తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు జైలర్ కొడుకు యశ్వంత్ మెసేజ్ పంపడంతో పోలీసులు గాలింపు మొదలు పెట్టారు.
ఒంగోలు: తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు జైలర్ కొడుకు యశ్వంత్ మెసేజ్ పంపడంతో పోలీసులు గాలింపు మొదలు పెట్టారు. యశ్వంత్ తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం యశ్వంత్ ''నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను'' అని తండ్రికి, స్నేహితుడికి మెసేజ్లు ఇచ్చాడు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్-2 వద్ద యశ్వంత్ చెప్పులు, సెల్ ఫోన్ ఉన్నాయి. దాంతో అతను ఆ ట్యాంకులోపడి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.
పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరూ ట్యాంక్ వద్దకు చేరుకున్నారు. ఈతగాళ్లను రప్పించి వెతికించారు. ఫలితంలేదు. రాత్రి వెతకడం కష్టంగా ఉండటంతో, మళ్లీ రేపు ఉదయం వెతకాలని నిర్ణయించుకున్నారు.
**