VR puram
-
తామర పంటకాదు.. పూల్ మఖానా!
నిరుపయోగంగా ఉన్న చెరువులు, కుంటలను వినియోగంలోకి తెచ్చి గిరి రైతులకు ఆదాయ వనరుగా మార్చేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా (alluri sitarama raju district) చింతూరు ఐటీడీఏ అడుగులు వేస్తోంది. డివిజన్ పరిధిలోని చింతూరు, కూనవరం, ఎటపాక, వీఆర్‌పురం మండలాల్లో నిరుపయోగంగా ఉన్న చెరువులు, కుంటల్లో చేపల పెంపకానికి అనుబంధంగా పూల్ మఖానా (phool makhana) సాగు చేపట్టేందుకు సంకల్పించింది. ఇప్పటికే చింతూరు డివిజన్లో మఖానా సాగు సాధ్యాసాధ్యాలను నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ మఖానాకు చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ ఇందుశేఖర్ సింగ్, డాక్టర్ పడాల వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సాగుకు కీలకమైన గాలి, ఉష్ణోగ్రత, వర్షపాతం అనుకూలంగా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. డివిజన్ పరిధిలోని చెరువులు, కుంటలను పరిశీలించారు. స్థానిక గిరిజన రైతులతో కూడా మాట్లాడారు. ఇక్కడి చెరువులు, కుంటల్లోని మట్టి, నీటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. పరీక్షల నివేదిక ఆధారంగా ఈ ప్రాంతంలో మఖానా సాగు చేపట్టేందుకు వారు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థిరమైన శాశ్వత నీటి వనరుల్లో.. మఖానా అనేది జలపంట. దీనిని సాధారణంగా పూల్ మఖానా, గోర్గాన్ నట్ (gorgon nut) అని కూడా పిలుస్తుంటారు. ఇది సరస్సులు, చెరువులు, చిత్తడి నేలలు, కుంటల వంటి స్థిరమైన శాశ్వత నీటి వనరుల్లో పెరుగుతుంది. తేలియాడే ఆకులతో మెత్తని ఆకృతి, ప్రకాశవంతమైన నీలిరంగు, స్టార్చ్వైట్ గింజలతో ఉత్పత్తి చేస్తుంది. చూసేందుకు తామర ఆకులను పోలిఉండటంతో దీనిని అందరూ తామర పంటగానే భావిస్తారు. తామర ఆకు మృదువుగా ఉంటే మఖానా ఆకు (Prickly Water Lily) మాత్రం పైకి ముళ్ల మాదిరిగా కనిపిస్తుంది. ప్రతిమొక్క 15 నుంచి 20 పండ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి గుండ్రంగా మెత్తగా ఉంటాయి. ప్రతి పండులో 20 నుంచి 200 గింజల వరకు ఉంటాయి. మార్కెట్లో వీటి ధర కిలో రూ.800 నుంచి రూ.1200 వరకు ఉంటుంది. మఖానా పంట సగటు దిగుబడి హెక్టారుకు 1.4 నుంచి 1.6 టన్నుల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. మఖానాలో ఉన్న ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, మినరల్స్, విటమిన్లు వల్ల జీర్ణవ్యవస్థ మెరుగు, బరువు తగ్గడం, మెదడు పనితీరు మెరుగు పరచడం, గుండె సంబంధిత వ్యాధులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. మఖానాను నేరుగా తినడంతో పాటు వంటకాల్లో ఉపయోగించడం వల్ల స్థానికంగా మార్కెటింగ్ అందుబాటులో ఉంటుంది.ల్యాబ్ నివేదిక ఆధారంగా చర్యలు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మఖానా సాగును ప్రోత్సహిస్తున్నాం. దీనిలో భాగంగా ఇటీవల ఆంధ్రాలోని చింతూరు ఐటీడీఏ పరిధిలో పర్యటించాం. సాగులో కీలకమైన ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతుండాలి. మట్టి, నీరు కూడా పంట దిగుబడులపై ప్రభావం చూపిస్తాయి. చింతూరు ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడాన్ని గుర్తించాం. సాగుకు అనుకూల పరిస్థితులపై కసరత్తు ప్రారంభించాం. దీనిలో భాగంగానే మట్టి, నీటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించాం.– డాక్టర్ ఇందుశేఖర్ సింగ్, శాస్త్రవేత్త, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ మఖానాచదవండి: అందాల దీవిలో కడలి కల్లోలంఆర్థిక పరిస్థితి మెరుగుకు దోహదంమఖానా సాగు గిరి రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుకు దోహదపడుతుందని భావిస్తున్నాం. చేపల పెంపకం చేపట్టే చెరువుల్లోనే వాటికి అనుబంధంగా మఖానాను కూడా సాగు చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రాంతంలో నమోదయ్యే అధిక ఉష్ణోగ్రతలు సాగుకు అనుకూలిస్తాయని ఆశిస్తున్నాం. దీనిలో భాగంగానే శాస్త్రవేత్తలు ఇటీవల ఈప్రాంతంలో పర్యటించారు. ల్యాబ్ నివేదిక రాగానే వారు సాగుకు క్లియరెన్స్ ఇచ్చిన వెంటనే సాగుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. రైతులకు అవగాహన కల్పించి తరువాత శిక్షణ ఇస్తాం. – అపూర్వభరత్, ప్రాజెక్ట్ అధికారి, ఐటీడీఏ, చింతూరు -
పాపికొండల టూర్.. నదీ అందాలు తిలకిస్తూ విహారం
రంపచోడవరం: పాపికొండలు అందాలు చూసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రెండేళ్ల విరామం తరువాత నవంబరు 7 నుంచి పర్యాటక బోటులు పాపికొండల విహారానికి బయలుదేరానున్నాయి. దీంతో పర్యాటకుల్లో ఆసక్తి.. ఆనందం నెలకొన్నాయి. శీతాకాలం గోదావరిపై మంచు తెమ్మరల మధ్య పాపికొండల పర్యటన మధురానుభూతినిస్తుందనడంలో సందేహం లేదు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు మధ్య సుమారు 40 కిలో మీటర్ల పొడవుల గోదావరికి ఇరువైపులా పాపికొండలు విస్తరించి ఉన్నాయి. టూరిజమ్ బోట్లపై ప్రయాణించే పర్యాటకులు పాపికొండలు, గోవావరి వెంబడి ఎత్తున కొండలు, పచ్చని వృక్షాలు ప్రాంతాన్ని వీక్షించేందుకు ఏటా వేల సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రాంతానికి సందర్శిస్తున్నారు. వీఆర్‌పురం మండలం పోచవరం బోట్ పాయింట్ నుంచి రోజు సుమారు 300 మంది ,సెలవు రోజుల్లో వెయ్యి మందికి పైగా పర్యాటకులు పాపికొండల సందర్శనకు వచ్చేవారు. ఎలా వెళ్తారంటే.. ► భద్రాచలం