సిఎంపై సిబిఐకి లేఖ రాస్తా : శంకర్రావు | I will write letter to CBI: Sankara rao | Sakshi
Sakshi News home page

సిఎంపై సిబిఐకి లేఖ రాస్తా : శంకర్రావు

Published Mon, Feb 3 2014 4:23 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

సిఎంపై సిబిఐకి లేఖ రాస్తా : శంకర్రావు - Sakshi

సిఎంపై సిబిఐకి లేఖ రాస్తా : శంకర్రావు

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  అవినీతితో అక్రమ ఆస్తులు కూడగట్టారని మాజీ మంత్రి శంకర్రావు ఆరోపించారు. ఆయన ముఖ్యమంత్రి కాకముందు, ఆ తరువాత  పెరిగిన ఆస్తులపై సీబీఐకి లేఖ రాస్తానని చెప్పారు. సీబీఐ విచారణ జరిగితే సీఎం జైలు కెళ్లడం ఖాయం అని ఆయన పేర్కొన్నారు.

తనను మంత్రి పదవి నుంచి తొలగించిన నాటి నుంచి శంకర్రావు సిఎంపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. సిఎం, అతని తమ్ముడి అవినీతి భాగోతాలు ఒక్కొక్కటిగా బయటపెడుతూనే ఉన్నారు. ఈ సారి ఏకంగా సిబిఐకి లేఖ రాస్తానని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement