రాయల తెలంగాణ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తనకు సమాచారం లేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
హైదరాబాద్: రాయల తెలంగాణ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తనకు సమాచారం లేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కేంద్రం రాయల తెలంగాణ ఏర్పాటు అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలనేదే ప్రజల ఆకాంక్షని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా కూడా ఒప్పుకోమని ఆయన తెలిపారు. అసెంబ్లీ ప్రోరోగ్ ఫైల్ తన వద్ద ఉందని, రాజకీయంగా దానికి అంత ప్రాధాన్యత లేదన్నారు. ప్రోరోగ్ అనేది సాంకేతిక అంశమన్నారు.
రాష్ట్ర విభజన అంశంపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అంతకముందు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ఆయన శనివారం ఉదయం జీవోఎం సభ్యుడు జైరాం రమేష్తో సమావేశం అయ్యారు. భేటీ అనంతరం దామోదర విలేకర్లతో మాట్లాడుతూ రాయల తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయని, అయితే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదన్నారు.