రామాలయాన్ని దర్శించుకున్నాక 75 కిలో మీటర్ల దూరంలోని పోచవరం బోట్ పాయింట్‌కు రోడ్డు మార్గం గుండా చేరుకుంటారు. అక్కడి నుంచి గోదావరి నదిలో బోట్లో ప్రయాణిస్తారు. ► తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం మండలం పోశమ్మ గండి ఆలయం వద్ద బోట్ పాయింట్ నుంచి పర్యాటకులు పాపికొండల విహార యాత్రకు బయలుదేరతారు. ► రాజమమహేంద్రవరం నుంచి కూడా వాహనంలో పురుషోత్తపట్నం మీదుగా పోశమ్మగండికి చేరుకుంటారు. భద్రతకు పెద్దపీట 2019లో జరిగిన కచ్చులూరు సంఘటన నేపథ్యంలో ప్రభుత్వం పటిష్టమైన భద్రత చర్యలు తీసుకుంది.. గోదావరి నీటి మట్టం ఆధారంగా బోటులు గోదావరిపై నడిపేందుకు అనుమతి ఇస్తోందిరు. పోలవరం ప్రాజెక్టు ఎర్త్‌డ్యామ్ వద్ద నీటి మట్టం 27 మీటర్లు ఉంటే బోట్లు తిరిగేందుకు అనుమతి లభిస్తుంది. అంతకు మించి నీటి మట్టం పెరిగే బోటులను నిలిపివేస్తారు. 23 పర్యాటక బోట్లుకు అనుమతి పాపికొండలు అందాలను చూపించేందుకు ప్రైవేట్ బోట్లుతో పాటు, ఏపీ టూరిజం బోట్లు కూడా నడుస్తాయి. కొద్ది రోజులు పాపికొండలు పర్యాటకం నిలిచిపోయిన తరువాత టూరిజం బోట్లు నడిపేందుకు అనుమతి ఇచ్చారు. తాజా నిర్ణయంతో బోట్ల ఫిట్నేస్ పరిశీలించి టెక్నికల్ అధికారులు తొలివిడతగా నిబంధనలకు అనుగుణంగా సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఇలా ఇప్పటికే 23 బోట్లకు అనుమతి లభించింది. పోచమ్మగండి బోట్పాయింట్ నుంచి 11 బోట్లకు, పోచవరం బోట్ పాయింట్ నుంచి 12 బోట్లకు అనుమతులు లభించించాయి. (చదవండి: రాజమండ్రి నుంచి టికెట్ ధర రూ.1,250) అనేక మందికి ఉపాధి ► పాపికొండల పర్యాటకంతో అనేక మంది ఉపాధి లభిస్తుంది. టికెట్ కౌంటర్లలో పనిచేసే వర్కర్లు,లాడ్జీల నిర్వహకులు,మార్గం మధ్యలోని కూనవరం ,వీఆర్‌పురం మండలాల్లోని హోటళ్లు, ఇతర వ్యాపారాలతో ఎక్కువమంది ఉపాధి పొందుతున్నారు. ► పోచవరం బోట్ పాయింట్ వద్ద వ్యాపారస్తులతో పాటు బోట్ల యజమానులు, గుమస్తాలు, బోట్ల వర్కర్లు, క్యాటరింగ్ సిబ్బంది, ఫొటో గ్రాఫర్లు, నృత్యకళాకారులకూ ఈ టూర్ ఉపాధిగా నిలుస్తోంది. ► పేరంటాలపల్లిలో వెదురు కళాకృతులు విక్రయించే కొండరెడ్డి గిరిజనులు,కొల్లూరు ఇసుక తెన్నెల్లో బొంగు చికెన్ విక్రయించే గిరిజనులతో పాటు ఐస్‌లు విక్రయించే వారు ఇలా సుమారులు ఐదు వేలమందికి పైగా దీనిపై ఆధారపడుతుంటారు. పోశమ్మ గండి బోట్ పాయింట్ పోశమ్మ గండి బోట్ పాయింట్ నుంచి టూరిజమ్ బోట్లు పాపికొండలు పర్యాటానికి బయలుదేరతాయి. బోట్లుల్లో అన్ని సురక్షిత ఏర్పాట్లు మధ్య పాపికొండకు బోటులను పంపండం జరుగుతుంది. బోట్ పాయింట్ వద్ద పర్యాటక సిబ్బంది ఉంటారు. –వీరనారాయణ, టూరిజం అధికారి, రాజమహేంద్రవరం -
12 మంది చిన్నారులకు అస్వస్థత..
