=అత్యధిక పాఠశాలల్లో కనిపించని మరుగుదొడ్లు
=నీటి వసతి లేక కొన్నిచోట్ల మూత
=ఇంకొన్ని చోట్ల అసంపూర్తి నిర్మాణాలు
=విద్యార్థులకు తప్పని తిప్పలు
=ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇదీ పరిస్థితి
సాక్షి, చిత్తూరు: జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 3,957, ప్రాథమికోన్నత పాఠశాలలు 480, ఉ న్నత పాఠశాలలు 608 ఉన్నాయి. వీటిల్లో జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరు రోజులో 8 గం టలు పాఠశాలల్లోనే గడుపుతున్నారు. ఆ సమయంలో మల, మూత్రవిసర్జనకు నానా అగచా ట్లు పడుతున్నారు. ప్రభుత్వం ఉచితంగా సమకూర్చుతున్న శానిటరీ నాప్‌కిన్స్‌ను యుక్తవయ స్సు విద్యార్థినులు ఉపయోగించుకోవాలన్నా, పరిశుభ్రమైన మరుగుదొడ్లు పాఠశాలలో అందుబాటులో లేవు.
బాలురు ఆరు బయట స్థలాల్లోనే మల, మూత్రవిసర్జన చేస్తున్నారు. బా లికల పరిస్థితి దయనీయంగా ఉంది. ఆరుబ యట మల, మూత్ర విసర్జన చేయలేక గంటల కొద్దీ ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభావం వారి ఆరోగ్యంపై పడుతోంది. మూత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాజీవ్ విద్యామిషన్ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో మరుగుదొడ్లు లేని పాఠశాలలు 45 మాత్రమే. అదే ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల లెక్కల్లో 521 పాఠశాలలకు మరుగుదొడ్లు లేవు. నీరు లేక నిరుపయోగంగా మారిన పాఠశాలలు వెయ్యికిపైగా ఉన్నాయి. పాఠశాలల్లో బాలికల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట్ల 700 మ రుగుదొడ్లు రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో నిర్మించేందుకు ఏడాది క్రితం అప్పటి కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ నిధులు మంజూరు చేశా రు. అయితే ఇంత వరకు మరుగుదొడ్ల ని ర్మాణం పూర్తి కాలేదు.
సమస్య తీవ్రత ఇలా..
చిత్తూరులోని మిట్టూరు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో తలుపులు లేక మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. డీఈవో ఆఫీసు పక్కనే ఉన్న ఉన్నత పాఠశాలలోని మరుగుదొడ్లలో చెత్త వేయడంతో అవి నిరుపయోగంగా మారా యి. చిత్తూరు రూరల్ మండలంలోని పాఠశాలలకు ఒక్కదానికీ నీటి వసతి లేదు.
సత్యవేడు మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల విద్యార్థులు సైతం మరుగుదొడ్లు లేక ఇబ్బం దిపడుతున్నారు. విద్యార్థినుల అవస్థలు వర్ణణాతీతం.
సత్యవేడు మండలంలోని 71 పాఠశాలల్లోని 65 పాఠశాలల్లో మరుగుదొడ్లు విద్యార్థులకు అందుబాటులో లేవు. మరుగుదొడ్లు ఉన్న 35 పాఠశాలల్లో 15పాఠశాలలకు నీటి వసతి లేదు. ఉన్నత పాఠశాలలు 11 ఉన్నాయి. వీటిల్లో మూడింటికి మాత్రమే నీటి వ సతి ఉంది. మిగిలిన పాఠశాలల్లో నీటి వసతి లేక మరుగుదొడ్లు ఉపయోగంలో లేవు.
పీలేరు నియోజకవర్గంలో 360 ప్రాథమిక, 41 ప్రాథమికోన్నత, 52 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. పలు ప్రాథమిక పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా వాటి నిర్వహణ కొరవడడంతో నిరుపయోగంగా మారాయి. ప్రాథమికోన్నత పాఠశాలల్లో పలుచోట్ల నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఉన్నత పాఠశాలల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడున్న 52 ఉన్నత పాఠశాలల్లో సగం పాఠశాలలకు మరుగుదొడ్లు లేవు.
తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పీటీఎం లోని ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు శిథి లావస్థలో ఉన్నాయి. పెద్దమండ్యం, ములకలచెరువు, బి.కొత్తకోట మండలాల్లోని పాఠశాలల్లో కొన్నిచోట్ల మరుగుదొడ్లు ఉన్నా నీటి వసతి లేక నిరుపయోగంగా మారాయి.
పుంగనూరు పరిధిలో 371 పాఠశాలలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ మరుగుదొడ్లు ఉన్నాయి. నీటి సమస్య కారణంగా చాలా వరకు నిరుపయోగంగా ఉన్నాయి.
మదనపల్లె మున్సిపాలిటీలోని ఉర్దూ మున్సిపల్ స్కూల్‌లో 637 మంది విద్యార్థులు చ దువుతున్నారు. ఇక్కడ బాలికలకు 8 మరుగుదొడ్లు ఉన్నాయి. అయితే నీటి వసతి లేదు. మూడురోజులకొకసారి మున్సిపాలిటీ వారు ట్యాంకర్ పంపుతున్నారు. ఈ నీళ్లు చాలడం లేదు.
కుప్పం నియోజకవర్గంలోని కుప్పం, రామకుప్పం, గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో 486 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 80 శాతం పాఠశాలలకు మరుగుదొడ్లు ఉ న్నా నీటి సమస్యతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. టైల్స్, పైపులైన్లు దెబ్బతిని శిథిలావస్థకు చేరుకున్నాయి.
హస్తి నియోజకవర్గంలో 400 పాఠశాలలు ఉన్నాయి. వీటిలోని 360 పాఠశాలలకు మరుగుదొడ్ల వసతి ఉంది. అయితే అత్యధిక పాఠశాలల్లో నీటి సమస్య వేధిస్తోంది. దీం తో విద్యార్థినులు మరుగుదొడ్లు ఉపయోగిం చుకోలేక పోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని పాఠశాలల మరుగుదొడ్లకు తలుపులు లేవు.
పలమనేరు నియోజకవర్గంలో 484 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 212 చోట్ల నీరు, ని ర్వహణ లేక మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. 30 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టలేదు. బెరైడ్డిపల్లె, వి.కోట మండలాల్లో మరుగుదొడ్లకు తలుపులు లేవు. పాఠశాల గ్రాంట్‌లను మరుగుదొడ్ల నిర్వహణకు ఉపయోగించడం లేదు.
విద్యార్థులకు తప్పని తిప్పలు
Published Mon, Dec 9 2013 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM
Advertisement
Advertisement