
సాక్షి, నెల్లూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు జాతీయరహరదారిపై ఆదివారం ఉదయం ఆగిఉన్న ఓ లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. టెంపోలో ఉన్న ఇద్దరు చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరణించినవారు తమిళనాడు వాసులుగా పోలీసులు గుర్తించారు. శ్రీశైలం యాత్ర ముగించుకుని నెల్లూరు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో టెంపోలో మొత్తం 15 మంది ప్రయాణం చేస్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి: మహిళ గొంతుకోసిన కానిస్టేబుల్
Comments
Please login to add a commentAdd a comment