వీఆర్‌పురం: తినుబండారాలు వికటించి 12 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన పులుసు మామిడి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. చిన్నారుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గుల్లేటివాడ గ్రామానికి చెందిన వంజం బుచ్చయ్య బూరుగువాడలోని తన సోదరి కనుముల భద్రమ్మ కుటుంబాన్ని కలిసే నిమిత్తం మండల కేంద్రం రేఖపల్లికి చేరుకున్నాడు. తన సోదరి ఇంట్లో ఉన్న చిన్నారుల కోసమని అక్కడ దుకాణంలో రసగుల్లా, కాజా,గవ్వలు వంటి తినుబండాలు కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి బూరుగువాడ చేరుకొని భద్రమ్మ ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారులకు ఇచ్చాడు. వాళ్లతో పాటు అక్కడ ఉన్న ఇతర పిల్లలకు కూడా ఇచ్చారు. అవి తిన్న 12 మంది చిన్నారులు వాంతులు చేసుకున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై అధికారులకు సమాచారం అందజేశారు. తహసీల్దార్ ఎన్.శ్రీధర్, వైద్యాధికారి చైతన్య, ఎస్సై బి.వెంకట్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వారందరినీ 108లో రేఖపల్లి పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందజేశారు. పిల్లలందరి ఆరోగ్యం సక్రమంగానే ఉందని అందులో మూడేళ్ల కనుముల సమంత అనే బాలికకు మాత్రం వాంతులు, విరోచనాలు తగ్గుముఖం పట్టలేదని వైద్యాధికారి చైతన్య చెప్పారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపడతామని తహసీల్దార్, ఎస్సైలు తెలిపారు. -
పూరైన ఇంటింటి కాళ్లవాపు సర్వే
వీఆర్ పురం : కాళ్ల వాపుతో పలువురు మృత్యువాత పడుతున్న నేపధ్యంలో మంగళవారం నుంచి మండల వ్యాప్తంగా నిర్వహించిన సర్వే పూర్తయింది. రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ, మండల పరిషత్ అధికారులు, సిబ్బంది ఈ సర్వేలో పాల్గొన్నట్టు తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్, ఎంపీడీఓ జి.సరోవర్ శుక్రవారం తెలిపారు. మొత్తం 7748 కుంటుంబాలను సర్వే చేసినట్టు చెప్పారు. సర్వే బృందం కాళ్ల వాపు లక్షణాలతో ఉన్న వారిని గుర్తించి తొలుత రేఖపల్లి ఆస్పత్రికి తరలించేదని వారు తెలిపారు. అక్కడ వారిని వైద్య నిపుణులు పరీక్షించాక, అవసరమైన వారికి అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించేవారని వివరించారు. మంగళవారం 18 మంది కాళ్ల వ్యాపు వ్యాధిగ్రస్తులను గుర్తించగా, నలుగురిని కాకినాడకు తరలించారన్నారు. బుధవారం 31 మందిని గుర్తించగా వారిలో 16మందిని, గురువారం 12 మందిని గుర్తించగా ఇద్దరిని ,శుక్రవారం నలుగురిని గుర్తించగా ఇద్దరిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించామని చెప్పారు. శనివారం నుంచి మళ్లీ మండల వ్యాప్తంగా రెండో దఫా కాళ ్లవాపు సర్వే కొనసాగుతుందని వారు చెప్పారు. -
వీఆర్‌పురంపై అధికారుల పూర్తి దృష్టి
