Pervaram Ramulu
-
పరువు నష్టం దావా: కోర్టుకు రాని పేర్వారం రాములు
హైదరాబాద్ : తెలంగాణ మాజీ డీజీపీ పేర్వారం రాములుపై మాజీ ఇన్స్పెక్టర్ మాధవరెడ్డి సిటీ సివిల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. మాధవరెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేసి పీడీయాక్ట్ పెట్టి జైలుకు పంపిన నేపథ్యంలో రాములుపై పరువునష్టం దావా వేశారు. బుధవారం రాములును విచారణకు హాజరు కావల్సిందిగా కోర్టు ఆదేశించింది. 7 శాతం వడ్డీతో రూ.75 లక్షలు చెల్లించాలని 2017లో రాములును కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, రాములు ఈ రోజు కోర్టుకు హాజరు కాలేదు. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలను పాటించని కారణంగా మాజీ డీజీపీ రాములును అరెస్ట్ చేయాలని పిటీషనర్ మాధవరెడ్డి డిమాండ్ చేశారు. మాజీ డీజీపీ పేర్వారం రాములు 75 ఏళ్ల వయస్సుతో ఉండటం వల్ల కోర్టుకు హాజరు కాలేదని.. రాములు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలో ఇరు వాదనలు పూర్తిగా విన్న న్యాయస్థానం ఈ కేసుపై తుది తీర్పును జూలై 5వ తేదీకి వాయిదా వేసింది. -
పేర్వారం రాములుకు మాతృవియోగం
రఘునాథపల్లి : ఉమ్మడి రాష్ట్ర మాజీ డీజీపీ, రాష్ట్ర టూరిజం అభివృద్ధి శాఖ మాజీ చైర్మన్ పేర్వారం రాములుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి పేర్వారం వీరమ్మ (94) అనారోగ్యంతో ఆదివారం రాత్రి మం డలంలోని ఖిలాషాపూర్‌లో తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మె ల్యే నాగపూరి రాజలింగం, జనగామ మునిసిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, కొమురవెల్లి దేవస్థాన కమిటీ చైర్మన్ సేవెల్లి సంపత్‌లు సోమవారం మృతదేహంపై పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు రాములును పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం నిర్వహించిన అంతిమయాత్రలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోకల శివకుమార్, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యుడు మారుజోడు రాంబాబు, సర్పంచ్ దొంగ అంజిరెడ్డి, మండల పరిషత్ కోఅçప్షన్ సభ్యుడు మహమూద్, నాయకులు గొరిగ రవి, మడ్లపల్లి సునీత, కోళ్ల రవిగౌడ్, బక్క నాగరాజు, ఉడుత రవి, దూడల యాదగిరి, లోనె శ్రవణ్‌కుమార్, దొంగ మహిపాల్‌రెడ్డి, కావటి రాజయ్య, అల్లిబిల్లి నర్సయ్య, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. అంతియయాత్రలో పాల్గొన్న పొన్నాల రఘునాథపల్లి: ఖిలాషాపూర్‌లో సోమవారం నిర్వహించిన మాజీ డీజీపీ పేర్వారం రాములు తల్లి వీరమ్మ (94) అంతిమ యాత్రలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు. తన సొంత గ్రామమైన ఖిలాషాపూర్‌లో ఆమెతో చిన్ననాటి నుంచి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీరమ్మ కుమారుడు రాములుతో ఎంత సఖ్యత ఉండేదో లక్ష్మయ్యతో అంతే అభిమానంగా ఉండేది. ఉన్నత విద్యాభ్యాసం చేసినా, వృత్తి పరంగా పేర్వారం, రాజకీయంగా పొన్నాల ఏ స్థాయికి ఎదిగినా ఎప్పటిలాగే కలిసి ఉండేవారు. ఈ సందర్భంగా అంతిమ యాత్రలో పొన్నాల కొద్ది సేపు పాడె మోశారు. -
ప్రజాభీష్టం మేరకే నూతన జిల్లాలు
రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పేర్వారం రాములు రఘునాథపల్లి : పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్ధవంతమైన పాలకుడని రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పేర్వారం రాములు అన్నారు. మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ దురుద్దేశ్యంతో కొందరు కేసీఆర్ నియంత అంటూ మాట్లాడుతుండడం సరికాదన్నారు. ప్రజాభీష్టం మేరకు కొత్త జిల్లాలు ఏర్పాటుచేస్తున్నారని స్పష్టం చేశారు. పోరాటాలకు పురిటి గడ్డ అయిన జనగామను జిల్లాగా ఏర్పాటుచేయడం శుభపరిణామమన్నారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆయన నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్, జేఏసీ నాయకులు మారుజోడు రాంబాబు, దశమంతరెడ్డి, లకీ‡్ష్మనారాయణ, పోకల శివకుమార్, నామాల బుచ్చయ్య, పెండ్లి మల్లారెడ్డి, చెంచు రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు టూరిజం ఎండీ, చైర్మన్ల రాక
జమ్మికుంట రూరల్ : మండలంలోని ఇల్లందకుంట సీతారామ చంద్రస్వామి, బిజిగిరిషరీఫ్ సయ్యద్ ఇంకుషావళీ దర్గాలను టూరిజం ఎండీ క్రిష్టియానా, చైర్మన్ పేర్వారం రాములు సదర్శించనున్నట్లు ఇల్లందకుంట ఆలయ కమిటీ చైర్మన్ కంకణాల సురేందర్‌రెడ్డి, దర్గా కమిటీ అధ్యక్షుడు మహ్మద్ చోటేమియాలు తెలిపారు. టూరిజం ఎండీ, చైర్మన్ల రాకతో ఆలయం, దర్గాలు మరింత అభివృద్ధి చెందుతాయని, పర్యాటక శోభ సంతరించుకొనే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
నేడు టూరిజం ఎండీ, చైర్మన్ల రాక
జమ్మికుంట రూరల్ : మండలంలోని ఇల్లందకుంట సీతారామ చంద్రస్వామి, బిజిగిరిషరీఫ్ సయ్యద్ ఇంకుషావళీ దర్గాలను టూరిజం ఎండీ క్రిష్టియానా, చైర్మన్ పేర్వారం రాములు సదర్శించనున్నట్లు ఇల్లందకుంట ఆలయ కమిటీ చైర్మన్ కంకణాల సురేందర్‌రెడ్డి, దర్గా కమిటీ అధ్యక్షుడు మహ్మద్ చోటేమియాలు తెలిపారు. టూరిజం ఎండీ, చైర్మన్ల రాకతో ఆలయం, దర్గాలు మరింత అభివృద్ధి చెందుతాయని, పర్యాటక శోభ సంతరించుకొనే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. . -
ప్రసిద్ధ కట్టడంగా కాళోజీ కళాకేంద్ర నిర్మాణం
-పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు హన్మకొండ(వరంగల్ జిల్లా) ప్రపంచలోనే ప్రసిద్ధ కట్టడంగా కాళోజి కళా కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు చెప్పారు. హన్మకొండలో రూ.50 కోట్లతో నిర్మిస్తున్న కేంద్రాన్ని ఆదివారం ఆయన పరిశీలించి ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం హరిత కాకతీయ హోటల్లో విలేకరులతో మాట్లాడుతూ.. 4.5 ఎకరాల్లోని 12,900 చదరపు మీటర్ల స్థలంలో 207 పిల్లర్లు, నాలుగు అంతస్థుల(జీ ప్లస్ 4)తో 70 అడుగులో ఎత్తులో నిర్మిస్తున్నట్లు తెలిపారు. 1150 మంది కూర్చునేలా ఆడిటోరియం నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 115 పిల్లర్ల నిర్మాణం పూర్తరుుందని చెప్పారు. మరో ఏడాదిలో పూర్తవుతుందని తెలిపారు. ఈనెల 12 నుంచి 23 వరకు జరిగే కృష్ణా పుష్కరాల కోసం పర్యాటకుల సౌకర్యార్థం నాగార్జునసాగర్‌లో రెండు ఏసీ బోట్లు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. నాగార్జునసాగర్ హిల్ కాలనీ పుష్కరఘాట్ నుంచి నాగార్జున కొండ మధ్య వీటిని నడుపుతామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా సోమశిలలోని శ్రీ లలిత సోమేశ్వర దేవస్థానం పుష్కరఘాట్ వద్ద కూడా ఏసీ బోట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ బోట్లో శ్రీశైలం డ్యాం వరకు వెళ్లి రావచ్చని, ఇందులో రెస్టారెంట్ సౌకర్యం ఉందని చెప్పారు. ఆలంపూర్లో పర్యాటకుల సౌకర్యార్థం తుంగభద్ర నది సమీపాన హరిత ఆలంపూర్‌ను నిర్మించినట్లు తెలిపారు. కృష్ణా పుష్కరాలకు రాష్ట్ర పర్యాటకాభివృద్ది సంస్థ ప్రత్యేక టూర్ ప్యాకేజీలు ప్రవేశ పెట్టిందన్నారు. ఆయన వెంట రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ కత్తి నాథన్, డీఈ సామ్యేల్, ఏఈ రామకృష్ణ ఉన్నారు. -
మాజీ డీజీపీ మనవడి దుర్మరణం
పటాన్చెరులో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన వరుణ్‌తో పాటు పెదనాన్న కుమారుడు అమిత్, స్నేహితుడు జ్ఞాన్దేవ్ కూడా మృతి పాల ట్యాంకర్‌ను అమిత వేగంతో ఢీకొట్టిన స్కోడా కారు పొగమంచు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసుల అంచనా సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను చుట్టి ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డుపై మరో ఘోర ప్రమాదం జరిగింది. మాజీ డీజీపీ, తెలంగాణ పర్యాటక సంస్థ చైర్మన్ పేర్వారం రాములు మనవడు వరుణ్ పవార్ (21)తో పాటు మరో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డుపై కోకాపేట ప్రాంతంలో బుధవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న స్కోడా కారు.. ముందు వెళుతున్న పాల ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు తునాతునకలైంది. అందులో ప్రయాణిస్తున్న వరుణ్ పవార్‌తో పాటు అమిత్ పవార్ (21), జ్ఞాన్దేవ్ (21) మరణించారు. మరో యువకుడు రాహుల్ పవార్ (22) తీవ్రగాయాలతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుభకార్యానికి వెళ్లివస్తూ.. పేర్వారం రాములు కుమార్తె రేవతి కుమారుడే వరుణ్ పవార్. రేవతి పదేళ్ల క్రితమే మరణించడంతో వరుణ్ తాతయ్య వద్దే ఉంటున్నాడు. అమిత్ పవార్, రాహుల్ పవార్ వరుణ్ పెదనాన్న కుమారులు. మంగళవారం రాత్రి పటాన్చెరులో ఓ స్నేహితుడి ఇంట్లో శుభాకార్యానికి వరుణ్ పవార్, అమిత్పవార్, రాహుల్పవార్లతో పాటు వారి స్నేహితుడు కుందన్‌బాగ్‌కు చెందిన జ్ఞాన్దేవ్ కలసి వెళ్లారు. అర్ధరాత్రి కావడంతో పటాన్‌చెరులోని ఫాంహౌస్‌లోనే ఉండి బుధవారం ఉదయం ఇంటికి బయలుదేరారు. ఉదయం 6.30 ప్రాంతంలో ఓఆర్ఆర్పై కోకాపేట్ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా అమిత వేగంతో ఉన్న వారి వాహనం అదుపుతప్పి ముందు వెళుతున్న పాల ట్యాంకర్ (టీఎస్ 08 యూఏ 0086)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుణ్, అమిత్, జ్ఞాన్దేవ్ అక్కడికక్కడే మృతిచెందారు. రాహుల్‌కు తీవ్ర గాయాలు కావడంతో కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఈ కారును వరుణ్ నడుపుతుండగా.. ముందు సీట్లో జ్ఞాన్దేవ్, వెనుక సీట్లలో మిగతా ఇద్దరూ కూర్చున్నారు. నుజ్జునుజ్జయిన కారు.. ట్యాంకర్ వెనుక ఇరుక్కున్న స్కోడా వాహనాన్ని పోలీసులు, స్థానికులు క్రేన్ సహాయంతో బయటికి తీశారు. అమిత వేగంతో ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయిపోవడంతో తీసేందుకు దాదాపు గంటసేపు పట్టింది. అనంతరం కారు ముందు భాగం నుంచి ఇద్దరి మృతదేహాలను తీసి, ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. పంజగుట్ట ద్వారకాపూరి కాలనీలోని పేర్వారం నివాసానికి మృతదేహాలను తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు మృతి చెందడంతో బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు మృతదేహాలపై పడి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సైబరాబాద్ కమిషనర్ సి.వి.ఆనంద్, పలువురు ప్రముఖులు అక్కడికి వచ్చి పేర్వారం రాములును పరామర్శించారు. మృతదేహాల్ని వారి స్వస్థలం నిజామాబాద్ జిల్లాకు తరలించారు. ప్రమాదానికి పొగమంచే కారణమా? కోకాపేట్ ప్రాంతంలో ఔటర్ రింగ్‌రోడ్ చుట్టూ దట్టమైన చెట్లు, కొండలు ఉన్నాయి. ఉదయం వేళల్లో పొగమంచు అధికంగా ఉంటుంది. ఆ కారణంగానే ముందు వెళుతున్న వాహనాన్ని వరుణ్ గమనించక ఢీకొట్టి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. పాల ట్యాంకర్ వెనుక బంపర్ ఎత్తులో ఉండటంతో పాటు కమాన్పట్టీలను ఎక్కువగా ఏర్పాటు చేశారు. ఇదికూడా ప్రమాద తీవ్రతను పెంచాయని చెబుతున్నారు. ట్యాంకర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ్ముళ్లు చనిపోయారు.. అన్నది బతుకుపోరాటం నిజామాబాద్‌కు చెందిన దివంగత మాజీ ఎమ్మెల్యే సతీశ్‌పవార్ సోదరులు దిగంబర్ పవార్, సుభాష్ పవార్. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న దిగంబర్ పవార్ కుమారులే రాహుల్, అమిత్. మేడ్చల్‌లోని సీఆర్పీ కాలేజీలో రాహుల్ బీటెక్ ఫైనలియర్, అమిత్ బీటెక్ సెకండియర్ చదువుతున్నారు. రోడ్డు ప్రమాదంలో అమిత్ చనిపోగా.. రాహుల్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. --------------- నీలో కూతురిని చూసుకుంటున్నా.. నిజామాబాద్‌లో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న సుభాష్పవార్, పేర్వారం రాములు కుమార్తె రేవతి దంపతులు. వారికి వరుణ్ (23) ఏకైక కుమారుడు. రేవతి పదేళ్ల క్రితమే మరణించడంతో వరుణ్ తాతయ్య పేర్వారం రాములు ఇంట్లోనే ఉంటున్నాడు. వరుణ్‌ను రాములు భార్య ఇందిర ప్రాణంగా చూసుకుంటారు.11:19 గంటలకు 11/25/2015 ప్రమాదంలో వరుణ్ మరణించడంతో ఆమె ఆవేదనలో కూరుకుపోయారు. ‘నీలో నా బిడ్డను చూసుకుంటున్నా.. ఇక ఎవరిని చూడాలి’ అని ఆమె చేసిన రోదనలు కంటతడిపెట్టించాయి. --------------- టీమ్1లో చేరతానని అన్నాడు ‘‘వరుణ్ బీఆర్క్ ఐదో సంవత్సరం చదువుతున్నాడు. చివరి ఏడాది ట్రైనింగ్ పేరిట కాలేజీ బయటే జాబ్ చేస్తుంటారు. వరుణ్‌కు గచ్చిబౌలిలోని టీమ్1 కంపెనీలో ఉద్యోగం వచ్చింది. బుధవారం అందులో చేరుతున్నానని మంగళవారమే మాకు చెప్పాడు. కానీ అదేరోజున మరణించాడు. వరుణ్ ఇక లేడన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాం..’’ - ప్రొఫెసర్ కేజేఏబీ బాబు, వైష్ణవి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ అండ్ ప్లానింగ్ -
ఔటర్ రింగ్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం
-
హైదరాబాద్ చుట్టూ గోల్ఫ్ కోర్సులు
రాయదుర్గం: విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు నగరం చుట్టూ అంతర్జాతీయ ప్రమాణాలతో 5 నుంచి 10 గోల్ఫ్ కోర్సుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు వెల్లడించారు. గచ్చిబౌలిలోని డాక్టర్ వైఎస్సార్ నిథమ్‌లో మంగళవారం జాతీయ స్థాయి సదస్సు ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగరం చుట్టూ ఉన్న శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, నర్సాపూర్, సదాశివపేట్, కీసర వంటి ప్రాంతాలలో ఈ గోల్ఫ్ కోర్సులను 200 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. నగరం నుంచి 50 కిలోమీటర్ల లోపు, ఔటర్ రింగురోడ్డు నుంచి అరగంటలో వెళ్లే ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారన్నారు. స్థలం ఉన్న వారు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తే అనుమతి ఇస్తామని, లేకుంటే లీజుకు ఇచ్చినా టీఎస్‌టీడీసీ ఏర్పాటు చేస్తుందన్నారు. హైదరాబాద్‌లోని గోల్ప్ కోర్సు 130 ఎకరాల్లో ఉందని, అంతర్జాతీయ ఆటగాడు టైగర్‌వుడ్ లాంటి వారు ఆడేందుకు ఆసక్తి కనబరుస్తారని అందుకే ఈ నిర్ణయిం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి కేంద్రం రూ. 90 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించిందని ఆయన తెలిపారు. భువనగిరి కోట అభివృద్ధికి రూ. 4.8 కోట్ల కేంద్ర నిధులతో పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీఎస్‌టీడీసీ మేనేజింగ్ డెరైక్టర్, నిథమ్ డెరైక్టర్ డాక్టర్ కిష్ట్రినా చోంగ్తూ పాల్గొన్నారు. -
పర్యాటక రంగ అభివృద్ధికి సహకరించండి
