ప్రజాభీష్టం మేరకే నూతన జిల్లాలు
-
రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పేర్వారం రాములు
రఘునాథపల్లి : పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్ధవంతమైన పాలకుడని రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పేర్వారం రాములు అన్నారు. మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ దురుద్దేశ్యంతో కొందరు కేసీఆర్ నియంత అంటూ మాట్లాడుతుండడం సరికాదన్నారు. ప్రజాభీష్టం మేరకు కొత్త జిల్లాలు ఏర్పాటుచేస్తున్నారని స్పష్టం చేశారు. పోరాటాలకు పురిటి గడ్డ అయిన జనగామను జిల్లాగా ఏర్పాటుచేయడం శుభపరిణామమన్నారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆయన నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్, జేఏసీ నాయకులు మారుజోడు రాంబాబు, దశమంతరెడ్డి, లకీ‡్ష్మనారాయణ, పోకల శివకుమార్, నామాల బుచ్చయ్య, పెండ్లి మల్లారెడ్డి, చెంచు రమేష్ తదితరులు పాల్గొన్నారు.