
క్షణికావేశంలో హత్య
బుచ్చిరెడ్డిపాళెం : నలుగురిలో తనను అవమానిస్తున్నాడన్న కోపంతో ఓ వ్యక్తి క్షణికావేశంతో మద్యం మత్తులో స్నేహితులతో కలిసి ఒకరిని కొట్టి హత్య చేశారు. స్థానిక సర్కిల్ పోలీస్‌స్టేషన్లో సీఐ గంగా వెంకటేశ్వర్లు శుక్రవారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన జక్కల శ్రీనివాసులు బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని చెల్లాయపాళెంలో ఉన్న రాఘవ అల్యూమినియం ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ఇస్కపాళెం పంచాయతీ ఖాదర్‌నగర్‌కు చెందిన ఖాదర్‌బాషా అత్తతో శ్రీనివాసులు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే శ్రీనివాసులు పలు సందర్భాల్లో ఖాదర్‌బాషాను అవమానించే రీతిలో శ్రీనివాసులు అవమానంగా మాట్లాడాడు.
దీన్ని మనస్సులో పెట్టుకున్న ఖాదర్‌బాషా జూలై 24వ తేదీన రాత్రి మద్యం సేవించి తన స్నేహితులు ఖదీర్‌బాషా, దస్తగిరితో కలిసి వెళ్లి మద్యం మత్తులో ఉన్న కాళ్లు, చేతులు కట్టి ఇష్టారాజ్యంగా కొట్టారు. అక్కడ ఏమి జరుగుతుందని రేబాలకు చెందిన కొట్టే రమేష్ సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. అయితే శ్రీనివాసులు తీవ్రమైన దెబ్బలకు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తి శ్రీనివాసులు నెల్లూరు నారాయణ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శ్రీనివాసులు చికిత్స పొందుతూ జూలై 30వ తేదీన మృతి చెందాడు. అప్పటి వరకు దాడి కేసుగా నమోదు చేసిన పోలీసులు కేసును హత్య కేసుగా మార్చారు. నలుగురు వ్యక్తులను శుక్రవారం అరెస్ట్ చేశారు. అవమానించాడని పగపెంచుకుని క్షణికావేశంతో కొట్టిన వ్యక్తికి తోడుగా వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు, చూసేందుకు వెళ్లిన మరో వ్యక్తి నలుగురు కటకటాల పాలయ్యారు. ఈ సమావేశంలో ఎస్సై సుధాకర్ రెడ్డి, ఏఎస్సై శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.