కేంద్ర పర్యాటక శాఖ మంత్రికి పేర్వారం రాములు విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధికి తగిన సహకారం అందించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి డా.మహేష్‌శర్మకి తెలంగాణ పర్యాటకశాఖ చైర్మన్ పేర్వారం రాములు విజ్ఞప్తి చేశారు. ఆయన కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి రవాణాశాఖ భవన్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రితో బుధవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించిన పలు కొత్త ప్రాజెక్టులను ఆయనకు వివరించారు. అనంతరం పేర్వారం రాములు మీడియాకి వివరాలు తెలిపారు. అయోధ్య నుంచి శ్రీలంక వరకు రామాయణంలోని ముఖ్య ఘట్టాలను వివరించే ప్రాంతాలను కలుపుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న టూరిజం సర్క్యూట్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఉన్న పర్ణశాలను చేర్చాలని కోరినట్టు తెలిపారు. సోమశిల, శ్రీశైలం నుంచి అక్కమహాదేవి గుడుల అభివృద్ధికి రూ. 80కోట్ల నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. వరంగల్ నుంచి ఏటూరి నాగారం వరకు ఎడమవైపు మేడారం, కుడివైపు లక్నవరం, రామప్ప, పాకాలను కలుపుతూ గిరిజన పర్యాటక సర్క్యూట్ అభివృద్ధికి రూ.120 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎకోటూరిజం, ట్రైబల్ టూరిజం, హైదరాబాద్ వంటి నగరాల్లోని టూంబ్స్‌ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అత్యధిక నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరినట్టు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కేంద్రమంత్రి ఆనంద్‌శర్మ స్పందిస్తూ.. తెలంగాణకు వీలైనంత సాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. -
పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పేర్వారం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ గా మాజీ డిజీపీ పేర్వారం రాములు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా రాములుకు కేబినెట్ హోదా కల్పించింది. కాగా రాములు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పబ్లిక్ కమిషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు. ఆయన సేవలను వినియోగించుకోవాలని భావించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. -
పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పేర్వారం!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మాజీ డీజీపీ పేర్వారం రాములు నియమితులు కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాములు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. అనంతర కాలంలో ఆయన టీఆర్ఎస్లో చేరారు. ఆయన సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించనున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం. -
ప్రభుత్వానిది నక్సల్స్ ఎజెండే: పేర్వారం
రఘునాథపల్లి: దళితులకు భూమి, యువతకు ఉపాధిలాంటి ఎన్నో హామీలను నెరవేరుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. నక్సల్స్ ఎజెండాలా ముందుకు పోతున్నదని రిటైర్డ్ డీజీపీ, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు పేర్వారం రాములు అన్నారు. వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలోని ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. దళితులకు భూ పంపిణీ, ఎస్టీ, మైనార్టీల వర్గాల దుర్బర దారిద్య్రాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నందున నక్సల్సై ఎజెండా.. ప్రభుత్వ ఎజెండా ఒక్కటిలా ఉందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల పంపకాలు పూర్తి కాలేదని, ఒక్కొక్కరు మూడు నాలుగు శాఖలు నిర్వహిస్తూ ఇద్దరు ముఖ్యమంత్రుల వద్ద పనిచేయాల్సి వస్తుందన్నారు. సంక్రాంతి వరకు పాలన గాడిలో పడుతుందని తెలిపారు. -
