతో అక్కడి నుంచి రూ.1.86 లక్షల విలువైన బంగారు ఆభరణాలను రికవరీ చేశామని ఆయన తెలిపారు. దగదర్తి ఎస్సై విజయ్‌శ్రీనివాస్, ఐడీ పార్టీ కానిస్టేబుల్ పి.రవికాంత్, కానిస్టేబుళ్లు మోహన్, ఐ. శేఖర్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ దుర్మరణం
బుచ్చిరెడ్డిపాళెం : ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ దుర్మరణం చెందిన సంఘటన స్థానిక కనిగిరి రిజర్వాయర్ సమీపంలో శనివారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... పప్పులవీధికి చెందిన పుట్టుబోయిన పద్మ (39), ఆమె కుమారుడు కార్తీక్ (19)తో కలిసి బైక్‌పై ఈ నెల 25వ తేదీన ఏఎస్‌పేట మండలం గంగవారిపల్లిలోని బంధువుల వివాహానికి వెళ్లారు. అక్కడి నుంచి శుక్రవారం ఆత్మకూరు మండలం నల్లరాజుపాళెంలోని బంధువుల ఇంట్లో ఉండి శనివారం ఉదయం నెల్లూరుకు బయల్దేరారు. కనిగిరి రిజర్వాయర్ సమీపంలోని ఫిష్ సెంటర్ వద్ద ఉన్న కల్వర్టు వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో పద్మ, కార్తీక్‌కు గాయాలయ్యాయి. ఇరువురిని 108 సిబ్బంది బుచ్చిరెడ్డిపాళెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి పద్మ మృతి చెందిదని నిర్ధారించారు. కార్తీక్‌కు స్వల్పగాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. కార్తీక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
క్షణికావేశంలో హత్య
బుచ్చిరెడ్డిపాళెం : నలుగురిలో తనను అవమానిస్తున్నాడన్న కోపంతో ఓ వ్యక్తి క్షణికావేశంతో మద్యం మత్తులో స్నేహితులతో కలిసి ఒకరిని కొట్టి హత్య చేశారు. స్థానిక సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ గంగా వెంకటేశ్వర్లు శుక్రవారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన జక్కల శ్రీనివాసులు బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని చెల్లాయపాళెంలో ఉన్న రాఘవ అల్యూమినియం ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ఇస్కపాళెం పంచాయతీ ఖాదర్‌నగర్‌కు చెందిన ఖాదర్‌బాషా అత్తతో శ్రీనివాసులు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే శ్రీనివాసులు పలు సందర్భాల్లో ఖాదర్‌బాషాను అవమానించే రీతిలో శ్రీనివాసులు అవమానంగా మాట్లాడాడు. దీన్ని మనస్సులో పెట్టుకున్న ఖాదర్‌బాషా జూలై 24వ తేదీన రాత్రి మద్యం సేవించి తన స్నేహితులు ఖదీర్‌బాషా, దస్తగిరితో కలిసి వెళ్లి మద్యం మత్తులో ఉన్న కాళ్లు, చేతులు కట్టి ఇష్టారాజ్యంగా కొట్టారు. అక్కడ ఏమి జరుగుతుందని రేబాలకు చెందిన కొట్టే రమేష్ సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. అయితే శ్రీనివాసులు తీవ్రమైన దెబ్బలకు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తి శ్రీనివాసులు నెల్లూరు నారాయణ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శ్రీనివాసులు చికిత్స పొందుతూ జూలై 30వ తేదీన మృతి చెందాడు. అప్పటి వరకు దాడి కేసుగా నమోదు చేసిన పోలీసులు కేసును హత్య కేసుగా మార్చారు. నలుగురు వ్యక్తులను శుక్రవారం అరెస్ట్ చేశారు. అవమానించాడని పగపెంచుకుని క్షణికావేశంతో కొట్టిన వ్యక్తికి తోడుగా వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు, చూసేందుకు వెళ్లిన మరో వ్యక్తి నలుగురు కటకటాల పాలయ్యారు. ఈ సమావేశంలో ఎస్సై సుధాకర్ రెడ్డి, ఏఎస్సై శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
చైన్‌స్నాచర్లు దొరికారు
అందరూ బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన వారే పథకం ప్రకారం రోజూ దొంగతనం విచారిస్తున్న పోలీసులు కొంత కాలంగా పోలీసులకు సవాల్‌గా మారిన చైన్‌స్నాచర్లు దొరికిపోయారు. ముఠా నాయకుడైన ఆ యువకుడికి నిండా22 ఏళ్లు. రెండు పదులు కూడా దాటని యువకులను కలుపుకున్నాడు. సవక చెట్ల నడుమ మద్యం తాగుతూ పథకం రచించాడు. రోజుకో చోట దొంగతనాలు చేశాడు. మూడో కంటికి తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. చివరకు ఓ మహిళ చెప్పిన ఆధారాలతో పోలీసులు వీరి గుట్టును రట్టు చేశారు. బుచ్చిరెడ్డిపాళెం : ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేసి వారి మెడల్లో చైన్లు అపహరించారు. పోలీసులకు దొరకకుండా సవాల్‌గా మారారు. ఓ మహిళ ఇచ్చిన ఆచూకీతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. విశ్వసనీయంగా సేకరించిన సమాచారం మేరకు.. బుచ్చిరెడ్డిపాళెం పెద్దూరుకు ప్రశాంత్ (22) ఆటో నడుపుకుని జీవనం సాగించేవాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. 35 ఏళ్లతో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ 30 ఏళ్ల యువతిని వివాహం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆటో నడపడంతో తనకు జరుగుబాటు కాలేదు. దీంతో చిల్లర దొంగతనాలకు అలవాటు పడ్డాడు. నాలుగేళ్ల క్రితం బుచ్చిరెడ్డిపాళెం చెన్నూరు రోడ్డులో ఓ మహిళ చైన్ లాగిన విషయంలో మహిళ అక్కడే చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది. అయినా అతనిలో మార్పు రాలేదు. ఏడు నెలలుగా.. చైన్‌స్నాచింగ్‌లకు అలవాటు పడిన ప్రశాంత్ తన ప్రవృత్తిని తన స్వగ్రామంలోనే కొనసాగించాడు. తనతో పాటు అన్నను, మంగళకట్ట, పెద్దూరుకు చెందిన బద్రీ, జయప్రకాష్తో పాటు మరికొందరిని కలుపుకున్నారు. మొత్తం ఏడుగురితో బ్యాచ్‌ను తయారు చేశాడు. బద్రీ బేల్దారి పనికి వెళ్లి కుటుంబానికి ఆసరాగా నిలిచేవాడు. జయప్రకాష్ డీఎల్ఎన్ఆర్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఖాళీ సమయంలో వీరు ఆటో నడిపేవాళ్లు. వీరిని కలుపుకుని ప్రశాంత్ ఏడు నెలలుగా చైన్‌స్నాచింగ్‌లు చేయడం ప్రారంభించాడు. అంతా పథకం ప్రకారమే.. ప్రశాంత్ తన బృందాన్ని తీసుకుని జొన్నవాడ శివారు ప్రాంతాల్లోకి వెళ్లి కూర్చుని దొంగతనాల వ్యూహాలను రచించేవాడు. అక్కడే మద్యం తాగుతూ, బిరియానిలు తింటూ పన్నాగం పన్నేవారు. దాని ప్రకారమే దొంగతనాలు చేసేవారు. ప్రశాంత్ తనతో ఉంటే బృందాన్ని బ్యాచ్‌లుగా విభజించాడు. ఇద్దరు చొప్పున రెండు దొంగతనాలు వేర్వేరు చోట్ల చేసేలా వారికి చెప్పేవాడు. వారు దాని ప్రకారం దొంగతనం చేసి సదరు బంగారాన్ని ప్రశాంత్‌కు ఇచ్చేవాడు. కుటుంబ సభ్యుల ఖాతాల్లో నగదు ప్రశాంత్ బంగారం అమ్మిన నగదును తన బృందంలోని సభ్యుల కుటుంబ సభ్యుల ఖాతాల్లో వేసేవాడు. జయప్రకాష్ తల్లి ఖాతాలో ఒకటిన్నర లక్ష ఉన్నట్లు సమాచారం. మిగతా ఖాతాల్లోను నగదు ఉంచాడు. ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడేవాడు. ఆటోను వదిలి... ఇన్నోవా.. ప్రశాంత్ చైన్‌స్నాచింగ్‌లు బుచ్చిరెడ్డిపాళెంలో చేసే ముందు తన ఆటోను అమ్మేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా జొన్నవాడకు చెందిన ఓ ఆటోను బాడుగకు తీసుకుని నడుపుకుంటున్నాడు. తన ఆటో ఉంటే ఆ నంబర్ల ఆధారంగా తనను పట్టుకుంటారేమోనని జాగ్రత్త పడ్డాడు. బాడుగకు తీసుకున్న ఆటోతో తన సభ్యులను ఉంచి దొంగతనాలు చేశాడు. అయితే దొంగతనాలతో వచ్చిన డబ్బులతో ఏకంగా ఇన్నోవాను కొనేందుకు ప్రశాంత్ సిద్ధమయ్యాడు. తన స్నేహితులతోనే ఇన్నోవాను కొంటున్నానని తెలిపాడు. బయటపడిందిలా... దగదర్తి మండలం యలమంచిపాడుకు చెందిన పాపమ్మ అనే మహిళ ఒంటరిగా రావడాన్ని ప్రశాంత్, బద్రీ, జయప్రకాష్ గమనించారు. తెలివిగా వారిలో ఒకరు వెళ్లి రాజ్‌కిషోర్ థియేటర్ సమీపంలో నడిచి వస్తున్న ఆమెను ఆటోలో ఎక్కించుకున్నాడు. ఒకరు వాహనం నడుపుతుండగా మరో ఇద్దరు ఆమె పక్కన కూర్చున్నారు. శ్రీహరికోట సమీపంలో రాగానే ఆటోలో కూర్చున్న వ్యక్తులు చైన్ లాగేందుకు ప్రయత్నించారు. ఆమె కేకలు వేయగా ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్‌గా ఉన్న ప్రశాంత్ బృంద సభ్యుడిని పోలీసులు విచారించగా మొత్తం వివరాలు బయటపడుతున్నాయి. పోలీసులు ఇంకా దర్యాప్తు జరుపుతున్నారు. -
భార్యను చంపేందుకు భర్త యత్నం
నెల్లూరు: కట్టుకున్న భార్యనే చంపేందుకు ప్రయత్నంచాడు ఓ భర్త. ఈ సంఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఆదివారం వెలుగుచూసింది. వివరాలు.. గ్రామంలోని శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి తన మాజీ భార్యను చంపేందుకు ఆమె ఇంటి చుట్టూ పెట్రోల్ పోసి, బాంబులు పెట్టాడు. గమనించిన భార్య.. స్థానికులతో కలిసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంటి చుట్టూ ఉన్న బాంబులు, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. -
క్రషింగ్ ప్రశ్నార్థకం
బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్ : కోవూరు సహకార చక్కెర కర్మాగారంలో క్రషింగ్ ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారింది. నేటికీ క్రషింగ్ ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోవూరు నియోజకవర్గంలో 1.80 లక్షల టన్నుల చెరకు క్రషింగ్ సిద్ధంగా ఉంది. బాయిలర్ మరమ్మతులు నేటికీ ప్రారంభించకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా చిత్తూరు, ఆర్థికశాఖామంత్రి జిల్లా నెల్లూరు మినహా మిగతా అన్ని జిల్లాల్లోని సహకార కర్మాగారాలు బకాయిలు పూర్తిగా చెల్లించాయి. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కోవూరు చక్కెర కర్మాగారం రైతులకు రూ.5.40 కోట్లు, ఉద్యోగుల జీతాలు రూ.4.80 కోట్లు చెల్లించా ల్సి ఉంది. ఈ ఏడాది ఫ్యాక్టరీలో క్రషింగ్ జరపాల్సి ఉంటే రూ.4 కోట్లు మరమ్మతులకు అవసరం ఉంది. గతేడాది ప్రారంభం నుంచే ఫ్యాక్టరీలో క్రషింగ్ ముగిసే వరకు బాయిలర్ మరమ్మతులకు గురికావడం ప్రధాన సమస్యగా మారింది. గత ఏడాది బాయిలర్ మరమ్మతులు చేపట్టినా తరచూ మరమ్మతులకు గురువుతూనే ఉంది. ఈ ఏడాది బాయిలర్ మరమ్మతులను పూర్తి స్థాయిలో చేయాల్సి ఉంది. బాయిలర్‌లోని 3,600 ట్యూబ్‌లను మరమ్మతులు చేయాలంటే దాదాపు రెండు నెలల సమయం పడుతుందిన సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. కోవూరులో నిర్వహించిన రచ్చబండ సందర్భంగా చక్కెర కర్మాగారం బకాయిలు, ఇతర అవసరాలకు నిధులు విడుదల చేస్తానని చెప్పిన మంత్రి ఆనం మాటలు నేటికీ నోచుకోలేదు. ఈ క్రమంలో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి కర్మాగారం పరిస్థితిపై సీఎం కిరణ్, మంత్రి ఆనంని కలిసి విన్నవించారు. క్రషింగ్ ఆలస్యమవుతుండటంతో చెరకును జిల్లాలోని ఇతర ఫ్యాక్టరీలకు తరలించే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీకాంత్‌ను కోరారు. దీంతో కలెక్టర్ నాయుడుపేట చక్కెర కర్మాగారంలో నిత్యం వెయ్యి టన్నులు క్రషింగ్ జరిపేం దుకు ఒప్పందం కుదిర్చారు. అయితే దాదాపు మూడు నెలల పాటు క్రషింగ్ జరిగినా నెలకు ముప్పై వేల టన్నుల చొప్పున క్రషింగ్ ముగిసే నాటికి కేవలం 90 వేల టన్నులు మాత్రం క్రషింగ్ జరిగే అవకాశం ఉంది. మిగతా 90 వేల టన్నులు పరిస్థితి ఏంటన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది. ఫ్రీజోన్ ప్రకటిస్తే మేలు కోవూరు చక్కెర కర్మాగారం పరిధిలో పండించిన 1.80 వేల టన్నుల చెరకు కోవూరు చక్కెర కర్మాగారంలో క్రషింగ్ అయ్యే పరిస్థితి లేదు. మరమ్మతులు చేసి ఫ్యాక్టరీ ప్రారంభించినా ముప్పై వేలకు మించి క్రషింగ్ జరిగే దాఖలాలు లేవని రైతు సంఘాలు చెబుతున్నాయి. కోవూరును ఫ్రీజోన్‌గా కలెక్టర్ శ్రీకాంత్ ప్రకటిస్తే మేలు జరుగుతుందని రైతులు భావిస్తున్నారు. ఫ్రీ జోన్ ప్రకటిస్తే రైతులు తమ చెరకును రాష్ట్రంలోని ఏ ఫ్యాక్టరీకైనా తరలించే అవకాశం ఉంది. అగ్రిమెంట్ 15 వేల టన్నులకే.. ఇప్పటి వరకు కోవూరు చక్కెర కర్మాగారం పరిధిలో క్రషింగ్ జరిపేందుకు కేవలం 15 వేల టన్నులకే అగ్రిమెంట్ అయింది. తాజాగా అధికారులు గ్రామా ల్లో పర్యటిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అగ్రిమెంట్ చేయనున్నట్లు చెబుతున్నారు. కోవూరు చక్కెర కర్మాగారం లో ప్రతి ఏడాది అక్టోబరు నుంచి ఏప్రిల్ వరకు సీజన్‌గా ప్రకటిస్తారు. నవంబరులో స్లోఫైరింగ్ చేసి, డిసెంబరులో క్రషింగ్ ప్రారంభిస్తారు. ఇంత వరకు కర్మాగారంలో స్లోఫైరింగ్ జరిగిన దాఖలాలు లేవు. కోవూరు చక్కెర కర్మాగారం ఎండీ సుధాకర్‌రెడ్డి నిర్లక్ష్యంతో గతేడాది రైతులకు తీవ్రనష్టం జరిగింది. -
సమైక్య శంఖారావం: బుచ్చిరెడ్డిపాలెంలో షర్మిళ ప్రసంగం