వీఆర్‌పురం : కాళ్లవాపు వ్యాధి ప్రభావంతో వీఆర్‌పురం మండలం రాష్ట్ర స్థాయిలో సంచలన వార్తగా నిలిచింది. దీంతో ఈ వ్యాధి ప్రభావాన్ని అరికట్టేందుకు జిల్లా స్థాయి అధికారులు నిత్యం మండల పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. డీసీహెచ్ఎస్ రమేష్ కిషోర్ రేఖపల్లి పీహెచ్‌సీని గురువారం సందర్శించారు. టీముల వారిగా మండలంలో చేపడుతున్న సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అదనంగా కాకినాడ నుంచి వచ్చిన డాక్టర్లతో ఆయన సమావేశం నిర్వహించి పలు విషయాలను చర్చించారు. అన్ని వేళలా వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ ఎం.పవన్‌కుమార్, ప్రత్యేకాధికారి పి. శ్రీరామచంద్రమూర్తులు మండల కేంద్రంలో ఉంటూ సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ జిల్లా కలెక్టర్‌కు మండల పరిస్థితిపై సమాచారం అందిస్తున్నారు. మరో ఆరుగురి తరలింపు ... కాళ్లవాపు వ్యాధి లక్షణాలతో ఉన్న మరో ఆరుగురిని గురువారం అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మంగళ, బుధవారాల్లో మండలం నుంచి కాకినాడకు చికిత్స కోసం 24 మందిని అధికారులు తరలించారు. తాజాగా గురువారం తరలించిన ఆరుగురితో కలిపి మొత్తం 30 మంది కాకినాడ జీజీహెచ్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కాళ్లవాపు వ్యాధి బారిన పడి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకు వచ్చిన వారికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖర్చుల కింద రూ.1500 పంపిణీ చేసినట్లు అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ ఎం.పవన్‌కుమార్ తెలిపారు. -
భార్య మరణం తట్టుకోలేక భర్త మృతి
తూర్పుగోదావరి (వీఆర్‌పురం) : భార్య మరణం తట్టుకోలేక భర్త మృతిచెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా వీఆర్‌పురం మండలం పులుసుమామిడిలో గురువారం చోటుచేసుకుంది. పులుసు మామిడి గ్రామానికి చెందిన కలుమల రత్తమ్మ(24), కన్నయ్య(28)లు భార్యాభర్తలు. కన్నయ్య పుట్టుకతో వికలాంగుడు. రత్తమ్మ నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం మృతిచెందింది. అంత్యక్రియల నిమిత్తం కూనవరం మండలం కోనరాజుపేట చర్చి వద్దకు తీసుకువెళ్లారు. భార్య మృతదేహాన్ని చూసి మనోవేదనతో కన్నయ్య అక్కడే గుండెపోటుతో మరణించాడు. దీంతో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రుల మృతితో వీరి ఏడాదిన్నర పాప అనాధ అయింది. -
విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి
వీఆర్‌పురం(తూర్పుగోదావరి): పాఠశాలకు వెళుతున్న పదో తరగతి విద్యార్థినిని ముఖానికి ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి పదునైన వస్తువుతో గాయపరిచిన ఘటన కలవరం రేపింది. తూర్పు గోదావరి జిల్లా వీఆర్ పురంలో జరిగిన ఈ సంఘటన వివరాలు బాధిత బాలిక తెలిపిన దాని ప్రకారం ఇలా ఉన్నాయి. పట్టి నాగేశ్వరావుకు కుమార్తె ఐశ్యర్య వీఆర్ పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం 9 గంటలకు పాఠశాలకు వెళుతుండగా.. నాగార్జున గ్రామీణ బ్యాంక్ సమీపంలో ఓ బైక్ ఆమెకు దగ్గరగా వచ్చింది. హెల్మెట్ ధరించిన వ్యక్తి బైక్ నడుపుతుండగా ముఖం కనబడకుండా కర్చీఫ్ కట్టుకున్న మరో వ్యక్తి ఆమె కుడిచేతిపై పదునైన వస్తువుతో గాయపరిచాడు. ఆ షాక్ నుంచి ఆమె తేరుకుని అరిచేలోపు అక్కడి నుంచి వారు ఉడాయించారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై డి. రామారావు పరిశీలించారు. విద్యార్థిని ఇంటి వద్ద, పాఠశాలలోను విచారణ చేపట్టారు. బాలిక చేతిపై గాట్లు పడ్డ తీరు అనుమానించదగిన రీతిలో ఉందని, పూర్తిస్థాయిలో దర్యాప్తు తర్వాత వివరాలు తేలుతాయన్నారు.