పేర్వారం వర్సెస్ ఆంజనేయరెడ్డి
రాష్ట్ర విభజనపై ఇద్దరు ఐపీఎస్ మాజీ అధికారులు మాటల తూటాలు విసురుకుంటున్నారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరు మాజీ ఉన్నతాధికారుల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా సాగుతోంది. రాష్ట్రం ముక్కలయితే మంచిదని ఒకరంటే, కలిసుంటేనే కలదు సుఖమని మరొకరంటున్నారు. రాష్ట్రం విడిపోవాలని టీఆర్ఎస్ పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న మాజీ డీజీపీ పేర్వారం రాములు కోరుకుంటున్నారు. విడిపోతే చెడతామంటూ ప్రజారాజ్యం పార్టీలో కీలకపాత్ర పోషించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సి.ఆంజనేయరెడ్డి అంటున్నారు. రాములు పార్టీ వేదికగా విభజన గళం విన్పిస్తుండగా, ఆంజనేయరెడ్డి ‘రాష్ట్ర పరిరక్షణ వేదిక’ ద్వారా సమైక్య వాణి విన్పిస్తున్నారు. రాష్ట్ర విభజన వల్ల తెలుగు భాష, జాతి, సంస్కృతి నాశనమవుతాయని ఆంజనేయరెడ్డి ఆవేదన చెందుతున్నారు. విభజన జరిగితే.. కేసీఆర్ కుటుంబం ఆగడాలు అధికమవుతాయని 'దొరసేన' పేరుతో పరోక్షంగా ప్రస్తావించారు. రాష్ట్రం విడిపోతే దొరసేన విజృంభిస్తుందని, నక్సల్స్‌ను మించిన దోపిడీతరం వస్తుందని హెచ్చరిస్తున్నారు. ముంబైలో శివసేన తరహాలో ఇక్కడ దొరసేన తయారైందని, ఉద్యమ నేత కొడుకు, కూతురు, మేనల్లుడు.. సినిమా, పారిశ్రామిక రంగాల వారి నుంచి బలవంతంగా వసూళ్లు చేస్తున్నారని ఆంజనేయరెడ్డి ఆరోపించారు. ఆంధ్రావాలే బాగో అంటున్నవారు.. తర్వాత గుజరాతీ, రాజస్థానీ బాగో అనరనే గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్ ఇప్పటికే ఉగ్రవాదానికి కేంద్రంగా మారిందని, అది మరింత పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. అన్నివాదాల కంటే ప్రాంతీయవాదం ప్రమాదకరమని, రాష్ట్ర విభజన తర్వాత అది కులవాదం, మతవాదంగా రూపాంతరం చెందుతుందని అభిప్రాయపడ్డారు. విభజనపై ఆంజనేయ రెడ్డి ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని పేర్వారం రాములు విమర్శించారు. అసలు సీమాంధ్ర నుంచే తెలంగాణకు నక్సలిజం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 1980కు ముందు తెలంగాణలో నక్సలిజమే లేదని, ఈ విషయం ఆంజనేయరెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. నక్సలిజం తెలంగాణకే పరిమితమైన సమస్యగా చిత్రీకరించే కుట్రకు సీమాంధ్రులు పాల్పడుతున్నారని, ఇవన్నీ ఆంజనేయరెడ్డికి తెలియకుండానే మాట్లాడుతున్నాడా అని నిలదీశారు. ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవితో సామాజిక తెలంగాణ అన్పించారని, రాష్ట్ర విభజనపై అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని ధ్వజమెత్తారు. పేర్వారం, ఆంజనేయరెడ్డి మాటల యుద్ధం ఎంతవరకు వెళుతుందో చూడాలి. -
'హైదరాబాద్ శాంతిభద్రతలు కేంద్రానికి అప్పగించరాదు'
రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ శాంతిభద్రతల అంశాన్ని కేంద్ర పరిధిలోకి తీసుకురావడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విశ్రాంత డీజీపీ, టీఆర్ఎస్ నేత పేర్వారం రాములు అన్నారు. హైదరాబాద్ శాంతిభద్రతలు, ఇతర కీలక పరిపాలన అంశాలను గవర్నర్ ఆధీనంలో ఉంచనున్నట్టు వార్తలు రావడంతో ఆయన పైవిధంగా స్పందించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్, తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రులకు ఎటువంటి భయం అవసరం లేదని రాములు భరోసా ఇచ్చారు. వారికి పూర్తి భద్రత ఉంటుందని రాములు పేర్కొన్నారు.