ప.గో: పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కె.భాస్కర్, జేసీ బాబురావు నాయుడు ప్రభుత్వ ఉద్యోగులను వేధించారన్న అంశంపై కలెక్టర్ వివరణ ఇచ్చారు. ఆదివారం 'సాక్షి' తో మాట్లాడిన ఆయన ఉద్యోగులను వేధించలేదని తెలిపారు. గత కొంతకాలంగా అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ప్రజలు మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు అందాలంటే పని చేసే నివాసం ఉండాలని తెలిపారు. ఏ రోజూ అర్ధరాత్రి వరకూ సమావేశాలు నిర్వహించలేదన్నారు.
తాము నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నామని తెలిపారు. ఆఫీస్ సమయవ దాటి ఒక్కగంట పని చేసేది లేదని.. లక్ష్యాలు కూడా ఏమీ విధించకూడదని ఆయన పేర్కొన్నారు. పనిచేసే చోట నివాసం ఉండలేమంటే అభివృద్ధి ముందుకు సాగదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రతి శుక్రవారం సాయంత్రం ఒక గంట ఉద్యోగు సమస్యల పరిష్కారానికి సమయం కేటాయించామని కలెక్టర్ కె.భాస్కర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులను చిన్నచిన్న కారణలతో కలెక్టర్ షోకాజ్ నోటీసులిస్తూ ఉద్యోగలపై కక్షసాధిస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడిన సంగతి తెలిసిందే.