రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ శాంతిభద్రతల అంశాన్ని కేంద్ర పరిధిలోకి తీసుకురావడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విశ్రాంత డీజీపీ, టీఆర్ఎస్ నేత పేర్వారం రాములు అన్నారు. హైదరాబాద్ శాంతిభద్రతలు, ఇతర కీలక పరిపాలన అంశాలను గవర్నర్ ఆధీనంలో ఉంచనున్నట్టు వార్తలు రావడంతో ఆయన పైవిధంగా స్పందించారు.
రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్, తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రులకు ఎటువంటి భయం అవసరం లేదని రాములు భరోసా ఇచ్చారు. వారికి పూర్తి భద్రత ఉంటుందని రాములు పేర్కొన్నారు.
'హైదరాబాద్ శాంతిభద్రతలు కేంద్రానికి అప్పగించరాదు'
Published Sat, Nov 9 2013 3:23 PM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM
Advertisement
Advertisement