రాణీ రుద్రమదేవిలో నటిస్తున్నా
పాలకొల్లు అర్బన్: ‘చిన్నదానా.. ఓసీ చిన్నదానా.. ఆశ పెట్టేసిపోమాకే కుర్రదానా..’ అంటూ కుర్రకారు మనసులు దోచుకున్న నటి రక్ష టెలీ సీరియల్ నిర్మాణంలో భాగంగా పాలకొల్లు వచ్చారు. అను ష్క ప్రధాన పా త్రలో గుణశేఖర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న రా ణీ రుద్రమదేవి సిని మాలో నటిస్తున్నట్టు చెప్పారు. ఆమె వ్యక్తిగత, సినీ విషయాలు..
మీ స్వస్థలం
విశాఖ జిల్లా యల మంచిలి. స్థిరపడింది చెన్నైలో
సినీ పరిశ్రమలోకి ఎలా ప్రవేశించారు
నాన్న నరసింగరావు నిర్మాత. ఎన్టీఆర్, శోభన్‌బాబుతో మూడు సినిమాలు నిర్మించారు. దీంతో సినీ పరిశ్రమలోకి రాగలిగా.
తొలి సినిమా
మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా అంకుల్‌బన్‌లో నటించా. మమ్ముట్టి హీరోగా జానీవాకర్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించా.
ఇప్పటివరకు ఎన్నిచిత్రాల్లో నటించారు
400 సినిమాలు
డ్రీమ్ రోల్ ఏంటి
అన్ని రకాల పాత్రలు చేశా. హీరోయిన్ వాణిశ్రీలా పేరు తెచ్చుకోవాలని ఉంది.
ఎక్కువగా ఆనందించిన క్షణాలు
నచ్చావులే (2010) సినిమాలో హీరోకి తల్లి వేషం వేశా. ఆ చిత్రానికి నంది అవార్డు రావడం
టెలీ సీరియల్స్ ఏమైనా చేశారా
లేదండి. గురువుగారు దాసరి నారాయణరావు నిర్మాణ సారథ్యంలో మొదటిసారిగా లేడీ విలన్ రోల్ చేస్తున్నా. ప్రస్తుతం షూటింగ్‌లో వుంది.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు
రాణీరుద్రమదేవి, పడ్డానండీ ప్రేమలో పడి, నాగచైతన్య సినిమాలో నటిస్తున్నా. తమిళంలో రెండు, కన్నడంలో ఓ చిత్రంలో నటిస్తున్నా.
ఇష్టమైన హీరో, హీరోయిన్
నందమూరి తారక రామారావు, వాణిశ్రీ
గోదావరి అందాలపై మీ అభిప్రాయం
తొలిసారిగా ఈ ప్రాంతానికి వచ్చా. గోదావరి అందాలు కట్టిపడేస్తున్నాయి.