'దున్నపోతులు, పందులంటూ తిడతారా?' | Govt employees union leaders takes on West godavari district collector and joint collector | Sakshi
Sakshi News home page

'దున్నపోతులు, పందులంటూ తిడతారా?'

Published Sun, Nov 30 2014 2:00 PM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM

Govt employees union leaders takes on West godavari district collector and joint collector

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కె.భాస్కర్, జేసీ బాబురావు నాయుడు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై ఉద్యోగ సంఘాల నేతలు ఆదివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను చిన్నచిన్న కారణలకే షోకాజ్ నోటీసులిస్తూ ఉద్యోగలపై కక్షసాధిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులను దున్నపోతులు, పందులంటూ తిడతారా అని ప్రశ్నించారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే వారికీ కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం లేదని తెలిపారు.

మీరుండే బంగ్లాలు అత్తవారిచ్చిన ఆస్తులు కాదు... ప్రభుత్వ ఆస్తులు అన్న విషయం గుర్తుంచుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు కలెక్టర్, జేసీలకు సూచించారు. ఉద్యోగులను వేధిస్తే సహించం... కలెక్టర్ భాస్కర్, బాబురావులను వెంటనే బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సంబంధాలు నెరపడంలో ఆ ఇద్దరు ఉన్నతాధికారులు విఫలమయ్యారని... ఈ నేపథ్యంలో ప్రాధాన్యత లేని పోస్టులకు వారిని బదిలీ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. త్వరలో సీఎం చంద్రబాబును కలసి కలెక్టర్, జేసీ వైఖరిని వివరిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement