తూర్పుగోదావరి (వీఆర్‌పురం) : భార్య మరణం తట్టుకోలేక భర్త మృతిచెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా వీఆర్‌పురం మండలం పులుసుమామిడిలో గురువారం చోటుచేసుకుంది. పులుసు మామిడి గ్రామానికి చెందిన కలుమల రత్తమ్మ(24), కన్నయ్య(28)లు భార్యాభర్తలు. కన్నయ్య పుట్టుకతో వికలాంగుడు. రత్తమ్మ నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం మృతిచెందింది.
అంత్యక్రియల నిమిత్తం కూనవరం మండలం కోనరాజుపేట చర్చి వద్దకు తీసుకువెళ్లారు. భార్య మృతదేహాన్ని చూసి మనోవేదనతో కన్నయ్య అక్కడే గుండెపోటుతో మరణించాడు. దీంతో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రుల మృతితో వీరి ఏడాదిన్నర పాప అనాధ అయింది.
భార్య మరణం తట్టుకోలేక భర్త మృతి
Published Fri, Sep 25 2015 3:06 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM
Advertisement
Advertisement